https://oktelugu.com/

AP Employees Strike: ఈ టైంలో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సమంజసమేనా?

AP Employees Strike: ప్రపంచవ్యాప్తంగా కరోనా కమ్మేస్తోంది. దేశ థర్డ్ వేవ్ దిశగా సాగుతోంది. దేశంలో రోజుకు 3 లక్షల కేసులు దాటుతున్నాయి. ఏపీలో 12 వేలకు రోజువారీ కేసుల సంఖ్య పెరిగింది. ఇలాంటి కరోనా కల్లోలంలో కంపెనీలన్నీ తిరిగి వర్క్ ఫ్రం హోం ఇచ్చేస్తున్నాయి. ఇతర ఉద్యోగ, ఉపాధి వర్గాలు సైతం బంద్ చేస్తున్నాయి. ఇంతటి కల్లోలంలో ఇంట్లో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే అందరి ముందు ఉన్న కర్తవ్యం. కానీ ఈ సమయంలో ఏపీ ఉద్యోగులు పీఆర్సీ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 22, 2022 / 12:47 PM IST
    Follow us on

    AP Employees Strike: ప్రపంచవ్యాప్తంగా కరోనా కమ్మేస్తోంది. దేశ థర్డ్ వేవ్ దిశగా సాగుతోంది. దేశంలో రోజుకు 3 లక్షల కేసులు దాటుతున్నాయి. ఏపీలో 12 వేలకు రోజువారీ కేసుల సంఖ్య పెరిగింది. ఇలాంటి కరోనా కల్లోలంలో కంపెనీలన్నీ తిరిగి వర్క్ ఫ్రం హోం ఇచ్చేస్తున్నాయి. ఇతర ఉద్యోగ, ఉపాధి వర్గాలు సైతం బంద్ చేస్తున్నాయి. ఇంతటి కల్లోలంలో ఇంట్లో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే అందరి ముందు ఉన్న కర్తవ్యం. కానీ ఈ సమయంలో ఏపీ ఉద్యోగులు పీఆర్సీ కోసం సమ్మె బాట పట్టడం సమంజసమేనా? ఇందులో న్యాయం ఉందా? కోరికలు తీర్చుకోవడానికి ఇది సరైన సమయమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    AP Employees Strike:

    ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని ముందు వెనుక ఆలోచించాలి. ఇంట్లో డబ్బులు లేకపోతే కొత్త వస్తువు కొనకుండా అడ్జస్ట్ అయిపోతాం. ఇదే సూత్రం ప్రభుత్వానికి వర్తిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సంక్షేమ పథకాలకు ఇబ్బడి ముబ్బడిగా పంచేసి చేతిలో చిల్లీ గవ్వ లేక అప్పుల కోసం అర్రులు చాస్తోంది. కరోనా ఇక ఏపీ ఆర్థిక వ్యవస్థపై చావు దెబ్బ తీసింది.

    Also Read:డిమాండ్ ఉన్న ఈ ఐటమ్ లో లేటెస్ట్ బెస్ట్ ఇవే !

    మొదటి వేవ్ లో దేశ ప్రజలు ఎంత నరకం చూశారో చూశాం.. వలస, ఉపాధి కూలీలు లక్షలాది మంది మోడీ సర్కార్ సడెన్ లాక్ డౌన్ వల్ల వందల కి.మీలు నడిచి వెళ్లిన దైన్యం కనిపించింది. వ్యాపారాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఏ రంగమూ లాభదాయకంగా కనిపించలేదు. కానీ అందరికంటే ఠంచనుగా మాత్రం ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే నెలానెలా జీతాలు అందాయి. మిగిలిన ప్రైవేటు కార్మికులకు అసలు ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియదు.. ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మంది కాంట్రాక్టు సిబ్బందిపైనే ఆధారపడి ఉన్నారు. దాదాపు 50శాతం మందికి పైగానే నేడు కంప్యూటర్ ను ఆపరేట్ చేసే సామర్థ్యంలేదు. దీంతో కాంట్రాక్ట్ సిబ్బందితోనే ఈప్రభుత్వ ఉద్యోగులు పనిచేసుకుంటూ జీతాలు భారీగా పొందుతున్నారు. మరోవైపు కాంట్రాక్టు సిబ్బందికి ముక్కీ మూలుగుతున్నా సరైన జీతాలు అందడం లేదు.

    ఏపీ ఉద్యోగులను హైలెట్ చేస్తున్న మీడియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇప్పటికే మొదటి కరోనా వేవ్ లో చాలా మంది జర్నలిస్టులను టాప్ మీడియా సంస్థలు సైతం తొలగించాయి. ఉన్న వారికి 50శాతం మాత్రమే జీతాలు ఇచ్చాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలాంటి పెద్ద సంస్థల్లోనూ దాదాపు ఏడాది పాటు జీతాల్లో కోత విధించారు. ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బందిని తొలగించి నానా విన్యాసాలు చేశాయి ఈ మీడియా సంస్థలు.. ఇప్పుడు ఇవే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, ఫిట్ మెంట్ ఉద్యమాన్ని రగిలిస్తున్నాయి. నానా యాగీ చేస్తున్నారు. ముందు మీడియాలో తొలగించిన జర్నలిస్టులను న్యాయం చేశాక ఇవి ప్రభుత్వ ఉద్యోగులపై మాట్లాడితే బాగుంటుందని జర్నలిస్టులు కోరుతున్నారు.

    ఇలాంటి సమయంలో ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులకు ఆర్థిక పరిస్థితి తెలుసు. ఇంత తెలిసి పీఆర్సీ, జీతాల కోసం సమ్మె చేయడమే ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ఏదైనా పట్టువిడుపులు ఉండాలి. ప్రభుత్వం ఓవైపు పీఆర్సీపై తేల్చేందుకు రెడీ అవుతోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా? ప్రజలు తమతో కలిసి వస్తారా? అంటే కష్టమే నంటున్నారు. ఏపీ ఉద్యోగుల పట్ల ప్రజల్లో అంత సానుభూతి లేదన్నది వాస్తవం..

    జగన్ సర్కార్ ఇప్పుడు ‘మూలిగే నక్క’. అది లేవడానికే ఆపసోపాలు పడుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు పట్టుబట్టడానికి ఇది సరైన సమయం కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వారు నిజంగానే సమ్మెకు దిగితే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

    ఉపాధ్యాయులు, ఉద్యోగులు చాలా మంది నెలకు 50 వేల నుంచి లక్షకు పైగానే జీతాలు తీసుకుంటున్న వారు ఉన్నారు. ఇక వారికి బోలెడు సెలవులు. ఇన్ని సెలవులు ఏ ప్రభుత్వ ఉద్యోగికి ఉండవు. ఇటీవల తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని.. కలెక్టరేట్ ను ముట్టడించిన టీచర్లను చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

    ఉద్యోగుల విషయం చూసుకుంటే ఒక్క హెచ్.ఆర్ఏ విషయంలోనే వారికి అన్యాయం జరిగిందని అంటున్నారు. మిగిలిన అంశాల్లో వారికి జరిగిన నష్టం లేదని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రజల్లో తాము భాగమంటూ వారి పన్నుల రూపంలో కట్టే డబ్బును ఇలా డిమాండ్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. కరోనా కల్లోలంలో కష్టాల్లో ఉన్న ప్రజలతోపాటే ఉద్యోగులు సర్దుకుపోవాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

    ఈ కోవిడ్ కల్లోలంలో సమ్మె చేయడం ఎంత మాత్రం మంచిది కాదన్నది మెజార్టీ ప్రజల అభిప్రాయం. కరోనా పోయి ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదుటపడి బాగా ఆదాయం వస్తే అప్పుడు డిమాండ్ చేస్తే అర్థం పరమార్థం ఉంటుంది.

    జగన్ అసలే మొండివాడు.. పంతానికి పోతే పగ సాదిస్తాడు. అది తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఇలానే వ్యవహరిస్తే వారికే రిస్క్ అంటున్నారు. విపక్షాలు, మీడియా సపోర్టు చూసి రెచ్చిపోతే ఉన్నది పోతుంది.. ఉంచుకున్నది పోతుంది అంటున్నారు.

    Also Read: థర్టీ ప్లస్ లో విడాకులు… సమంత-చైతూలలో మొదట శుభవార్త చెప్పేదెవరు?