Jagan Distributing Amaravathi: అమరావతిని భ్రమరావతి అన్నారు. కమ్మరాజ్యం అని అభివర్ణించారు. అంతా గ్రాఫిక్స్ అని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా స్మశానంతో పోల్చారు. అధికార వైసీపీలో సీఎం జగన్ నుంచి మంత్రులు, నాయకులు ఇదే పల్లవి పాడారు. అసలు అమరావతిలో కట్టడాలు లేవని.. అదో వేస్ట్ ప్రాంతంగా తెగ ప్రచారం చేశారు. ఇప్పుడదే అమరావతి భూములను విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి అమరావతిలో కట్టడాలను లీజులికివ్వడం ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిని పూర్తిగా విస్మరించింది. అది చంద్రబాబు ఇంటి వస్తువుగా భావించింది. అదో కమ్మ కులస్థుల ప్రాంతంగా భావించింది. అమరావతి రాజధానిగా చేస్తే చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని భావించి జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రకటన చేసింది. అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతూ పాలనా రాజధానిగా విశాఖను, న్యాయరాజధానిగా కర్నూలును ప్రకటించింది. మూడు ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పుకొచ్చింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రాని ఆలోచన తామే చేస్తున్నట్టు సైతం జగన్ ప్రకటించారు. తద్వారా మూడు ప్రాంతాలు గణనీయమైన అభివ్రుద్ధి సాధిస్తాయని కూడా అభివర్ణించారు. సీన్ కట్ చేస్తే మూడేళ్లు ఇట్టే గడిచిపోయింది. మాటలతో కాలయాపన జరిగిపోయింది. అటు పాలనా రాజధాని లేదు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయనూ లేదు. శాసన రాజధానిగా మాత్రం అమరావతి మెరుగైన సేవలందిస్తోంది.
గత మూడేళ్లుగా..
అయితే ఈ మూడేళ్లలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మేథావులు, నిపుణులు అంతర్మథనం చెందుతున్నారు. జగన్ సర్కారు తీరును ఆక్షేపిస్తున్నారు. కానీ తామేమీ చేయలేమని చంద్రబాబు అండ్ కో న్యాయస్థానాల ద్వారా అడ్డుకొవడంతోనే తాము మూడు రాజధానులు ఏర్పాటు చేయలేకపోతున్నామన్న రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ ప్రజాప్రతినిధులు కాలం వెళ్లదీస్తున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు కట్టి తీరుతామని శపథం చేస్తున్నారు. మరోవైపు న్యాయస్థానంలో అమరావతి రాజధానిపై ప్రతికూల తీర్పు వస్తుందని అంచనా వేసిన జగన్ సర్కారు అంతకు ముందే శాసనసభలో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. ఇంతలో కోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అమరావతిలో మౌలిక వసతులకల్పనపై ద్రుష్టిసారించాలని ఆదేశించింది. ఇప్పటికిప్పుడు అమరాతి రాజధానికి భారీగా నిధులు అవసరమని… కొంత సమయం కావాలన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మౌలిక వసతులకల్పన అనివార్యంగా మారింది.
Also Read: Sammathame 2nd Day Collections: ‘సమ్మతమే’ 2 డే కలెక్షన్స్.. రిజల్ట్ ఇదే !
కొత్త పన్నాగాలు..
ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత అభివ్రుద్ధి అథారిటీ (సీఆర్డీఏ) కొత్త వ్యూహాలను ప్రారంభించింది. ముందుగా రాజధాని భూములను కుదువ పెట్టి అప్పులు తేవాలని భావించింది. దీనికి బ్యాంకులు ముందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ష్యూరిటీ ఇస్తేనే రుణం అందిస్తామని తెగేసి చెప్పాయి. కానీ ష్యూరిటీ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇప్పటికే సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పరువు గంగపాలైన నేపథ్యంలో చాలా బ్యాంకులు చేతులు ఖాళీగా లేవంటూ తప్పుకున్నాయి. దీంతో సీఆర్డీఏ సరికొత్త పన్నాగాలు పన్నుతోంది. అమరావతి రాజధానికి సేకరించిన భూములను విక్రయించడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 600 ఎకరాలను అమ్మకానికి గుర్తించింది. ఇంకా గుర్తించే పనిలో ఉంది.
లీజుకు భవనాలు..
అటు భూముల అమ్మకాల ప్రక్రియ ఒక వైపు జరుగుతుండగా.. ఇప్పటికే వివిధ అవసరాలకు అమరావతిలో కట్టిన భవనాలను లీజుకిచ్చేందుకు సీఆర్ డీఏ కీలక ప్రతిపాదనలను తయారుచేసింది. దానికి సీఎం జగన్ సైతం ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో కీలకమైన అత్యవసరమైన భవనాలను కొన్నింటిని నిర్మించారు. దాదాపు 80 శాతం పనులు పూర్తయిన వి ఉన్నాయి. ఎమ్మెల్యేలు, న్యాయమూర్తుల క్వార్టర్లు, ఉద్యోగుల కోసం టవర్లు నిర్మంచారు. గ్రూప్ డీ ఉద్యోగులు నివాసముండేందుకు సైతం భవనాలను ఏర్పాటుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీటి నిర్మాణ పనులను నిలిపివేశారు. కానీ మూడేళ్ల తరువాత వీటి అవసరం ప్రభుత్వానికి వచ్చింది. వీటిని లీజుకివ్వడం ద్వారా కోట్లాది రూపాయలు వస్తాయని సీఆర్డీఏ అధికారులు సీఎం జగన్ చెవిలో ఊదడమే తరువాయి.. ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వెంటనే అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. రెండు యూనివర్సిటీలతో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. హాస్టళ్ల నిర్వహణకు ఆ భవనాలను అప్పగించనున్నారు. మొత్తానికి గ్రాఫిక్స్ భవనాలే నేడు వైసీపీ ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా మారాయన్న మాట.
Also Read: Corona Merger In India: భారత్ లో కరోనా విలయం.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే?