Homeజాతీయ వార్తలుDelhi Liquor Scam : అవినాష్ కోసం కేసీఆర్ పైకి జగన్: కేంద్రంతో పెట్టుకుంటే అలానే...

Delhi Liquor Scam : అవినాష్ కోసం కేసీఆర్ పైకి జగన్: కేంద్రంతో పెట్టుకుంటే అలానే ఉంటది మరి

Delhi Liquor Scam : శరత్ అప్రూవర్ గా మారాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో మరిన్ని విషయాలు తవ్వేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తదుపరి అడుగులు వేస్తోంది. ఈ వ్యవహారంలో శరత్ అప్రూవర్ గా మారడం వెనక ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉన్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శరత్ అప్రూవర్ గా మారితే కేసీఆర్ కు చేటు కలుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు కేసీఆర్ పై రివెంజ్ తీర్చుకునేందుకు అతడి పైకి జగన్ ను కేంద్రం ఉసి గొలిపినట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతోనే శరత్ అప్రూవర్ గా మారాడని, అతను చెప్పే వివరాల ఆధారంగా ఈ డి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితను ఏ క్షణాన్నైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జగన్ కేసీఆర్ కు వ్యతిరేకంగా మారడం వెనక అవినాష్ బెయిల్ వ్యవహారం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.
ఇంతకీ ఏం జరగబోతుంది
ఢిల్లీ మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు శరత్ చంద్రా రెడ్డికి శల్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఆయనను అప్రూవర్ గా మారేందుకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా పంజాబ్ ఎన్నికల్లో ఈ కుంభకోణం ద్వారా వచ్చిన లాభాలను వెచ్చించారు. ఇదే విషయాన్ని సిబిఐ, ఈడి తన చార్జి షీట్లల్లో పేర్కొన్నాయి. మేరకు శరత్ భార్య కనిక రెడ్డి సంస్థ జెట్ సెట్ గోకు చెందిన విమానాల ద్వారా ఢిల్లీ, పంజాబ్, గోవా రాష్ట్రాలకు నగదు తరలింపు వెనుక ఉన్న సమాచారాన్ని అందజేసేందుకు శరత్ అంగీకరించాడని దర్యాప్తు సంస్థ అధికారులు చెబుతున్నారు. ఇక భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు అరుణ్ పిళ్లై బినామీ అనే విషయంలోనూ శరత్ కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక ఈడి కూడా కవితను ఏ క్షణంలో ఆయన అరెస్టు చేసేందుకు తగిన ఆధారాలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ద్వారా ఇప్పటికే కీలక సమాచారాన్ని ఈడీ సేకరించింది. శరత్ ఇచ్చే వివరాల ఆధారంగా కవితను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. కవిత సూచన మేరకు తాను ఢిల్లీ మద్యం కుంభకోణంలోకి దిగినట్టు, ఆమె తరఫున ముడుపులు బదిలీ చేసినట్టు, అక్రమంగా రిటైల్ జోన్లను నిర్వహించినట్టు బుచ్చిబాబు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారుల ఎదుట చెప్పినట్టు తెలుస్తోంది. ” కవిత విషయంలో కేంద్రం ఏం చేస్తుందో తెలియదు? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కథ మాత్రం ముగిసినట్టే” అని కేంద్ర దర్యాప్తు సంస్థలోని ఒక అధికారి చెప్పడం విశేషం.
విజయసాయి రెడ్డి ఏం చేశారంటే
నెల క్రితం బెయిల్ పై విడుదలైన శరత్ అప్రూవర్ గా మారడానికి దర్యాప్తు సంస్థలు వివిధ వర్గాల ద్వారా మధ్యవర్తిత్వం నడిపాయి. ఈ మంతనాల్లో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడే శరత్ చంద్రా రెడ్డి. శరత్ అప్రూవర్ గా మారే విషయమై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చర్చలు జరిపారని తెలుస్తోంది. అమిత్ షా_ జగన్ భేటీ తర్వాతే దర్యాప్తు సంస్థలకు ఈ విషయంలో కొన్ని కీలక ప్రదేశాలు అన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అమిత్_ జగన్ భేటీలో వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర పై చర్చకు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే షా చెప్పిన దానికి జగన్ తల ఊపినట్టు ప్రచారం జరుగుతుంది. కర్ణాటకలో బిజెపి ఓటమి తర్వాత దక్షిణాదిన పట్టు కోసం తెలంగాణలో అధికారంలోకి రావడం కీలకమని, అందుకే తాను చెప్పినట్టు చేయాలని జగన్ మోహన్ రెడ్డిని అమిత్ షా ఆదేశించినట్టు సమాచారం. షా ఆదేశాలతోనే కెసిఆర్ కు దూరంగా ఉండాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
కేంద్రం చెప్పినట్టు
ఇక ఢిల్లీ సర్కార్ అధికారాలకు కత్తెర వేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ విషయంలో మద్దతు ఇచ్చేందుకు జగన్ రెడ్డి అంగీకరించినట్టు సమాచారం. ఒక విధంగా జగన్ మోహన్ రెడ్డిని ఉపయోగించుకొని, కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక జగన్ పార్టీ ఎంపీల మద్దతుతో రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ గట్టెక్కుతుంది. దీంతో ఢిల్లీ పై పెత్తనం కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. అదే సమయంలో ఈ కేసులో కేజ్రివాల్ కనుక అరెస్టు అయితే తదుపరి ఎన్నికల్లో ఢిల్లీలో పాగా వేయడం భారతీయ జనతా పార్టీకి సులభం అవుతుంది. ఇక ఇదే తీరుగా జగన్ పార్టీ ద్వారా శరత్ రెడ్డిని అప్రూవర్ గా మార్చి తెలంగాణలోనూ పాగా వేయాలి అనేది బిజెపి వ్యూహంగా తెలుస్తోంది. తదుపరి అడుగులు ఏమిటో తెలియదు గాని.. మొత్తానికి అయితే కవిత చుట్టూ ఈడి రూపంలో కేంద్రం బలమైన వ్యూహం పన్నింది. దీని ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టే దిశగా కదులుతోంది.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular