Homeజాతీయ వార్తలుSurgical strike : దాయాదిపై ప్రతీకారానికి ఎనిమిదేళ్లు.. తమ సత్తా చూపిన ఇండియన్‌ ఆర్మీ

Surgical strike : దాయాదిపై ప్రతీకారానికి ఎనిమిదేళ్లు.. తమ సత్తా చూపిన ఇండియన్‌ ఆర్మీ

Surgical strike : మన దాయాది దేశం పాకిస్తాన్‌. భారత్‌ ఎదుగుదలను, అభివృద్ధిని చూసి ఓర్వలేని ఆ దేశం.. మన దేశంలో ఎప్పుడూ అశాంతి రగిలించాలని చూస్తోంది. కవ్వంపు చర్యలకు తిగుతోంది. ఉగ్రవాదులను అక్రమంగా భారత్‌లోకి పంపిస్తోంది. అనేక ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తోంది. అయితే పాకిస్తాన దుశ్చర్యలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పు కొడుతోంది. ఈ క్రమంలో భారత సైన్యం కూడా అప్పుడు భారీగా నష్టపోతోంది. ఇలాంటి ఘటనల్లో ఉరిలో సైనికులపై జరిగిన ఉగ్రదాడి ఒకటి. 2016 సెప్టెంబర్‌ 18న కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరిలో భారత సైనికులపై పాక్‌ ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ దాడిలో 18 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత సైన్యం. తర్వాత జరిపిన ప్రతీకారదాడితో పాక్‌కు భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఇప్పటికీ పాకిస్తాన్‌ సైన్యం చెవుల్లో భారత సైన్యం జరిపిన ప్రతిదాడి ప్రతిధ్వనిస్తుంది.

పాక్‌ దొంగదెబ్బ..
పాక్‌ ఉగ్రవాదులు ఉరిలో జరిపిన దాడి తర్వాత 2016 సెప్టెంబర్‌ 18న భారత సైన్యం సర్జికల్‌ స్ట్రైక్‌ నిర్వహించింది. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. కశ్మీర్‌లోని ఉరి భారతసైన్యం క్యాంపులోకి జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సైనిక గుడారాలకు నిప్పు పెట్టారు. అకస్మాత్తుగా జరిగిన దాడితో సైనికులు తప్పించుకునే వీలు లేకుండా పోయింది. ఈ దాడిలో 18 మంది వీరమరణం పొందారు. అక్కడున్న ప్రత్యేక బలగాలు నలుగురు పాక్‌ ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే ఉరి ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రతీకారం కార దాడితో…
భారత్‌ను దొంగచాటుగా దెబ్బకొట్టిన పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం పాక్‌పై ప్రతీకార దాడితోవిరుచుకుపడింది. పక్కా ప్రణాళికతో సర్జికల్‌ స్ట్రైక్‌ చేసింది. ప్లాన్‌లో భాగంగా ముందుగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించారు. 2016, సెప్టెంబర్‌ 28న అర్థరాత్రి భారత పారా కమాండోల బృందం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించింది. అక్కడి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. భారత సైన్యం తన పని విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చింది. ఈదాడిలో 50 మంది పాక్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌కు సర్జికల్‌ స్ట్రైక్‌ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ప్రకటించారు. దీంతో నాడు యావత్‌ దేశం సంబరాలు జరుపుకుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular