ఆ కేసుల నుంచి జగన్‌ తప్పించుకున్నారు!

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌పై కేసులు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఆ కేసుల్లో ఏడాదికి పైగా జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం నిత్యం ఆయనపై 32 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తుంటాయి. ఇప్పుడు ఆ ఆరోపణల తప్పు అని నిరూపించేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారట. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖ నేపథ్యంలో అందరూ.. జగన్‌పై ఉన్న క్రిమినల్ […]

Written By: NARESH, Updated On : November 5, 2020 2:11 pm
Follow us on

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌పై కేసులు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఆ కేసుల్లో ఏడాదికి పైగా జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం నిత్యం ఆయనపై 32 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తుంటాయి. ఇప్పుడు ఆ ఆరోపణల తప్పు అని నిరూపించేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారట.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖ నేపథ్యంలో అందరూ.. జగన్‌పై ఉన్న క్రిమినల్ కేసుల రికార్డును ఎత్తిచూపుతున్నారు. ఈ క్రమంలో ఆ కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ముందుగా.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్‌పై రుబాబు చేసిన వ్యవహారంపై నమోదైన క్రిమినల్ కేసును ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గుట్టుగా సాగిపోయిన ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

Also Read: చంద్రబాబులోనూ ట్రంప్‌ లక్షణాలు.. నెటిజన్ల ట్రోల్‌?

దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వస్తూ కృష్ణా జిల్లాలో ప్రమాదానికి గురైంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతున్న ఆస్పత్రికి వెళ్లారు. పోస్టుమార్టం రూంలోకి దూసుకెళ్లి డాక్టర్ల చేతుల్లో ఉన్న పోస్ట్ మార్టం కాగితాలను లాక్కున్నారు.ఆ తర్వాత అప్పట్లో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఉన్న అహ్మద్‌బాబుపై విరుచుకుపడ్డారు. నిన్ను సెంట్రల్ జైల్‌కు పంపిస్తానని హెచ్చరించారు. ఇవన్నీ వీడియో సహితంగా బహిరంగంగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపైనా అప్పట్లో అధికారులు కేసు నమోదు చేశారు. క్రిమినల్ నేరం కావడంతో ఆ సెక్షన్ల కిందనే కేసు నమోదు చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కేసును ఎత్తివేశారు.

Also Read: చంద్రబాబు ఆర్థికమూలాలు దెబ్బతీసే జగన్ ‘అమూల్‌’ ప్లాన్?

అయితే.. ఈ కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వం వింతధోరణిని ఎంచుకుంది.అక్కడ సీఎం జగన్ తప్పేమీ లేదని.. తామే భ్రమపడ్డామని.. అధికారులతో ఏకంగా రిపోర్టు తయారు చేయించింది. ఎట్టకేలకు పని అయితే పూర్తి చేశారు. ఆ సందర్భంలో జగన్‌ ప్రవర్తించిన తీరు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ.. ఆయన ఉద్దేశపూర్వకంగా చేయలేదని అధికారులు ఇప్పుడు చెబుతుండడం కొసమెరుపు. అధికారం.. అవకాశం ఉంటే పాలనలో ఏదైనా సాధ్యమేననేది మరోసారి నిరూపించారు.