IT Raids Tension In TRS: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఐటీ దాడుల అలజడులు రేగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ దాడులు టీఆర్ ఎస్ నేతలను టార్గెట్ చేసినట్టు జరుగుతుండటం కలకలం రేపుతోంది. గతంలో కూడా ఇలాంటి దాడులే జరిగాయి. ఇప్పుడు కేసీఆర్ కేంద్రం మీద ఒంటికాలుపై లేస్తున్న క్రమంలో ఈ దాడుటు జరగడం సంచలనం రేపుతోంది.
ముఖ్యంగా కాళేశ్వరం, వట్టెం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు పని చేసిన కాంట్రాక్ట్ కంపెనీలే టార్గెట్ గా జరుగుతున్నాయి. అది కూడా నాలుగైదు కంపెనీల మీదే జరగడం ఇక్కడ గమనార్హం. ఇందులో ముఖ్యంగా కేఎన్ఆర్ ఇన్ ఫ్రా కంపెనీ, గజ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు ఆర్‌వీఆర్, జీవీఆర్ లాంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంట్రాక్టుల ద్వారా వచ్చిన డబ్బులను యూపీ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలకు తరలించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి.
Also Read: సారా’జకీయం.. జగన్, చంద్రబాబు… ఏపీలో ఎవరిది తప్పు?
ఈ కంపెనీలు అన్నీ కూడా టీఆర్ ఎస్ నేతలకు అత్యంత సన్నిహితులవే అని తెలుస్తోంది. ఇవన్నీ కూడా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులను కాంట్రాక్టుకు తీసుకున్న మేఘా కంపెనీ లాంటి వాటికి సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నాయి. ఒక్కో కంపెనీ కనీసం రూ.2వేల కోట్ల పనులు చేస్తున్నాయి. ఇందులో గజ కంపెనీ తేజరాజుది. ఈయన కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు.
ఇక దీపికా కన్ స్ట్రక్షన్ ఓ ఎమ్మెల్యే అల్లుడుది. ఇందులో టీఆర్ ఎస్ ఎమ్మెల్సీకి కూడా వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్వీఆర్ ఇన్‌ఫ్రా కంపెనీ మాత్రం ఏపీకి చెందిన వ్యక్తిది. అయితే దీన్ని మొత్తం తెలంగాణ మంత్రి నడిపిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ కాంట్రాక్ట్ ల ద్వారా వచ్చిన డబ్బులను మొత్తం ఎన్నికల నిర్వహణకు తరలిస్తున్నారనే ఆరోపణలతో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.
కాగా ఈ దాడుల్లో ఏ మాత్రం ఆధారాలు దొరికినా రాజకీయం మరింత వేడెక్కడం ఖాయంగా తెలుస్తోంది. ఇక్కడ ఓ విషయం ఏంటంటే.. కేసీఆర్ మీద కేంద్ర బీజేపీ ఫోకస్ పెట్టిందనే వార్తలకు ఈ దాడులు బలం చేకూరుస్తున్నాయి. మరి రాష్ట్ర బీజేపీ నేతలు ముందు నుంచే చెబుతున్నట్టు కేసీఆర్‌ను కేంద్రం టార్గెట్ చేసి రాజకీయాలను మరింత వేడెక్కిస్తుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీటి మీద టీఆర్ ఎస్ నేతలు ఏమైనా స్పందిస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి.
Also Read: ఎట్టకేలకు నిరుద్యోగుల ‘ఆకలి’ తీర్చనున్న కేసీఆర్
Recommended Video: