
కరోనా వేళ అందరూ భయపెడుతుంటే ప్రభుత్వాలు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు పావులుగా మారపోతున్నారు. కరోనా చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్న ఆంధ్రులను సరిహద్దులో అడ్డుకోవడంతో నొచ్చుకున్నారు. వైద్యం కోసం వస్తే ఆక్షేపించడం ఏమిటని ఆరోపిస్తున్నారు. ఏదో సంపాదించుకోవడానికి కాదు కదా ప్రాణం నిలుపుకోవడానికి వస్తున్న వారిని ప్రాంతం పేరుతో అడ్డుకోవడం మర్యాద కాదని పలువురు పెదవి విరుస్తున్నారు. తెలంగాణ సర్కారు చేసిన పనికి సిగ్గుపడుతున్నారు. వైద్యం కోసం వచ్చే వారిని మా దగ్గరకు రావద్దని చెప్పడం సమంజసం కాదు. వారి దగ్గర అవకాశాలు లేకే మన దగ్గరకు వస్తున్న విషయం గమనించుకోవాలి.
ఏపి ప్రభుత్వం సైతం స్పందంచింది. కానీ ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణ చేయకుండా వారి ప్రాంతంలో కూడా మంచి ఆస్పత్రులు ఉండాలని భావించి ఆ దిశగా చర్యలు చేపట్టింది. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు మూడు పెద్ద నగరాల్లో ప్రత్యేకంగా హెల్త్ హబ్ లు ఏర్పాటు చేయాలని భావించి నిధులు కేటాయిస్తోంది. ఒక్కో హబ్ ముప్పై నుంచి యాభై ఎకరాల్లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో ఆస్పత్రి కోసం ఐదు ఎకరాల చొప్పున స్థలం కేటాయిస్తున్నారు. సీఎం జగన్ ఈమేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఖరీదైన వైద్యం కోసం ప్రజలు పరుగులు పెట్టాల్సిన పని లేదని సూచిస్తున్నారు. హైదరాబాద్ వైపు చూడాల్సిన పని లేకుండా ఇక్కడే ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ ఇకపై వైద్యం కోసం వెంపర్లాడకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీ ప్రజలు ప్రస్తుతం పడుతున్న కష్టాలు ఇంకా ఎంతో కాలం ఉండవని భావిస్తున్నారు. వచ్చే రెండు మూడు ఏళ్లలో ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చి వైద్యం అందరికి అందుతుందని చెబుతున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రజాశ్రేయస్సు కోసమే అహర్నిషలు శ్రమిస్తామని ప్రకటించారు.