కేసీఆర్ తో కోర్టులో ఫైట్ కు రెడీ అయిన జగన్

ఏపీలోని కోవిడ్ రోగులను తెలంగాణలోకి అనుమతించకుండా ఈరోజు కూడా అడ్డుకోవడంతో ఏపీ రగిలిపోయింది. తెలంగాణ సరిహద్దుల్లో బీజేపీ నేతలు ఈరోజు బాధితులతో కలిసి నిరసన తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ సైతం దీనిపై తీవ్ర విమర్శలు చేసింది. కేసీఆర్ కు జగన్ అమ్ముడుపోయాడని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలతో ఏపీ సర్కార్ రంగంలోకి దిగింది. తెలంగాణ అధికారులతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ మాట్లాడారు. అనంతరం ఈ విషయంలో […]

Written By: NARESH, Updated On : May 15, 2021 11:03 am
Follow us on

ఏపీలోని కోవిడ్ రోగులను తెలంగాణలోకి అనుమతించకుండా ఈరోజు కూడా అడ్డుకోవడంతో ఏపీ రగిలిపోయింది. తెలంగాణ సరిహద్దుల్లో బీజేపీ నేతలు ఈరోజు బాధితులతో కలిసి నిరసన తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ సైతం దీనిపై తీవ్ర విమర్శలు చేసింది. కేసీఆర్ కు జగన్ అమ్ముడుపోయాడని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలతో ఏపీ సర్కార్ రంగంలోకి దిగింది.

తెలంగాణ అధికారులతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ మాట్లాడారు. అనంతరం ఈ విషయంలో పెద్దగా స్పందన లేకపోవడంతో ఇక సీఎం జగన్ సైతం కల్పించుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడినట్టు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కేసీఆర్ తో జగన్ మాట్లాడలేదని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు. అధికారికంగా కాకపోయినా సమస్యను పరిష్క్రరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

ఇక తెలంగాణ నుంచి పెద్దగా స్పందన లేదని.. న్యాయస్థానాలను ఆశ్రయించి సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏపీ రోగులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఎక్కడా లేని సమస్య హైదరాబాద్ వెళ్లే వాళ్లకే వస్తోందని తెలిపారు. ఏపీలో సదుపాయాలు లేకనే రోగులు హైదరాబాద్ వెళుతున్నారని.. గత చంద్రబాబు ప్రభుత్వం ఆస్పత్రులు ఎందుకు కట్టలేదని వారి విమర్శలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు వల్లే ప్రజలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హక్కును కోల్పోయారని సజ్జల ఆరోపించారు.

అటు అధికారులు, ఇటు జగన్ సహా అందరూ మాట్లాడినా ఏపీ రోగుల విషయంలో సరిగ్గా పట్టించుకోని తెలంగాణ సర్కార్ తీరుపై ఇక కోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుందనేది వేచిచూడాలి.