
రెండు దశాబ్దాల క్రితం ప్రజల ఆలోచనా వైఖరికి, ఇప్పటి ప్రజల ఆలోచనా వైఖరికి చాలా తేడా ఉంది. గతంలో ప్రజలు పత్రికల్లో వచ్చే వార్తలను మాత్రమే నిజమని నమ్మేవారు. కానీ ప్రస్తుతం వెబ్ మీడియా, సోషల్ మీడియా ప్రాధాన్యత పెరగడంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. నాయకులు ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు శరవేగంగా వాటికి సంబంధించిన సమాచారం చేరుతోంది.
Also Read : బీజేపీ షాక్ తో వెనక్కు తగ్గిన జగన్ సర్కార్..?
అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం అంత బలమైన టీడీపీ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బలహీనపడటానికి చంద్రబాబు కారణమని చెబుతున్నారు. ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిందో అప్పటినుంచే టీడీపీ పతనం ప్రారంభమైందని అభిప్రాయపడుతున్నారు. 2015 సంవత్సరంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ టీడీపీ 5 కోట్ల రూపాయలకు బేరం చేసింది.
అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు, స్టీఫెన్ సన్ మధ్య డీల్ కు సంబంధించిన వ్యవహారాలను నడిపారు. 5 కోట్ల రూపాయలకు బేరం కుదిరిన తరువాత 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో విడుదలైన వీడియో సాక్ష్యం సంచలనమైంది. చంద్రబాబు, టీడీపీ నేతలు తప్పు చేయలేదని ఎంత చెప్పినా ఆ మాటలను ప్రజలు మాత్రం నమ్మలేదు.
ఫలితంగా తెలంగాణ ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత ఏర్పడి ఆ పార్టీ పతనానికి కారణమైంది. తెలంగాణ స్థాయిలో కాకపోయినా ఏపీలో సైతం టీడీపీ అంతకంతకూ బలహీనపడుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ బలపడటం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
Also Read : కమలానికి దూరంగా ‘చేతి’కి గులాబీలు!