పాలనకు విశాఖ రెడీగా ఉందా..?

ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధానులు మారుతూ ఉండొచ్చు. రాజధానులు ఎన్నయినా రావొచ్చు.. అన్న సంకేతాల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పంపుతోందన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అదే చూస్తున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అమరావతిని కేంద్రంగా చేస్తూ రాజధానిని ప్రకటించారు. కానీ.. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు హయాంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసే ప్రక్రియలో వైసీపీ కూడా పాలుపంచుకుంది. కానీ.. ఆ మధ్య అసెంబ్లీలో మాత్రం ‘మేం […]

Written By: Srinivas, Updated On : March 31, 2021 3:06 pm
Follow us on


ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధానులు మారుతూ ఉండొచ్చు. రాజధానులు ఎన్నయినా రావొచ్చు.. అన్న సంకేతాల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పంపుతోందన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అదే చూస్తున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అమరావతిని కేంద్రంగా చేస్తూ రాజధానిని ప్రకటించారు. కానీ.. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు హయాంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసే ప్రక్రియలో వైసీపీ కూడా పాలుపంచుకుంది.

కానీ.. ఆ మధ్య అసెంబ్లీలో మాత్రం ‘మేం ఎంపిక ప్రక్రియలో లేం.. టీడీపీ ప్రకటించేశాక అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అమరావతికి మద్దతిచ్చాం అంతే..’ అని వైసీపీ చెప్పుకొచ్చింది. కానీ.. అప్పట్లో అసెంబ్లీలో ఆ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకించలేదు. దీంతో అమరావతి రాజధాని అంశంలో వైసీపీ తనవంతు పాత్ర కూడా పోషించింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడిక విశాఖ వేదికగా పరిపాలన కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అతి త్వరలో మూడు రాజధానులు.. అంటూ వైసీపీ ముఖ్య నేతలు సంకేతాలు పంపుతున్నారు. ఇందుకు విశాఖ సిద్ధంగానే ఉందా..? తిరుపతికి ఉన్న భౌగోళిక ప్రతికూలతలు, విశాఖ అభివృద్ధికి సహకరిస్తాయా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. విశాఖ పెద్ద నగరం, అభివృద్ధి చెందిన, చెందాల్సిన నగరం కూడా. అయితే, భౌగోళిక ప్రతికూలతలు రాజధాని అనే అర్హత నుంచి విశాఖని దూరం చేస్తున్నాయి.

అమరావతి మీద కోపంతోనో, చంద్రబాబు మీద కోపంతోనో.. అమరావతి నుంచి పాలనను విశాఖకు వైఎస్ జగన్ తరలిస్తే, తదనంతర పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారనేది ఇప్పుడు నడుస్తున్న ప్రధాన చర్చ. రేప్పొద్దున్న ప్రభుత్వం మళ్లీ మారితే.. మూడు రాజధానుల స్థానంలో ఐదో, ఏడో.. తొమ్మిదో, పదమూడో రాజధానులు వస్తే పరిస్థితి ఏంటి? మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన మంచిదే. కానీ, పరిపాలన వికేంద్రీకరణ.. అనేది ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందనేది వాస్తవం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్