Jagan vs Pawan : జగన్‌ గలీజు రాజకీయం.. పవన్‌ భార్యలపై మళ్లీ కామెంట్స్‌..!

Jagan vs Pawan : మహిళలను అత్యంత గౌరవించే దేశం మనది. మహిళను శక్తిగా, దేవతగా కొలిచే సంప్రదాయం మనది. ప్రతీ మహిళలో తల్లిని, చెల్లిని చూసే సంస్కృతి ఉన్న దేశంలో పుట్టాం మనం. కానీ కొంతమంది నేతలు నేటికి మహిళలను కించపరుస్తూనే ఉంటున్నారు. తమ రాజకీయాల కోసం గృహిణిలుగా ఉన్నవారిని బజారుకీడుస్తూ క్షమించరాని తప్పు చేస్తున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముందువరుసలో ఉన్నారు. తల్లిని, చెల్లిని కాదని..  మహిళలను […]

Written By: NARESH, Updated On : December 30, 2022 4:46 pm
Follow us on

Jagan vs Pawan : మహిళలను అత్యంత గౌరవించే దేశం మనది. మహిళను శక్తిగా, దేవతగా కొలిచే సంప్రదాయం మనది. ప్రతీ మహిళలో తల్లిని, చెల్లిని చూసే సంస్కృతి ఉన్న దేశంలో పుట్టాం మనం. కానీ కొంతమంది నేతలు నేటికి మహిళలను కించపరుస్తూనే ఉంటున్నారు. తమ రాజకీయాల కోసం గృహిణిలుగా ఉన్నవారిని బజారుకీడుస్తూ క్షమించరాని తప్పు చేస్తున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముందువరుసలో ఉన్నారు.
తల్లిని, చెల్లిని కాదని.. 
మహిళలను అవమానించే నేత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్.. కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లినే దూరం చేసుకున్న జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ మహిళల వద్ద మాత్రం నేను మీ బిడ్డను, మీ ఆశీర్వాదం, దేవుడి దయ నాకు ఉంటే చాలు అని లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. తల్లి విజయమ్మ ఎందుకు దూరమైందో చెప్పరు. చెల్లిని ఎందుకు వెళ్లగొట్టావంటే ఉలుకు పలుకు లేదు. కానీ విపక్ష నేతల మహిళలను మాత్రం అవమానించేలా బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఆయన నేతల భార్యల గురించి చేస్తున్న వ్యాఖ్యలను చూసి మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది.
అసెంబ్లీలో చందబ్రాబు సతీమణిపై..
ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు మహిళా సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు సభలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ కూడా సభలోనే ఉండి వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు ముసిముసిగా నవ్వుతూ ఎంజాయ్‌ చేశారు. మహిళను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో వారించాల్సిన సభాపతి కూడా చూస్తు కూర్చున్నారు. దీంతో మనస్తాపం చెందిన చంద్రబాబు నాటి నుంచి సభలో అడుగు పెట్టడం లేదు.
పవన్‌ భార్యపై.. 
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం అధికార పార్టీకి కొరకరాని కొయ్యలా మారారు. వైసీపీ ముక్త ఆధ్రప్రదేశే తన లక్ష్యమని ప్రకటించారు. ప్రజాసమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. జనసేనాని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్‌ అంటూ విమర్శిస్తున్నారు. ఇక సీఎం జగన అయితే పవన్‌ భార్యల విషయాన్ని బహిరంగ సభల్లో ప్రస్తావిస్తూ మహిళలపై తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నారు. తాజాగా శుక్రవారం నిర్వహించిన సభలోనూ పవన్‌ భార్యల విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవంగా జగన్‌కు రాజకీయం వైరం ఉన్నది పవన్‌తో రాజకీయంగా ఆయనను ఎదుర్కొవాల్సిన ముఖ్యమంత్రి భార్యల విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. దీంతో జగన్‌కు మైలేజీ రాకపోగా మహిళల్లో డ్యామేజీ అవుతున్నారు.