https://oktelugu.com/

Jagan vs Amaravathi: అమరావతి సంబరాలకు జగన్ మార్క్ షాక్ లగా?

Jagan vs Amaravathi: అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్నారు రైతులు, టీడీపీ, బీజేపీ నేతలు. సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్టు తెలియగానే స్వీట్లు తెప్పించుకొని సంబరాలు చేసుకున్నారు. ఒకరినోట్లో ఒకరు పెట్టుకొని ఇక తమ ఆనందానికి అవధులు లేవని ఘనంగా ప్రకటించుకున్నారు. ఇక బీజేపీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సహా బీజేపీ నేతలు అమరావతి రైతులతో కలిసి పాదయాత్రలు చేస్తున్నారు. జాతీయ పార్టీ ఎంట్రీతోనే జగన్ […]

Written By: , Updated On : November 22, 2021 / 05:33 PM IST
Follow us on

Jagan vs Amaravathi: అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్నారు రైతులు, టీడీపీ, బీజేపీ నేతలు. సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్టు తెలియగానే స్వీట్లు తెప్పించుకొని సంబరాలు చేసుకున్నారు. ఒకరినోట్లో ఒకరు పెట్టుకొని ఇక తమ ఆనందానికి అవధులు లేవని ఘనంగా ప్రకటించుకున్నారు.

amaravathi sweets

amaravathi sweets

ఇక బీజేపీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సహా బీజేపీ నేతలు అమరావతి రైతులతో కలిసి పాదయాత్రలు చేస్తున్నారు. జాతీయ పార్టీ ఎంట్రీతోనే జగన్ భయపడ్డాడని.. మొన్న తిరుపతిలో జగన్ కు అమిత్ షా క్లాస్ పీకడంతో ఇలా వెనక్కి తగ్గాడని ఎన్నో విశ్లేషణలు మీడియాలో సాగాయి.

కానీ తనది ఒకటే మాట.. ఒకటే బాణం అని.. మాట తప్పను.. మడమ తిప్పను అన్న సిద్ధాంతంపై జగన్ ఇంత నిక్కచ్చిగా నిలబడుతాడని వాళ్లకు తెలియదు పాపం.. అలా తెలియకపోవడంతో ఇప్పుడు బుక్కై అమరావతి ఉద్యమకారులు హతాషులయ్యారు.

స్వీట్లు పంచుకున్న అమరావతి ఉద్యమకారులు మొఖాల్లో ఇప్పుడు నిరాశ కానవించింది. ఎవ్వరూ సంతోషంగా లేని పరిస్థితి. అందరి ముఖాలు వాడిపోయాయి. సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడం కేవలం న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలోనే మళ్లీ సమగ్రంగా వేస్తానన్న ప్రకటన అందరికీ షాకిచ్చింది. దీంతో సంబరాలకు బ్రేక్ పడి మరింత ఆందోళనకు కారణమైంది. ఇలా జగన్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ దెబ్బకు ఇప్పుడు అందరూ హతాషులయ్యారు.