https://oktelugu.com/

అప్పుల కోసం ‘సలహాల’ ఒప్పందం.. జగన్ మరీ పీక్స్

తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అప్పులే మిగిలాయి. ఇప్పుడు ఆ రాష్ట్ర పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. అటు సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనూ.. ఇటు ప్రాజెక్టుల నిర్మాణాల్లోనూ.. జగన్‌ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రభుత్వానికి నిధులు ఎంతగానో అవసరం. ఆ నిధులను ఎలా సమకూర్చుకోవాలో సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా సలహాదారులను నియమించారు జగన్‌. వారు ఇప్పటివరకు ఇచ్చిన సలహాలతోనే బండి నడుస్తూ వచ్చిందంట. Also Read: వెండి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2020 / 01:05 PM IST

    ap finance

    Follow us on


    తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అప్పులే మిగిలాయి. ఇప్పుడు ఆ రాష్ట్ర పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. అటు సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనూ.. ఇటు ప్రాజెక్టుల నిర్మాణాల్లోనూ.. జగన్‌ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రభుత్వానికి నిధులు ఎంతగానో అవసరం. ఆ నిధులను ఎలా సమకూర్చుకోవాలో సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా సలహాదారులను నియమించారు జగన్‌. వారు ఇప్పటివరకు ఇచ్చిన సలహాలతోనే బండి నడుస్తూ వచ్చిందంట.

    Also Read: వెండి సింహాల మాయంపై ఎందుకీ ‘దొంగా’ట

    కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంట. దీంతో భారీ కంపెనీలను సలహాదారుగా పెట్టుకుంటోంది. సాదాసీదా కంపెనీలైతే అప్పులు తెప్పించి పెడతాయో లేదోనని  బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ తనం ఉన్న కంపెనీలైతే బెటర్‌‌ అనే ఆలోచనలో ఉందంట. అందుకే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీ అయిన ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థను సలహాదారుగా నియమించేసుకుంది. ఎస్‌బీఐ క్యాప్స్‌గా పేరొందిన ఈ కంపెనీ నిధుల సేకరణ విషయంలో సలహాలు ఇస్తూ ఉంటుంది.

    ఎస్‌బీఐ క్యాప్స్‌ ఇప్పటివరకు చాలా వరకు నిధులు సమీకరించి పెట్టింది. ఎలాగైనా ఈ కంపెనీ సేవలు పొందాలని జగన్‌ సర్కార్‌‌ నిర్ణయించిందట. ఆ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్‌ సర్కార్‌‌కు భారీ ఎత్తున రుణాలు కావాలి. ఆఫ్ బారోయింగ్ రుణాలు రూ.11,000 కోట్లు తీసుకునే చాన్స్ ఉంది. కానీ.. ఏపీ సర్కార్ ఆర్థిక నిర్వహణ చూస్తున్న వారు ఎవరూ అప్పులిచ్చేందుకు సిద్ధపడటం లేదు. అందుకే ఎస్‌బీఐ క్యాప్స్‌తో మంచి విధానాలను ప్రెజెంట్‌ చేసి అప్పులు తెచ్చుకోవాలని ప్లాన్‌ చేశారు.

    Also Read: శ్రీవారి సేవలో ఇద్దరు సీఎంలు ఎవరు?

    రుణాలు తీసుకునేందుకు ఏ ప్రభుత్వం కూడా ఇతర సంస్థల సహాయం తీసుకోవడం చాలా అరుదు. కానీ.. ఏపీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జగన్‌ సర్కార్‌‌కు అలా తప్పడం లేదు. గతంలో కూడా ఓ విదేశీ ట్రస్ట్ నుంచి రుణం ఇప్పిస్తామని కొంత మంది ఇలాంటి సేవలు అందించేవారు వచ్చారని ప్రచారం జరిగింది. అయితే 500 కోట్ల వరకూ కమీషన్ అడగడంతో వెనుకడుగు వేశారని సమాచారం. ఇప్పుడు ఎస్‌బీఐ క్యాప్స్ ఎంత రుణం ఇప్పిస్తుందో.. ఎంత కమీషన్ తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. వేరే ఏ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోయినా.. కనీసం మాతృసంస్థ ఎస్‌బీఐ నుంచైనా రుణాలు తీసుకోవచ్చని ఏపీ సర్కార్‌‌ ఉవ్విల్లూరుతోంది.