Homeఆంధ్రప్రదేశ్‌AP Tenders: ఏపీ టెండర్లలో కొత్త రూల్.. పనులు చేయాలి కానీ డబ్బులడగొద్దు

AP Tenders: ఏపీ టెండర్లలో కొత్త రూల్.. పనులు చేయాలి కానీ డబ్బులడగొద్దు

AP Tenders: ‘డబ్బులున్నప్పుడే బిల్లులు చెల్లిస్తాం. దానికి అంగీకరించిన వారే టెండర్లు వేయాలి’ కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం విధించిన షరతు ఇది. ప్రస్తుతం ఏపీ సర్కారు కాంట్రాక్టర్లకు లక్షన్నర కోట్ల రూపాయల దాకా బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. ఏళ్ల తరబడి జాప్యం జరుగుతుండడంతో కాంట్రాక్టర్లు కోర్టులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. హైకోర్టు చీవాట్లు పెడితే తప్ప అధికారులు బిల్లులు చెల్లించడం లేదు. అందుకే కోర్టు గొడవలెందుకని అనుకున్నారో.. న్యాయస్థానం వరకూ ఎందుకు అనుకున్నారో కానీ.. మా దగ్గర బాగా డబ్బులున్నప్పుడే బిల్లులు చెల్లిస్తాం. కోర్టులకు వెళితే కుదరదు. ఇందుకు సిద్ధపడే వాళ్లే టెండర్లు వేయండి అని జలవనరుల శాఖ సూటిగా చెప్పేసింది. ‘స్పెషల్‌ కండిషన్‌ ఆఫ్‌ నోట్‌’ అంటూ టెండరు డాక్యుమెంట్‌లోనే ఈ విషయం పొందుపరిచింది.

AP Tenders
AP Tenders

జరిగిందేమిటంటే..
కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని కాలువల మరమ్మతులకు బాపట్ల జిల్లా జలవనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. ఇదేమీ వందల కోట్ల విలువైన పని కాదు. కాలువలకు కేవలం 13 కోట్ల విలువైన మరమ్మతు పనులు చేపట్టాలని జలవనరుల శాఖ తెలిపింది. జూన్‌ 6లోపు టెండర్లు దాఖలు చేయవచ్చునని పేర్కొంది. అయితే… టెండరు డాక్యుమెంట్‌లోని ఒక నిబంధన చూసి కాంట్రాక్టర్ల కళ్లు బైర్లు కమ్మాయి.స్పెషల్‌ కండిషన్‌ ఆఫ్‌ నోట్‌’ అంటూ బాగా అదనపు నిధులు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే బిల్లుల చెల్లింపు జరుగుతుంది.

Also Read: Heroine Poorna: పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ పూర్ణ… వరుడు ఎవరంటే!

బిల్లుల చెల్లింపులో ఏదైనా ఆలస్యం జరిగితే… కాంట్రాక్టు సంస్థకు కోర్టుకు వెళ్లే హక్కు ఉండదు. కోర్టును ఆశ్రయించకుండా, బిల్లులు చెల్లించేదాకా వేచి చూసే కాంట్రాక్టర్లు మాత్రమే ఈ పనులకు టెండర్లు దాఖలు చేయాలి అని జలవనరుల శాఖ పేర్కొంది. అంటే… కాంట్రాక్టర్లు సొంత డబ్బులతో కాలువలకు మరమ్మతు చేసి, ఆ తర్వాత బిల్లుల చెల్లింపు కోసం ఓపిగ్గా ఎదురు చూస్తూనే ఉండాలి. ఎందుకు ఆలస్యం, ఏమిటీ అన్యాయం అని ప్రశ్నించకూడదు. కోర్టుకు అసలు వెళ్లనే కూడదు. టెండరు డాక్యుమెంటును జిల్లా స్థాయిలో రూపొందించినప్పటికీ… పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ షరతు విధించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నామని స్థానిక అధికారులు చెబుతున్నారు. తాము సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదని, ఆ నిబంధనలన్నీ పైనుంచి వచ్చినవేనని చెబుతున్నారు. వెరసి… రూ.13 కోట్ల బిల్లులు కూడా పనులు చేసిన వెంటనే చెల్లించలేమని, ఎప్పుడు చెల్లిస్తామో కూడా చెప్పలేమని లిఖిత పూర్వకంగా అంగీకరించడం గమనార్హం.

AP Tenders
Jagan Mohan Reddy

కోర్టుకెక్కుతున్న బాధితులు..
టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘నీరు-చెట్టు’ కార్యక్రమం కింద చిన్న, సన్నకారు రైతులు చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, చెరువుల్లో పూడికతీత వంటి పనులు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ బిల్లులను నిలిపివేసింది. పైపెచ్చు ఈ పనులపై విజిలెన్స్‌ విచారణ చేపట్టింది. లోపాలు చూపించాలంటూ జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులపై ఒత్తిడిని పెంచిం ది. దీంతో.. ‘నీరు చెట్టు’ పనులు చేపట్టిన రైతులు బిల్లు ల కోసం కోర్టును ఆశ్రయించారు. బిల్లులు చెల్లించనందుకు జల వనరుల శాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులు న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాలతో బిల్లులు చెల్లించకతప్పలేదు. ఆ తర్వాత… ఇతర కాంట్రాక్టు సంస్థలూ బిల్లుల కోసం కోర్టుకెక్కడ ప్రారంభించాయి. జలవనరుల శాఖపై హైకోర్టులో ఇబ్బడి ముబ్బడిగా కేసులు దాఖలవుతున్నాయి. వీటికి సమాధానం చెప్పుకోలేక, బిల్లులు చెల్లించలేక అధికారులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో… ఇప్పుడు ‘డబ్బులు ఉన్నప్పుడే బిల్లులు చెల్లి స్తాం. కోర్టులకు వెళ్లే హక్కు మీకు లేదు’ అని టెండరు డాక్యుమెంట్‌లోనే షరతు విధించడం గమనార్హం.

Also Read:Balakrishna- BVS Ravi: బాలయ్యకు ఇంత పెద్ద రిస్క్ అవసరమా?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular