spot_img
Homeఅంతర్జాతీయంPakistan: పాకిస్తాన్ ముక్కలు.. మూడు దేశాలుగా మారబోతోందా?

Pakistan: పాకిస్తాన్ ముక్కలు.. మూడు దేశాలుగా మారబోతోందా?

Pakistan: ధరలు పెరుగుతున్నాయి. కంపెనీలు మూతపడుతున్నాయి. కనీసం పట్టపగలు రెండు గంటలు కూడా విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగం తారస్థాయికి చేరింది. పేదరికం పెచ్చరిల్లుతోంది. ఆదుకుంటామన్నా ఒపెక్ దేశాలు పత్తాకు లేవు. ఇది ఇలా ఉంటే సరిహద్దుల్లో గొడవలు. ఆఫ్ఘనిస్తాన్ పదేపదే కంచె తొలగిస్తోంది. కయ్యానికి కాలు దువ్వుతోంది. స్థిరమైన ప్రభుత్వం లేకపోవడంతో పాలన పడకేసింది. ఏర్పాటు ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. ఇవీ పాకిస్తాన్ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు. మరి ఇవి ఆ దేశాన్ని ముక్కలు చేస్తాయా?

గిల్ట్ బలిస్తాన్, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉద్యమాలు జరుగుతున్నాయి. హింసాకాండ కూడా తీవ్రస్థాయిలో నమోదవుతోంది. అయినప్పటికీ వీటిని నిరోధానికి అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ స్థానిక అధికారులు రంగంలోకి దిగినప్పటికీ ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఇది ఇలా ఉండగానే ఇటీవల పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఆర్మీ వాడే హెలికాప్టర్ కూలిపోయింది. వాస్తవానికి ఇది ప్రమాదమని తొలుత అక్కడి సైన్యం ప్రకటించింది. కానీ అది తమ పని అని తెహ్రిక్_ఏ_ తాలిబాన్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుంది. పాకిస్తాన్ కంచె నిర్మించినప్పుడల్లా ఈ ఉగ్రవాద సంస్థ ధ్వంసం చేస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేసి అక్కడి సైన్యాన్ని హతమారుస్తోంది. ఇటీవల జరిగిన ఘటనలో దాదాపు 40 మంది దాకా పాకిస్తాన్ సైనికులను హతమార్చింది. వాస్తవానికి దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు అక్కడి ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉంటారు. అదే దరిద్రమో తెలియడం లేదు గాని.. అక్కడి ప్రజలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. తాము భారత్లో కలిసి పోతామంటూ షియా ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన అధినేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పాకిస్తాన్లో ఇలాంటి ఉద్యమాలు జరిగినప్పుడు అక్కడి ప్రభుత్వం నిరంకుశంగా అణిచివేస్తుంది. ప్రజల్లో తిరుగుబాటు అధికం కావడంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది.

పాకిస్తాన్ దేశంలో ప్రభుత్వం మీద సైన్యం పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. కానీ గత కొంతకాలం నుంచి సైన్యంలో కూడా స్థిరత్వం లేకుండా పోయింది. పాలన పరంగా కూడా స్థిరత్వం లేకపోవడంతో దేశంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర దేశాలు అప్పులు ఇస్తే తప్ప ఆ దేశం కోలుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆ మధ్య భారీగా ఆర్థిక సహాయం చేస్తామని సౌదీ అరేబియా ముందుకు వచ్చింది. అయితే ఇది సహాయం కాదని పాకిస్తాన్ దేశాన్ని కొనుగోలు చేసే ఒప్పందం అని తర్వాతే తెలిసింది. అయితే సౌదీ అరేబియా పన్నాగం తెలిసి పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు దీనికి ఒప్పుకోలేదు. ఇక సైన్యంలో కూడా అవినీతి పెరిగిపోవడంతో అందులో కూడా లుకలుకలు బయటపడుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్ సైన్యానికి చెందిన కొంతమంది కీలక అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, భారీ మొత్తంలో డబ్బుతో సౌదీ పారిపోయారు. ఎంతమంది లండన్ కు వెళ్లిపోయారు. ఇటువంటి పరిణామాలు ఆ దేశ ప్రజల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. తమని దారిద్రం లో ఉంచి.. సైనికాధికారులు భారీగా డబ్బులు కూడ బెడుతున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. మేము భారత్ లో కలిసి పోతామంటూ నినాదాలు చేస్తున్నారు. గోటి చుట్టూ రోకటి పోటు లాగా ఒకదాని వెంట ఒకటి వివాదాలు పొడచూపుతున్న నేపథ్యంలో.. వీటి నివారణకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular