https://oktelugu.com/

RRR Ticket Prices: ‘ఆర్ఆర్ఆర్’ మరీ ఇంత కాస్లీనా?

RRR Ticket Prices:  ఈనెల 25న విడుదల కానున్న RRR(ట్రిపుల్‌ ఆర్‌) సినిమా టికెట్‌ ధర భారీగా పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాలు అనుమతులు ఇచ్చాయి. సుమారు రూ.300 కోట్లతో సినిమా నిర్మించినట్లు దర్శకుడు రాజమౌలి తెలిపారు. భారీ బడ్జెట్‌ సినిమా అయినందున టికెట్‌ ధర పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని దర్శకుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. సినిమా ఖర్చు, హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్, పెట్టుబడిలో దర్శక నిర్మాతల షేర్‌ గురించి ఇటీవల కలిసి వివరించారు. దీంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2022 / 03:10 PM IST
    Follow us on

    RRR Ticket Prices:  ఈనెల 25న విడుదల కానున్న RRR(ట్రిపుల్‌ ఆర్‌) సినిమా టికెట్‌ ధర భారీగా పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాలు అనుమతులు ఇచ్చాయి. సుమారు రూ.300 కోట్లతో సినిమా నిర్మించినట్లు దర్శకుడు రాజమౌలి తెలిపారు. భారీ బడ్జెట్‌ సినిమా అయినందున టికెట్‌ ధర పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని దర్శకుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. సినిమా ఖర్చు, హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్, పెట్టుబడిలో దర్శక నిర్మాతల షేర్‌ గురించి ఇటీవల కలిసి వివరించారు. దీంతో టికెట్‌ ధరను మొదటి పది రోజులు రూ.70 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు పది రోజులపాటు ఐదు ఆటలు నడిపించుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చారు. ఈమేరకు జీవో జారీ చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవో ప్రకారమే అనుమతులు జారీ చేసినట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. గతంలో టికెట్‌ ధరలను భారీగా తగ్గించారు. సామాన్యులకు అందుబాటులో సినిమా ఉండాలనే టికెట్‌ ధరలు తగ్గించామని తెలిపారు. లాభాలు రావాలంటే హీరోలు రెమ్యునరేషన్‌ తగ్గించుకోవాలని సూచించారు. తర్వాత నిర్మాతలు, మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యమంత్రి జగన్‌ను పలుమార్లు కలిసి టికెట ధరల పెంపుపై చర్చించారు. ఈ క్రమంలో ఈనెల 10న టికెట్‌ ధరల పెంపునకు సబంధించిన జీవో విడుదల చేశారు. తాజాగా ట్రిపుల్‌ ఆర్‌ సినిమా టికెట్ల ధర మరింత పెంచుకునే వెసులుబాటు కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టానుసారం టికెట్ ధర పెంచితే సామాన్యుడికి సినిమా ఎలా అందుబాటులో ఉన్నట్లు అని పలువురు ప్రశ్నిస్తున్నారు..

    -తెలంగాణలోనూ భారీగా పెరగనున్న టికెట్‌ ధర..
    త్వరలో విడుదల కానున్న ట్రిపుల్‌ ఆర్‌ సినిమా టికెట్‌ ధర తెలంగాణలోనూ భారీగా పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదటి పది రోజులు సాధారణ థియేటర్లలో రూ.50, తర్వాత వారం రోజులు రూ.30 చొప్పున, మల్టీప్లెక్స్‌లలో మొదటి వారం రూ.100, తర్వాత వారం రూ.50 పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ శనివారం జీవో విడుదల చేసింది. దీంతో తెలంగాణ ప్రజలకూ టికెట్‌ భారం తప్పని పరిస్థితి.

    -ప్రమోషన్ల ద్వారానే కోట్ల రూపాయల ఆదాయం..
    రాజమౌళికి సినిమా ప్రమోషన్‌ విషయంలో ఇతర దర్శకులకంటే వినూత్నంగా ఆలోచిస్తారు. ప్రజల్లో హైప్‌ తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగానే ట్రిపుల్‌ ఆర్‌ సినిమాపై ఇప్పటికే అంచానాలు పెంచారు. పాటల విడుదల విషయంలోనూ కమర్షియల్‌ ట్రిక్స్‌ ఫాలో అయ్యారు. వ్యూస్, రేటింగ్‌ ఆధారంగా సినిమా పాటలు విడుదల చేశారు. ఇటీవలే సినిమాలోని మరో పాటను విడుదల చేశారు. నాలుగు రోజుల క్రితం రామ్‌చరణ్, ఎన్టీయార్, రాజమౌలి ఇంటర్వ్యూ వీడియోను విడుదల చేశారు. దీనిని కూడా ఒక బీజ్‌లో చిత్రీకరించి అన్ని చానెళ్లలో ప్రసారం చేయించి సినిమా గురించి ముచ్చటిస్తూ సినిమాపై అంచనాలు మరింత పెంచారు. ఆదివారం మూవీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించనున్నారు. దీనికోసం వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా వేడుకలు సంబంధించిన హక్కులన్నీ మీడియాకు రాజమౌలి విక్రయిస్తారు. దీని ద్వారానే కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న నిర్మాతలు తాజాగా టికెట్‌ ధర పెంపుకోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కలిసి విన్నవించి ధర పెంచుకునే వెసులుబాటు పొందారు.

    -కాంట్రవర్సీ ద్వారా కూడా ప్రమోషనే..
    – సినిమాపై అల్లూరి సీతారామరాజు ముని మనుమడు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. సీతారామరాజు పాత్రను పూర్తిగా సినిమాలో వక్రీకరించారని పిటిషన్‌ వేశారు. అయితే రాజమౌలి సినిమా షూటింగ్‌ ప్రారంభంలోనే సినిమా పూర్తిగా కమర్షియల్‌గా చిత్రీకరిస్తున్నామని, కుమురంభీ, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో కథ రూపొందించినట్లు ప్రకటించారు. దీంతో అల్లూరి మునిమనుమడి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ అంశాన్ని కూడా రాజమౌళి ప్రమోషన్‌గా వాడుకున్నారు. మీడియాలో ప్రసారం చేయించడం, పత్రికల్లో వార్తలు రాయించడం ద్వారా సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు.

    Recommended Video: