Narendra Modi: ఒక దేశానికి ప్రధాని అంటే ఎలా ఉండాలి? ఆ డాబు, దర్పం వేరే లెవల్ లో ఉంటుంది.. చుట్టూ బ్లాక్ కమాండోస్.. అడుగు తీసి అడుగు వేస్తే రెడ్ కార్పెట్.. మంది మార్బలం.. అబ్బో ఎంతటి రాచమర్యాదలో కదా.? ఒక రాజుకు ఎంత ఖదర్ ఉంటుందో అంతటి గొప్ప గౌరవం దేశ ప్రధానికుంటుంది.
కానీ అందరు ప్రధానుల్లా మోడీలో ఆ భావం ఉండదు. అతడు ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు. ఛాయ్ వాలాగా ఎదిగాడు. ఆ కష్టం తెలుసు. కిందిస్థాయిలో ఎంత కష్టపడి పనిచేస్తున్నారో తెలిసినవాడు. అందుక తాజాగా వారణాసి విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు పనుల్లో పనిచేసిన నిర్మాణ కార్మికులను మోడీ అక్కున చేర్చుకున్న తీరుకు అందరి నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.
కాశీ విశ్వేశ్వరుడి ప్రాజెక్టులో పాల్గొని పూర్తి చేసిన కార్మికుల సేవలకు ప్రధాని మోడీ గొప్ప గౌరవం ఇచ్చారు. వారితో కలిసి సామాన్యుడిలా భోజనం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కార్మికులతో సహపంక్తి భోజనం చేశారు. దేశానికి ప్రధాని తమతోపాటు పక్కనే కూర్చొని భోజనం చేయడాన్ని చూసి నిర్మాణ కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారితో అనంతరం కాసేపు ప్రధాని మాట్లాడి కష్టసుఖాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చమట చిందించిన సోదర, సోదరీమణులకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా కల్లోలంలోనూ పనిచేసిన కార్మికుల సేవలు వెలకట్టలేనివన్నారు.ఇప్పుడు వాళ్లను కలిసి ఆశీర్వాదం తీసుకునే సమయం వచ్చిందన్నారు.
Also Read: కాశీలో కాలినడక.. ప్రధాని మోడీ అభివృద్ధి పైనే ప్రత్యేక దృష్టి
ఇక వారణాసిలో పర్యటిస్తున్న మోడీ అర్ధరాత్రి 1 గంట సమయంలో కాశీ వీధుల్లో సామాన్యుడిలా తిరిగారు. పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పనులను పరిశీలించారు. బెనారస్ రైల్వే స్టేషన్ ను సందర్శించారు. సామాన్యుడిలా కాలినడకన ఇలా కాశీలో మోడీ తిరగడం.. ప్రజలతో అనుసంధానం అవ్వడం చూసి ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇలా సామాన్యుడిలా ప్రధాని వ్యవహరించడమే ప్రజల మనసు గెలిచేలా చేస్తోంది. ఒక మనలో మనిషిలా మోడీ సాగుతున్న తీరే ప్రజలకు దగ్గరచేస్తోంది. ఎంతైనా మోడీకి ప్రజల నాడి బాగా తెలుసు. అదే ఆయనను దేశంలో పవర్ ఫుల్ వ్యక్తిగా మార్చింది.
#WATCH | Varanasi: PM Narendra Modi along with CM Yogi Adityanath had lunch with the workers involved in construction work of Kashi Vishwanath Dham Corridor. pic.twitter.com/XAX371ThEw
— ANI UP (@ANINewsUP) December 13, 2021
Also Read: కాశీ నుంచి.. చీరకట్టుకొని పారిపోయిన బ్రిటీష్ గవర్నర్!!