Homeఆంధ్రప్రదేశ్‌Jagan Govts Borrowings: అప్పుల కోసం తిప్పలు.. కేంద్రం అనుమతి కోసం జగన్ సర్కారు పడిగాపులు

Jagan Govts Borrowings: అప్పుల కోసం తిప్పలు.. కేంద్రం అనుమతి కోసం జగన్ సర్కారు పడిగాపులు

Jagan Govts Borrowings: రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పుట్టకుండా అడ్డుపడుతున్నారు. రాజకీయం చేసి బ్యాంకు రుణాలను అడ్డుకుంటున్నారు.. ఇటీవల ఏపీ సీఎం జగన్ నుంచి వస్తున్న మాటలి. ఏం కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయలేదా? వారు చేస్తే తప్పు లేదు? మేం చేస్తే తప్పా?.. ఏపీ మంత్రుల కామెంట్లు ఇవి. ఉన్నపలంగా ఇప్పడు వైసీపీ ప్రజాప్రతినిధులు కొత్త పల్లవి ఎత్తుకోవడం వెనుక చాలా ప్రస్టేషనే ఉంది. నెలకు ఐదారు వేల కోట్ల అప్పు చేయనిదే రాష్ట్ర ప్రభుత్వ బండి నడవదు. ఇన్నాళ్లూ ఎడాపెడా లెక్కాపత్రం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. అప్పులపై మసిపూసి మారేడు కాయ చేసింది. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కట్టడి చేసేసరికి రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది.

Jagan Govts Borrowings
Jagan, MODI

రెండు రోజుల్లో మే నెల వస్తోంది. కానీ ఇంతవరకూ అప్పు పుట్టలేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల ప్రయత్నాలను హస్తినాలో కొలిక్కి రాలేదు. దీంతో ఏపీ సీఎం జగన్ పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. గురువారం అనకాపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో తన ప్రస్టేషన్ ను చూపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఏమీ అనలేక దుష్ట చతుష్టయం అంటూ చంద్రబాబుతో పాటు ఆ నాలుగు మీడియా సంస్థలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని అప్పులకు ప్రయత్నించాలని ఆర్థిక మంత్రి బుగ్గనకు సూచించారు. మరోవైపు తన నవరత్నాల్లో కీలకమైన పథకాలకు గడువు సమీపిస్తుండడంతో సీఎం జగన్ లో ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ముందుట అమలు చేయకుంటే విపక్షాలు ఏకిపారేస్తాయన్న భయం ఆయన్ను వెంటాడుతోంది. ప్రజల్లో చుకలన అయిపోతానన్న భావన కూడా జగన్ ను కుదురుకోనివ్వడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినా.. ప్రస్తుతానికి కాస్త తగ్గి ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు.

Also Read: Chiranjeevi | Ram Charan | Acharya Twitter Review : చిరంజీవి-రాంచరణ్ ‘ఆచార్య’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?

ఒక రోజు ముందే హస్తినాకు..
ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు శుక్రవారం సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. షెడ్యూల్ ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన జరగాల్సి ఉన్న సీఎంలు, చీఫ్ జస్టిస్‌ల సమావేశానికి శనివారం ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కానీ ఒక రోజు ముందుగానే వెళ్లి ప్రధాని మోదీతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. అప్పుల అనుమతుల కోసమే ఆయన హుటాహుటిన హస్తిన ప్రయాణమవుతున్నారని ప్రభుత్వవర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకూ కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులకు పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వలేదు. ఏపీ ప్రభుత్వం ఎన్నెన్ని అప్పులు చేసిందో లెక్కలు చెప్పడానికి సిద్ధపడటం లేదు. అప్పులకు మేకోవర్ చేసి.. ఎలాగోలా కొత్త అప్పుల పర్మిషన్ తెచ్చుకుందామని ప్రయత్నిస్తున్నారు. కానీ అలాంటి అవకాశం ఇవ్వడం లేదు. అరకొర వివరాలతో ఇచ్చిన నివేదికను కేంద్రం తిరస్కరించింది. అంతే కాదు.. పని చేతకాదా అని తీవ్రంగా మండిపడటంతో ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్.. వారం రోజుల పాటు సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు సత్యనారాయణ అనే అధికారి ఇద్దరు కన్సల్టెంట్లతో కలిసి కొత్త నివేదికపై కుస్తీ పడుతున్నారు. కేంద్రానికి ఆ నివేదిక ఇస్తే.. కేంద్రం మదింపు చేసి.. కొత్తగా ఏపీ ప్రభుత్వానికి ఎన్ని అప్పులు చేయవచ్చో లెక్కలేసి పర్మిషన్ ఇస్తుంది. నెలకు ఐదారువేల కోట్లు అప్పులు రాకపోతే బండి నడవని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం గత నెలలో ఎలాగోలా బతిమాలుకుని రూ. నాలుగువేల కోట్లు అప్పు తెచ్చుకుంది. కానీ వచ్చే నెల గండం గట్టెక్కడానికి మాత్రం అదనపు అప్పులకు కేంద్రం పర్మిషన్ ఇవ్వడం లేదు. అప్పుల లెక్కలు తేలాల్సిందేనని అంటోంది. ప్రతీ ఏడాది ఉదారంగా అప్పులకు పర్మిషన్ ఇచ్చే కేంద్రం ఈ సారి గట్టిగా పట్టుబడుతూండటంతో రాష్ట్ర ప్రభుత్వానికీ దిక్కుతోచడం లేదు.

Jagan Govts Borrowings:
Jagan Govts Borrowings:

అమ్మో జూన్
మరోవైపు జూన్ లో అమ్మ ఒడి, రైతుభరోసా పథకం అమలుచేయాల్సి ఉంది. దాదాపు 5,000 కోట్లు ఈ రెండు పథకాలకే అవసరం. దీనికితోడు అదే నెలలో సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ డిక్లేర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించింది. ఈ సారి మాట తప్పితే వేలాది మంది సచివాలయ ఉద్యోగులు రోడ్డు మీదకు రావడానికి సిద్ధపడుతున్నారు. వారి ఒత్తిడికి తలొగ్గి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తే మాత్రం వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది తలకు మించిన భారం. అందుకే ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం అర్రులు చాస్తోంది. ఆర్థిక సంక్షోభాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్రంపైన నెట్టేయడానికి చూస్తోంది. మరోవైపు విపక్షాలు, ప్రధాన మీడియా కేంద్రానికి, బ్యాంకులకు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపిస్తోంది. మొత్తానికి మే, జూన్ లో జగన్ సర్కారుకు అప్పుల గండం పొంచి ఉంది.

Also Read:Priti Adani: నాలుగింటిలో ఒకటి ప్రీతి అదానీకి.. రాజ్యసభ సభ్యుల ఎంపికకు సీఎం జగన్ కసరత్తు

Recommended Videos

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular