Kanyakumari MP Pen Lost: అధికారముండాలే కానీ ఏదైనా చేయొచ్చు. ఎంతవరకైనా వెళ్లొచ్చు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఉంటుంది. వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఫర్వాలేదు. కొన్ని సంఘటనలు చూస్తే వింత గొలుపుతాయి. ఇక్కడ జరిగిన విషయం చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేయడం కామనే. ఓ ఎంపీ చేసిన తతంగం ఇప్పడు సంచలనంగా మారింది. సామాన్యుడు అయితే పెద్ద పెద్ద వస్తువులు పోయినా స్పందించని పోలీసులు ఎంపీ కావడంతో చిన్న వస్తువుకు కూడా విచారణ చేపట్టడం సంచనలం కలిగిస్తోంది.
తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ ఓ వింతైన కేసు పెట్టారు. తన పెన్ను పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యపరచింది. ఎంపీ పెన్ను పోయిందని అనగానే పోలీసులు కూడా ఉలిక్కి పడ్డారు. పెన్ను వెతికేందుకు విచారణ చేపట్టారు. అధికారం ఉంటే అలా లేదంటే సామాన్యుడైతే మాత్రం పట్టించుకుంటారా? ఎంపీ పెన్నుకు అంత సీన్ ఉందా? ఎందుకంత రియక్షన్ అయ్యారనే వాదనలు కూడా వస్తున్నాయి.

ఇంతకీ ఆ పెన్ను ప్రత్యేకత ఏమిటి? దానికి ఎందుకంత ప్రాధాన్యత? అది వారి నాన్న ద్వారా తనకు వచ్చిన పెన్ను అని దాని విలువ రూ.50 వేలు ఉంటుందని తెలుస్తోంది. అందుకే అంత ప్రేయార్టీ ఇచ్చారని చెబుతున్నారు. కానీ అధికారం ఉంటే ఎంత చిన్న వస్తువైనా పెద్దదే. అదే ఏ అధికారం లేకపోతే ఎంత విలువైన వస్తువు పోయినా పట్టించుకోరని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ గారి పెన్ను కోసం పోలీసులు సృష్టించిన హంగామా చూస్తుంటే అందరికి అనుమానాలు వస్తున్నాయి.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రచారం కోసం కన్యాకుమారికి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన పెన్ను పోయిందని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పెన్ను కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎంపీ పెన్ను కోసం పోలీసులు చేస్తున్న హడావిడి చేస్తున్నారు. మొత్తానికి అధికారం ఉంటే ఎంతటి వెసులుబాటు ఉంటుందో తెలుస్తోంది. ఎంపీ గారి పెన్ను కోసం పోలీసులు అన్ని దారుల్లో వెతుకులాడుతుండటం విశేషం.
Also Read: Pawan Kalyan- PM Modi: ప్రధాని మోదీ సభకు పవన్ అందుకే రాలేదట?
[…] […]
[…] […]
[…] […]
[…] […]