Petrol Gas: ఈ ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. బతకాడానికి గాలినిచ్చింది. తాగడానికి నీరు ఇచ్చింది. తినడానికి ఆహారాన్ని ఇచ్చింది. కానీ బదులుగా మనం ఏం ఇచ్చాం.. ఆ ప్రకృతిని చెరబట్టి నాశనం చేస్తున్నాం. అదే ఇప్పుడు భూమిపై ఉత్పాతాలకు కారణమవుతోంది. కరోనా వంటి వైరస్ లు పుట్టుకొచ్చి మానవాళిని కబళిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలకు కారణం అవుతున్నాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు భూమ్మీద ఉపయోగించే కర్భన ఉద్గారాలే కారణం. వీటిని వినియోగించడం వల్ల భూమిపై రోజు రోజుకు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఓ వైపు కర్బన ఉద్గారాలను తగ్గించాలని తీర్మానం చేస్తున్న దేశాలు మరోవైపు వారి లక్ష్యాలను సాధించడానికి శిలాజ ఇంధనాల ఉత్పత్తిని పెంచుతున్నాయి. వాస్తవానికి 2010 స్థాయిలను ఆధారంగా చేసుకొని 2030 వరకు 45 శాతం కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి. కానీ ఈ నిబంధనలు చాలా దేశాలు పాటించడం లేదు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ప్రొడక్షన్ గ్యాస్ రిపోర్టును బయటపెట్టింది. దీని ప్రకారం ఈ శతాబ్దిలో 1.5 డిగ్రీ సెంటిగ్రేట్ కంటే ఎక్కువే ఉష్ణోగ్రత పెరిగిందని తెలిపింది.
పెట్రోల్, గ్యాస్ ఇంధనాల వినియోగంపై ప్రభుత్వాల దగ్గరున్న ప్రణాళికలు, అవి ఐక్యరాజ్య సమితి పెట్టుకున్న లక్ష్యాలకు విరుద్దంగా ఉన్నాయి. బొగ్గు తవ్వకాలు కొంత తగ్గించినప్పటకి గ్యాస్, పెట్రోల్, వెలికితీత మాత్రం గణనీయంగా పెరిగింది. 2019లో యూఎన్ ఈపీ మొదటి నివేదిక ప్రకారం నిర్ణయించుకున్న లక్ష్యాలతో కొద్దిగామార్పు వచ్చింది. నెట్ జీరో ఉద్గారాలపై వివిధ దేశాలు ఇప్పటికే చాలా లక్ష్యాలు పెట్టుకున్నాయి కానీ అవి రానున్న రోజుల్లో ఏ విధంగా కర్బన ఉద్గారాలను ఎలా తగ్గిస్తాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.
చాలా దేశాలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఏమాత్రం పనిచేయడం లేదని తెలుస్తోది. ఉష్ణోగ్రత 2 సెంటి గ్రేడ్ కంటే తక్కువ ఉండడానికి ప్రయత్నించాల్సి ఉండగా… అందుకు విరుద్ధంగా 45 శాతం ఎక్కువగానే శిలాజ ఇంధనాలు ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గినా గ్యాస్ ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. రష్యా, ఆస్ట్రేలియా, సౌదీ అరెబియా, యూఎస్, యూకే సహా 15 ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల్లో ఇది కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం తెలిపింది.
ఆయా దేశాలు లక్ష్యాలను మరిచి రానున్న రోజుల్లో 110 శాతం ఇంధనాలు ఉత్పత్తి చేస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఉష్ణోగ్రతను 1.5 వరకు పరిమితి చేసి బొగ్గు, చమురు, గ్యాస్ ఉత్పత్తులను తగ్గించాలని కొందరు వాదిస్తున్నారు. అలాగే ఉత్పత్తి తగ్గించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నా మరోవైపు వాటి పని అవి చేస్తున్నారు. దీంతో లక్ష్యాలకు, ప్రభుత్వాలు చేస్తున్న పనులకు పొంతన కుదరడం లేదు. కరోనా అనంతరం శిలాజ ఇంధనాల ఉత్పత్తి విపరీతంగా పెరిగాయి. కొన్ని దేశాలు తమ ఆదాయాన్ని రికవరీ చేసుకోవడం కోసం స్థాయికి మించి ఉత్పత్తిని కొనసాగించాయి.
ఈ సంవత్సరం బొగ్గు, చమురు, గ్యాస్ నిధుల కోసం ఉత్పత్తి సంస్థలు బ్యాంకు రుణం కోసం రావడం లేదంటే వాటి ఉత్పత్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పారిస్ ఒప్పందాన్ని అమలుచేయాలంటే పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలి. ఆ తరువాత భూమినుంచి పెట్రోల్ తీయడం మానుకోవాలి. అప్పుడే పర్యావరణానికి మేలు చేసిన వాళ్లమవుతాయని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
మరికొన్ని రోజుల్లో కాప్ 26 కాన్ఫరెన్స్ లను నిర్వహించనున్నారు.ఇదివరకు జరిగిన సమావేశల్లో ఉష్ణోగ్రత తగ్గించేందుకు చాలా దేశాలు ఒప్పందం చేశాయి. కానీ అభివృద్ధి పేరిట పెట్రోల్, గ్యాస్ ఉత్పత్తుల కోసం భూములను తవ్వుతున్నారు. దీంతో కార్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే అంతర్గతంగా దేశం ఇందన ఉత్పత్తులపై పరమితులు విధించాలి. ప్రభుత్వాలు ఈ విషయంలో కేర్ తీసుకొన సరైన నిర్ణయం తీసుకోవాలి. కొన్ని దేశాలు పైకి అన్ని రకాల మద్దతు ప్రకటిస్తూనే మరోవైపు ఇంధన ఉత్పత్తులను ఏమాత్రం తగ్గించడం లేదని తెలుస్తోంది.