https://oktelugu.com/

16 నెలలు జైల్లో క్వారంటైన్: జగన్ కు బుచ్చయ్య చురకలు

రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ప్రముఖులు 16 నెలలు క్వారంటైన్ లో ఉన్న అనుభవం ఉండడం వల్ల ఈ కరోన విపత్తు సమయం లో క్వారంటైన్ వ్యవస్థ విజయవంతం అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి లను ఉద్దేశించి టీడీపీ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. సీఎం, ఎంపీలు సీబీఐ, ఈడీ కేసుల్లో 16 నెలలు జైలు క్వారంటైన్ లో ఉండటంతో ఆ అనుభవం ఇప్పుడు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 17, 2020 / 07:18 PM IST
    Follow us on


    రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ప్రముఖులు 16 నెలలు క్వారంటైన్ లో ఉన్న అనుభవం ఉండడం వల్ల ఈ కరోన విపత్తు సమయం లో క్వారంటైన్ వ్యవస్థ విజయవంతం అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి లను ఉద్దేశించి టీడీపీ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. సీఎం, ఎంపీలు సీబీఐ, ఈడీ కేసుల్లో 16 నెలలు జైలు క్వారంటైన్ లో ఉండటంతో ఆ అనుభవం ఇప్పుడు ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు.

    కరొనా మహమ్మారి వలన రాష్ట్రవ్యాప్తంలో లాక్ డౌన్ విధించి 25 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం 5000 ఆర్థిక సహాయం అందించాలి పేదల కోసం అన్న క్యాంటీన్లు, చంద్రన్న భీమా పథకాలను పునరుద్ధరించాలి అని డిమాండ్ చేస్తూ కొల్లు రవీంద్ర మచిలీపట్నం లోని తన నివాసానికి సమీపంలో ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 వరకు నిరసన దీక్ష చేశారు.

    బ‌డుగుబ‌ల‌హీన‌వ‌ర్గాల వారికి రెడ్ల రాజ్యంలో క‌నీసం ర‌క్ష‌ణ కూడా లేకుండా పోయిందని మాజీ మంత్రి కె.అచ్చన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్న‌ బీసీనేత‌, ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌ను చంపుతామ‌ని బెదిరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయ‌కుల‌పై కేసు న‌మోదు చేయాలని డిమాండ్ చేశారు.