Unemployment Benefits: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సిద్ధమైంది. 2014లోనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చినా తరువాత పట్టించుకోలేదు. ఫలితంగా నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఎట్టకేలకు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

2019లోనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని భావించినా కరోనా నేపథ్యంలో కుదరలేదు. దీంతో దాని గురించి అందరు మరిచిపోయారు. కానీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ర్టంలో ఉన్న నిరుద్యోగుల జాబితా తయారుకు రెడీ అవుతోంది. ఉద్యోగుల నుంచి సమాచారం సేకరిస్తోంది. నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారు? వారికి నెలనెల ఇచ్చేందుకు ఎంత ఖర్చవుతుందని అనే విషయాలపై చర్చిస్తోంది.
Also Read: నార్త్‌లోనూ ‘తగ్గేదేలే’.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘పుష్ప’ రాజ్..
కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయిన సంగతి తెలిసిందే. దీంతో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలనే ఆలోచన వెనుకబడింది. దీంతో నిరుద్యోగుల్లో కూడా ఆందోళన నెలకొంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటికైనా నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ముందుకు రావడంతో టీఆర్ఎస్ పార్టీ తన ప్రతిష్ట పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3016 ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఎంత బడ్జెట్ అవుతుందనే దానిపై అంచనాలు వేస్తోంది. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చే క్రమంలో ఎంత ఖర్చయినా చేస్తామని చెబుతోంది. దీని కోసం ఓ నిధి కూడా ఏర్పాటు చేసి నెలనెల తప్పకుండా వారి ఖాతాల్లో డబ్బు జమ చేసే విధంగా ప్లాన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: ‘అఖండ’ థియేటర్ బిజినెస్ క్లోజ్.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే ?