North East Indian states Elections : ఈశాన్య బీజేపీ హవా కొనసాగించింది. ఈ రోజు జరిగిన నాగాలాం డ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో దూకుడు ప్రదర్శించింది. ఒక్క మేఘాలయ మినహా మిగతా రాష్ట్రాల్లో తిరుగులేని విక్టరీ సాధించింది. మరో వైపు మేఘాలయలో అధిక సీట్లు సాధించిన సంగ్మా కు చెందిన నేషనల్ పీపుల్ పార్టీ భారతీయ జనతాపార్టీతో జట్టు కట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందతా ఒకెత్తు అయితే ఈశాన్యంలో భారతీయ జనతాపార్టీ సాధించిన అప్రతిహత విజయాలకు కారణాలు ఏంటి? ఎన్నికలకు ముందు ముఖ్యమం త్రులను మార్చడమేనా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ చర్చ సర్వత్రా జరుగుతోంది.
ముఖ్యమంత్రులను మార్చేసింది
అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు ఉత్తరాఖాండ్, గుజరాత్లో ముఖ్యమంత్రులను మార్చింది బీజేపీ. అదే విధానాన్ని త్రిపురలోనూ అమలు చేసింది. ఇక్కడి ముఖ్యమంత్రి బిప్లబ్‌ను ఎన్నికలకు పది నెలల ముందు తొలగించి మాణిక్ సాహాను ఆ కుర్చీలో కూర్చొబెట్టింది. ఇలా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రులను మార్చడం భారతీయ జనతాపార్టీకి కొత్తేం కాదు. ఎన్నికలకు ముందు ఇలా ఉత్తరాఖాండ్‌లో ఇద్దరు, గుజరాత్, కర్ణాటక ముఖ్యమంత్రులను మార్చేసింది. ఇందులో ఉత్తరాఖాండ్, గుజరాత్ ఎన్నికల్లో నెగ్గిన బీజేపీ, త్వరలో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లబోతోంది.
హిమాచల్ ప్రదేశ్‌లో భిన్నం
ముఖ్యమంత్రి మార్పును చేపట్టిన హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి భిన్నమైన ఫలితం వచ్చింది. ప్రత్యేక కారణాల వల్ల ఇక్కడి ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ను పదివిలోనే ఉంచింది. దీనివల్ల అక్కడ ఓటమి పాలయింది. ఠాకూర్‌ను కొనసాగించడం వెనుక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారని సమాచారం. ఆయన ఒత్తిడి వల్లే ఠాకూర్‌ను తొలగించలేదని, అందుకు పార్టీ తగిన మూల్యం చెల్లిచుకుందని బీజేపీ సీనియర్లు అంటున్నారు. ఇక త్వరలో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను తొలగిసారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ఏడాది డిసెంబరులో మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా 18 ఏళ్లుగా చౌహాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
2019లో మోదీ మరోమారు ప్రధానమంత్రి అయ్యాక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల సమస్య ఎదురయింది. అదే ఏడాది జరిగిన జార్ఞండ్ ఎన్నికల్లో రఘుబార్ దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓటమి చవి చూసింది. అప్పట్లో రఘబార్ దాస్ ను తొలగించాలని అప్పట్లో ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. కానీ అధిష్ఠానం అంతగా సీరియస్‌గా తీసుకోలేదు. ఇక అప్పటి ఎన్నికల్లో రఘుబార్ దాస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్, జేఎంఎం కూటమి విజయం సాధించింది. అప్పటి ఓటమి తర్వాత అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. ఆ తర్వాతే ముఖ్యమంత్రుల మార్పునకు శ్రీకారం చుట్టింది.
ఉత్తరాఖాండ్లోనూ..
ఉత్తరాఖాండ్ చరిత్రలో ఏ ఒక్క పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే సెంటిమెంట్‌కు బీజేపీ చరమగీతం పాడింది. 2022లో ఎన్నికలకు ముందు ఉత్తరాఖాండ్‌లో బీజేపీ ముఖ్యమంత్రులను మార్చేసింది. త్రివేంద్రసింగ్ రావత్‌ను తొలగించి, తిరంగ్ సింగ్ రావత్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది. అతన్ని కూడా నెలల వ్యవధిలో తొలగించి ఎన్నికలకు ముందు పుష్కర్ ధామిని ముఖ్యమంత్రి చేసింది. గుజరాత్ ఎన్నికల్లోనూ విజయ్ రూపానిని తొలగించి భూపేంద్రపటేల్‌ను ముఖ్యమంత్రిని చేసింది. గత ఏడాది అస్సాం ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రిని మార్చలేదు. ఆ ఎన్నికల్లో సద్బానంద సోనోవాల్‌ను ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇవ్వలేదు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత హిమంత బిశ్వశర్మను ముఖ్యమంత్రిని చేసింది. ఇక కర్ణాటకలోనూ యడ్యూరప్పను తొలగించి బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడ ఏం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Is this bjps winning mantra in north east indian states
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com