KCR Job Notifications: తెలంగాణలో కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూత్ నుంచి ఒకటే డిమాండ్ బలంగా వస్తోంది. అదే నోటిఫికేషన్లు. కేసీఆర్ ఎప్పుడిస్తారంటూ అందరూ బలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అటు ప్రతి పక్షాలు కూడా ఎన్నో నిరసనలు, ధర్నాలు చేస్తూనే ఉన్నాయి. కాగా ఉప ఎన్నికలు, జీహెచ్ ఎంసీ ఎన్నిలు వచ్చినప్పుడల్లా త్వరలోనే నోటిషికేషన్లు అనే డైలాగ్ కామన్ గానే వినిపించింది.

దీంతో ఈ త్వరలోనే ఇంకెన్ని సార్లు చెప్తారంటూ అటు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు, ట్రోలింగ్స్ వచ్చాయి. కాగా వచ్చే ఏడాది ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ సమయంలోనే కేసీఆర్ నోటిఫికేషన్ వేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్ నిన్న 91,142 పోస్టులు ప్రకటించారు.
వీటికి నోటిఫికేషన్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంత సడెన్ గా నోటిఫికేషణ్ ఇవ్వడం వెనక కేసీఆర్ ఆంతర్యం ఏంటని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి కారణం బీజేపీ అని తెలుస్తోంది. బీజేపీ ఊపు తగ్గించడానికే నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడే బీజేపీ ఊపు కేసీఆర్‌కు అర్థమైందని అంటున్నారు.
ఎలాగూ నాలుగు రాష్ట్రాల్లో బీజపీ గెలుస్తుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ తెలంగాణలో తనమీద పడుతుందని కేసీఆర్ భావించారు. అందుకే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ఊపును తగ్గించడానికి యువత దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీకి మొదటి నుంచి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఆ యువత దృష్టిని మరల్చితే గనక బీజేపీ గురించి పెద్దగా చర్చ జరగదని, ఆటోమేటిక్ గా తన నోటిఫికేషన్లు తన గురించి మాట్లాడేలా చేస్తాయని భావిస్తున్నారు కేసీఆర్.

అయితే పాత నోటిఫికేషన్లు పక్కన పెట్టేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడాన్ని బట్టి చూస్తుంటేనే ఆయన టార్గెట్ బీజేపీ ఊపును తగ్గించడం అని అర్థం అవుతోంది. పైగా ముందస్తుకు వెళ్లేందుకు కూడా చూస్తున్నారు కాబట్టి.. ఇప్పటి నుంచే నోటిఫికేషన్లు, లీగల్ పరిష్కారాల పేరిట ఎన్నికల వరకు ఇదే చర్చ జరిగేలా ప్లాన్ చేసి మరోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు కేసీఆర్. మరి ఆయన ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.