AP Government: ఎవరైనా అధికారంలోకి రాకముందు ప్రజాసంక్షేమమే ధ్యేయమని చెబతారు కానీ అధికారంలోకి వచ్చాక మాట మారుస్తారు. ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారం కనిపిస్తోంది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా కేంద్రం పెట్రో భారంపై స్పందించి పన్నులు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. దీంతో సామాన్యులపై పెనుభారమే పడుతోంది. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నా పెట్రో చార్జీలు మాత్రం తగ్గించకపోవడం విడ్డూరమే.

2019లో రూ. 76 ఉన్న పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 120కి చేరింది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కేంద్రం సెస్సు తగ్గించినా రాష్ట్రం మాత్రం తగ్గడం లేదు. దీంతో పెట్రో భారం ప్రజలపైనే పడుతోంది. దీనికి తోడు రాజధాని సెస్సు కూడా విధిస్తున్నారు. రాజధానిలో పనులు చేయకుండా సెస్సు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
Also Read: Bigg Boss Non-Stop Telugu: చివరి దశకు ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’..: బిందు, అఖిల్ లలో విన్నర్ ఎవరంటే..?
పెట్రో వాతలతో జనం కుదేలైపోతున్నారు. జేబులు గుళ్ల అవుతున్నాయి. ఫలితంగా పెట్రో ధరలు ఇలా పెరుతుంటే ఇక ఎలాగా బతికేది అని వాపోతున్నారు .జగన్ వేలాది కోట్లు ప్రజల ఖాతాల్లోకి మళ్లిస్తున్నా పెట్రో ధరలు మాత్రం తగ్గించకుండా వేధిస్తున్నారు. దీంతో ప్రజల్లో అసంతృప్తి రగులుతోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పేందుకే నిర్ణయించుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా

ఏపీలో ధరల మోత మోగుతూనే ఉంది. అన్నింటిపైన పన్నులు వేస్తున్నారు. ఇటీవల ఆస్తి పన్ను కూడా కట్టాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రజలపై ఎంత పడితే అంత భారం వేస్తూ తమ ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారు దీంతో వారిలో నైరాశ్యం పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పాలని చూస్తున్నట్లు సమాచారం. దీనిపై జగన్ ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటయని తెలుస్తోంది.
Also Read: YS Sharmila Padayatra:1000 కిలోమీటర్లకు చేరిన వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం