https://oktelugu.com/

Jagan Mohan Reddy’s Big Blunder: సీఎం జగన్ పెద్ద తప్పు చేశాడా?

Jagan Mohan Reddy’s Big Blunder: రాజకీయంగా ఎదగాలంటే మంచి అడుగులు వేయాలి. తప్పటడుగులు వేస్తే మొదటికే మోసం వస్తుంది. చరిత్రలో లేకుండా పోతారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తన జీవితంలోకి లక్ష్మీపార్వతిని కనుక ఆహ్వానించి ఉండకపోతే ఇప్పుడు ఏపీకి నాలుగు సార్లు సీఎంగా మనం చంద్రబాబును చూసి ఉండేవాళ్లం కాదు.. రాజకీయ నాయకులు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని ఇలాంటి ఘటనలు బట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి నాయకుడు అంటే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2021 / 02:18 PM IST
    Follow us on

    Jagan Mohan Reddy’s Big Blunder: రాజకీయంగా ఎదగాలంటే మంచి అడుగులు వేయాలి. తప్పటడుగులు వేస్తే మొదటికే మోసం వస్తుంది. చరిత్రలో లేకుండా పోతారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తన జీవితంలోకి లక్ష్మీపార్వతిని కనుక ఆహ్వానించి ఉండకపోతే ఇప్పుడు ఏపీకి నాలుగు సార్లు సీఎంగా మనం చంద్రబాబును చూసి ఉండేవాళ్లం కాదు.. రాజకీయ నాయకులు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని ఇలాంటి ఘటనలు బట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి నాయకుడు అంటే తనకు అవసరం వచ్చినప్పుడల్లా చర్యకు దిగేవాడు మాత్రమే కాదు.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. భవిష్యత్తు సమస్యలను అంచనా వేయాలి. ఏదైనా అడుగు వేసేటప్పుడు తగినంత వివేకంతో యోచించాలి.

    Jagan Mohan Reddy

    ప్రస్తుతం సీఎం జగన్ లో ఉడుకునెత్తురు ఉప్పెన అయ్యి పారుతోంది. దూకుడు మంత్రం జపిస్తున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారు. తన రాజకీయ చతురతతో ప్రత్యర్థులను ఓడించి ప్రజల హృదయాలను గెలుచుకోవడంపై దృష్టి సారించే సకల సామర్థ్యాలు జగన్ లో ఉన్నాయి.

    ఎన్నికల సమయంలో ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అన్న జగన్ సంక్షేమ పథకాలను అన్నీ అమలు చేసి నిరూపించుకున్నారు. కానీ సాధారణ పరిపాలన విషయానికి వస్తే మాత్రం మాట మీద నిలబడలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

    శాసనమండలి రద్దు బిల్లును ఉపసంహరించుకోవడం జగన్ చేసిన మొదటి అతిపెద్ద తప్పు అని చెప్పొచ్చు. ఇక మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడం.. మళ్లీ మెరుగ్గా తెస్తానని చెప్పడంతో ఆయన మాట మీద నిలబడలేదని చెప్పలేని పరిస్థితి.

    శాసనమండలి రద్దు ఆలోచనను ఉపసంహరించుకోవడం వైసీపీ ప్రభుత్వాన్ని ఇప్పుడు దుర్భర స్థితిలోకి నెడుతోంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ కు మండలిలో బలం లేదు. టీడీపీ మొత్తం జగన్ చేసిన బిల్లులను అడ్డుకుంది. మెజార్టీ టీడీపీ సభ్యులను తట్టుకోలేక జగన్ మండలి రద్దు చేసి కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం ఆమోదించలేదు. జగన్ ఏది కోరితే అది నెరవేర్చడంలో కేంద్రం అంత సుముఖంగా లేదన్న నిజం కూడా తేలిపోయింది. మూడేళ్లు గడిచాయి. ఇప్పుడు మూడింట రెండొంతుల మందికంటే ఎక్కువ మెజారిటీని జగన్ మండలిలో సాధించారు. ఇప్పుడు తన పార్టీకి ఉన్న ప్రయోజనాన్ని గుర్తించిన జగన్ తన ఎమ్మెల్సీల ఒత్తిడితో మండలి రద్దు ఆలోచనను విరమించుకున్నారు.

    Also Read: జగన్ సర్కార్: ఏకపక్ష నిర్ణయాలు.. ఎదురుదెబ్బలు

    దీంతో జగన్ తొలిసారి మాట తప్పాడని.. వెనక్కి తగ్గాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ చేసిన ఈ తప్పును టీడీపీ నేతలు ఇప్పుడు ఎలుగెత్తి చాటుతున్నారు. జగన్ ను అభాసుపాలు చేస్తున్నారు.

    ఇక శాసనమండలి ఆమోదం లేకుండానే మూడు రాజధానుల బిల్లును జగన్ గవర్నర్ కు పంపారు. అది రాజ్యాంగ తప్పిదంగా మారింది. టీడీపీకి బలముందని మండలిరద్దు చేసిన జగన్ కేవలం ప్రతీకార కోణంలోనే ఆలోచించారు తప్పితే మండలిలో బలం వచ్చేదాకా ఆగలేకపోయారు. ఇప్పుడు వచ్చినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది. కనీసం ఇప్పటి నుంచైనా తన సొంత పార్టీ, తన పాలనా ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని జగన్ నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. లేకుంటే జగన్ తప్పుల సంఖ్య మరింత పెరిగి పలుచన అయ్యే అవకాశాలుంటాయి.

    Also Read: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గొడవ.. రైతుల్లో ఆందోళన!