https://oktelugu.com/

జర్నలిస్టుల సమస్య.. కేసీఆర్ కు నిజంగా తెలియదా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటారో ఎవ్వరికి అంతుబట్టదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును సైతం అమరావతికి పంపిన ఘనుడాయన.. అలాంటి రాజకీయ దురంధరుడికి జర్నలిస్టుల సమస్యలు నిజంగానే తెలియవా అంటే ఆశ్చర్యం వేయకమానవు. మత సామరస్యం సాధ్యమేనా ? (Part 4) *కేసీఆర్ కు నిజంగా తెలియదా? నిన్న రాత్రి జరిగిన ప్రెస్ మీట్ లో కరోనా లాక్ డౌన్ పొడిగించిన కేసీఆర్ చాలా సమస్యలపై స్పందించారు. చివరగా జర్నలిస్టుల సమస్యలు తీర్చవా? […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 6, 2020 / 02:10 PM IST
    Follow us on


    తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటారో ఎవ్వరికి అంతుబట్టదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును సైతం అమరావతికి పంపిన ఘనుడాయన.. అలాంటి రాజకీయ దురంధరుడికి జర్నలిస్టుల సమస్యలు నిజంగానే తెలియవా అంటే ఆశ్చర్యం వేయకమానవు.

    మత సామరస్యం సాధ్యమేనా ? (Part 4)

    *కేసీఆర్ కు నిజంగా తెలియదా?
    నిన్న రాత్రి జరిగిన ప్రెస్ మీట్ లో కరోనా లాక్ డౌన్ పొడిగించిన కేసీఆర్ చాలా సమస్యలపై స్పందించారు. చివరగా జర్నలిస్టుల సమస్యలు తీర్చవా? అంటే.. ‘జర్నలిస్టుల సమస్యలా? నాకు చెబితే కదా తెలిసేవి? ఏం సమస్యలు’ అంటూ ప్రశ్నించారు. దానికి జర్నలిస్టులు.. ‘ఈనెల జర్నలిస్టుల జీతాలు కట్ చేశారు. చాలా మందిని ఇంటికి పంపించి తీసేశారు’ అంటూ సమాధానం ఇవ్వగా.. కేసీఆర్ స్పందన చాలా ఆశ్చర్యం కలిగించింది. ‘నిజమా? నాకు తెలియదు.. ఈ టైంలో కడుపుకొట్టుడు ఏం న్యాయం..దుర్మార్గం’ అంటూ కవర్ చేశారు. రేపు అందరూ ఒక వినతి పత్రం, దరఖాస్తు ఇవ్వాలని తాను చర్య తీసుకుంటానని కేసీఆర్ అన్నారు. పత్రికల మీద యాజమాన్యాల మీద పెద్దగా కోపానికి అయితే రాలేదు.

    ఏపీలో మరోసారి మద్యం బంద్..!

    *కేసీఆర్, కేటీఆర్ లకు తెలియదంటే విడ్డూరమే?
    నిజానికి లాక్డౌన్ అయిన 10 రోజులకే తెలుగులోని రెండు అగ్రశ్రేణి దినపత్రికలు తమ సంస్థల్లో పనిచేస్తున్న 70శాతం ఉద్యోగులను ఇంటికి పంపించాయి. సెలువు పేరుతో కొందరిని.. హోల్డ్ పేరుతో మరికొందరిని సాగనంపాయి. ఉద్యోగాలు కోల్పోయి.. జీతాలు లేక వారంతా నరకయాతన పడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో.. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కేటీఆర్ సహా కేసీఆర్ కు సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ చాలా మంది జర్నలిస్టులు సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ దీని మీద స్పందించలేదు. ఇక ఇంత రచ్చ జరుగుతున్నా.. ఇంత మంది వెబ్ సైట్లు, న్యూస్ లలో రాస్తున్నా కేసీఆర్ చూడలేదంటే అది నిజంగా విడ్డూరమే మరి..

    వలస కూలీల రైళ్లను రద్దు చేసిన బీజేపీ సర్కార్!

    *పత్రికలు, మీడియాతో పెట్టుకోవడం కేసీఆర్ కు ఇష్టం లేదా?
    మొన్నటికి మొన్న ఆ పత్రికాధిపతిపై నిప్పులు చెరిగిన కేసీఆర్ అంతు చూస్తానన్నారు. అవాకులు రాస్తున్న పత్రిక తీరును మీడియా సాక్షిగా ఎండగట్టారు. అలాంటి కేసీఆర్ తర్వాత ఏం చర్యలు తీసుకోలేదు.. ఇప్పుడు నిన్న రాత్రి ప్రెస్ మీట్లోనూ
    జర్నలిస్టుల సమస్యలు తీర్చవా అంటే అవేంటో తెలియదన్నారు. దీన్ని బట్టి కేసీఆర్ నిజంగానే జర్నలిస్టుల సమస్యలపై మౌనం దాలుస్తున్నారా? ఆ సంస్థలతో పెట్టుకోవడం ఇష్టం లేదా? లేక నిజంగా తెలియదా అన్నది అంతుచిక్కని విధంగా ఉంది. ఇంత పెద్ద ఇష్యూలో కేసీఆర్ స్పందన మాత్రం బాగా లేదని జర్నలిస్టు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    *ఇప్పటికైనా స్పందిస్తారా?
    జర్నలిస్టుల సమస్యలపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు చెప్పాలని.. తనకు దరఖాస్తు ఇస్తే చర్య తీసుకుంటానని కేసీఆర్ తెలిపారు. ఈరోజు మీటింగ్ పెట్టారు. మరి ఇందులోనైనా కేసీఆర్ తీసివేసిన జర్నలిస్టులకు న్యాయం చేస్తారా? ఆ యాజమాన్యాలకు ఎలాంటి హెచ్చరికలు పంపిస్తారన్నది వేచిచూడాలి.