https://oktelugu.com/

AP Cabinet Roja: కొడాలి నాని పోయే.. రోజా వచ్చే.. టార్గెట్‌ చంద్రబాబు

AP Cabinet Roja:  ఏపీలో కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. కేబినెట్‌ ఎంపికలో ఈసారి రోజా హాట్‌ టాపిక్‌గా మారారు. పాత మంత్రులు పది మంది కొనసాగుతారనే ప్రచారంలో కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ, చివరి నిమిషంలో కొడాలి నాని కేబినెట్‌ లిస్ట్‌ నుంచి తప్పించారు. కొడాలి నాని స్థానంలో చివరి నిమిషంలో రోజాకు స్థానం కల్పించారు. అయితే, టీడీపీ లక్ష్యంగానే రోజాకు కేబినెట్‌ లో స్థానం కల్పించారనే చర్చ మొదలైంది. చిత్తూరు జిల్లాలో 2019 […]

Written By:
  • NARESH
  • , Updated On : April 11, 2022 / 03:31 PM IST
    Follow us on

    AP Cabinet Roja:  ఏపీలో కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. కేబినెట్‌ ఎంపికలో ఈసారి రోజా హాట్‌ టాపిక్‌గా మారారు. పాత మంత్రులు పది మంది కొనసాగుతారనే ప్రచారంలో కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ, చివరి నిమిషంలో కొడాలి నాని కేబినెట్‌ లిస్ట్‌ నుంచి తప్పించారు.

    కొడాలి నాని స్థానంలో చివరి నిమిషంలో రోజాకు స్థానం కల్పించారు. అయితే, టీడీపీ లక్ష్యంగానే రోజాకు కేబినెట్‌ లో స్థానం కల్పించారనే చర్చ మొదలైంది. చిత్తూరు జిల్లాలో 2019 లో పెద్దిరెడ్డి .. నారాయణ స్వామి మంత్రులుగా నియమితులయ్యారు. దీంతో.. రోజాకు స్థానం దక్కలేదు. కానీ, ఇప్పుడు తిరిగి అదే ఇద్దరు ఉన్నా.. రోజాకు అవకాశం దక్కింది.

    -నానిని తప్పించటంతో టీడీపీ హ్యాపీ
    కేబినెట్‌ లో కొడాలి నానికి చాన్స్ మిస్‌ అవ్వటంతో రోజా ద్వారా ‘టార్గెట్‌ చంద్రబాబు’ కొనసాగించాలని సీఎం జగన్‌ డిసైడ్‌ అయినట్లు కనిపిస్తోంది. ఈ కేబినెట్‌ 2024 లక్ష్యంగా ఏర్పాటు చేసినది కావటంతో..రోజాకు ప్రభుత్వంలోనూ..సొంత జిల్లాలోనూ టార్గెట్‌ చంద్రబాబు లక్ష్యంగా పని చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

    రోజా సుదీర్ఘ కాలం టీడీపీలో పని చేశారు. ఎమ్మెల్యేగానూ అవకాశం దక్కలేదు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయిన తరువాత టీడీపీని టార్గెట్‌ చేసే క్రమంలో టీడీపీ మంత్రులకు రోజా లక్ష్యంగా మారారు. శాసనసభ నుంచి ఏకంగా ఏడాదిపాటు సస్పెండ్‌ అయ్యారు. ఇక, ఇప్పుడు అదే శాసనసభలో రోజా మంత్రిగా అడుగు పెట్టనున్నారు. వచ్చే ఎన్నికల వరకు రోజా హవా నడువనుంది. ఆమెను చంద్రబాబుపై అస్త్రంగానే జగన్ దించినట్టు ఉన్నారు. రోజా మంత్రి రావడంతో చంద్రబాబు అసెంబ్లీకి వచ్చే చాన్స్ కనిపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి..

    -నాని స్థానంలో ఇక రోజా మొదలు..
    ఈ సారి కుప్పం నియోజకవర్గంపైన సీఎం జగన్‌ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే అక్కడ మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు కుమారుడు సుధీర్‌ రెడ్డి రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా నిలబెట్టాలని ప్లాన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబును ఓడగొట్టాలని ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.