Jagan Food: ఏపీ సీఎం చాలా ఫీట్ గా ఉంటారు. ఆరోగ్యంగా, ఉల్లాసంగా కనిపిస్తారు. అయితే ఆయన వ్యక్తిగత విషయాలు పెద్దగా ఎవరికి బయటికి తెలియదు. ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటమే అందుకు కారణం. ముఖ్యంగా ఆయన డైట్, ఫిట్నెస్ గురించి ఎలాంటి విషయాలు బయటకు పొక్కవు. మొన్న ఆ మధ్యన మంత్రి రోజా జగన్ ఆహారపు అలవాట్లు గురించి మాట్లాడారు. జగన్ కు ఇష్టమైన ఆహారం గురించి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చెప్పే విషయాలు వైరల్ అవుతున్నాయి.
సీఎం జగన్ ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తారు. దానికి తగ్గట్టే ఆహారం తీసుకుంటారు. ఆయనకు మామిడికాయ తురుముతో చేసే పులిహోర అంటే చాలా ఇష్టం. ఉదయం 4:30 గంటలకు జగన్ నిద్ర లేస్తారు. గంటసేపు యోగ, జిమ్ లాంటివి చేస్తారు. 5:30 కి న్యూస్ పేపర్స్ చదవడంతో పాటు ముఖ్యమైన అంశాలను గురించి నోట్స్ తయారు చేసుకుంటారు. ఆ సమయంలో టీ మాత్రమే తాగుతారు. 7 గంటలకు జ్యూస్ తీసుకుంటారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బదులు డ్రై ఫ్రూట్స్ తింటారు. ఇక సమీక్షలు చేసే సమయంలో చాక్లెట్ బైట్స్ తింటారట. మధ్యాహ్న భోజనంలో అన్నం కంటే పుల్కాలని ఇష్టపడతారు. అప్పుడప్పుడు రాగి ముద్ద, మటన్ కీమాను తింటారు. మధ్యాహ్నం భోజనం లో కొండ పెరుగు ఉండాల్సిందే. చిత్రాన్నమంటే జగన్ కు చాలా ఇష్టం. సాయంకాలం టీ మాత్రమే తాగుతారు. పల్లీలతో పాటు మొక్కజొన్న పొత్తులంటే ఆయనకు చాలా ఇష్టం. వీలైనప్పుడల్లా వాటిని తింటారని తెలుస్తోంది.
వీకెండ్ లో పూర్తిగా ఫ్యామిలీతో గడిపే జగన్ నాన్ వెజ్ కు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఆదివారం వస్తే చేపల పులుసు, బిర్యాని, మటన్ లాంటి వంటలు ఉండాల్సిందే. ఎన్ని రకాల వంటకాలకు ఇష్టపడిన జగన్ మాత్రం మితంగానే తింటారని తెలుస్తోంది. అటు లీటర్ పాలలో పచ్చి అల్లం వేసి మరిగించిన తర్వాత వాటిని జగన్ తాగుతారని.. అది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని రోజా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం. జగన్ ఆహారపు అలవాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.