Bhakti: సీఎం కేసీఆర్ ‘భక్తి’ రాజకీయం చేయబోతున్నారా?

Bhakti: రాజకీయ నాయకులకు, సినిమావాళ్లకు సెంటిమెంట్స్(నమ్మకాలు) ఎక్కువగా ఉంటాయనేది అందరికీ తెల్సిందే. ఆ సెంటిమెంట్ ను కాదని వారు ఎలాంటి పనులు చేయరు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వీటికేమీ మినహాయింపు కాదు. ఆయన దేవుళ్లను, జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఆయన లక్కీ నెంబర్ 6. ఆ సంఖ్య వచ్చే రోజుల్లోనే కేసీఆర్ ముఖ్యమైన పనులు చేస్తుంటారని ఆపార్టీలోనే వారే చెబుతుంటారు. KCRతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎం కేసీఆర్ తెలుగు […]

Written By: NARESH, Updated On : December 14, 2021 11:04 am
Follow us on

Bhakti: రాజకీయ నాయకులకు, సినిమావాళ్లకు సెంటిమెంట్స్(నమ్మకాలు) ఎక్కువగా ఉంటాయనేది అందరికీ తెల్సిందే. ఆ సెంటిమెంట్ ను కాదని వారు ఎలాంటి పనులు చేయరు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వీటికేమీ మినహాయింపు కాదు. ఆయన దేవుళ్లను, జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఆయన లక్కీ నెంబర్ 6. ఆ సంఖ్య వచ్చే రోజుల్లోనే కేసీఆర్ ముఖ్యమైన పనులు చేస్తుంటారని ఆపార్టీలోనే వారే చెబుతుంటారు.

KCR

KCRతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాతి కాలంలో దేశంలో ఎవరూ చేయని విధంగా ఆయుత చండీయాగం లాంటి కార్యక్రమాలను చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన మరోసారి పుణ్యక్షేత్రాలకు వెళుతున్నారు.

ఈసారి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మన పొరుగున ఉన్న తమిళనాడుకు వెళుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగంకు ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ కుటుం సభ్యులతో కలిసి వెళ్లి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈక్రమంలోనే రాత్రి చైన్నెలోనే బస చేయనున్నారు. కేసీఆర్ రాత్రి అక్కడ బస చేయడంపైనే పలువురు రాజకీయ నాయకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

గతంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను త్వరలోనే తాము తమిళనాడుకు వెళ్లి అక్కడి డీఎంకే పార్టీ నిర్మాణాన్ని పరిశీలించబోతున్నట్లు చెప్పారు. తనతో పాటు మంత్రులు కీలక నేతలు వస్తారని చెప్పారు. దీంతో అప్పట్లో టీఆర్ఎస్‌కు లేనంత పార్టీ నిర్మాణం డీఎంకేకు ఏముందనే విశ్లేషణలు వచ్చాయి. ఈ విషయాన్ని పలువురు నాయకులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.

ఈ విషయంపైనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందిస్తూ ఇదంతా సీఎం కేసీఆర్ పొలిటికల్ ప్లాన్ అని చెప్పుకొచ్చారు. డీఎంకేతో కలిసి కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్లాన్ చేస్తున్నారన్నారు. కేటీఆర్‌ను సీఎంను చేయడం ఇందులో భాగమని చెప్పుకొచ్చారు. ఇది ఉహాగానమో, అర్వింద్ జోస్యమో తెలియదుగానీ తాజాగా సీఎం కేసీఆర్ తమిళనాడు టూర్‌కు వెళుతున్నారు.

Also Read: కాశీలో మరణం కూడా మంచిదే.. ప్రధాని నోట సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాని అపాయింట్ కోసం ఎదురుచూడగా ఆయన అపాయిమ్మెంట్ దొరకలేదు. దీంతో ఆయన ఎవరినీ కలువకుండా వచ్చారు. అయితే కేసీఆర్ పలువురు నాయకులతో అంతర్గతంగా చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే కేసీఆర్ తమిళనాడుకు వెళుతారనే టాక్ విన్పిస్తోంది.

తమిళనాడులో డీఎంకేతో అంతర్గతంగా సీఎం కేసీఆర్ చర్చించనున్నారని ప్రచారం జరుగుతోంది. వీటి ఫలితాలు వచ్చిన తర్వాత అధికారికంగా పర్యటనలు చేయడం మంచిదని ఆయన భావిస్తున్నారని  టాక్. దీంతో ముందుగానే సీఎం కేసీఆర్ అన్ని సెట్ చేసి పెట్టుకుంటారని తెలుస్తోంది.  జాతీయ రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తి చూపుతున్న కేసీఆర్ ఈసారి సీరియస్ గానే వర్కౌట్ చేస్తున్నారనే గుసగుసలు విన్పిస్తున్నాయి.

Also Read: కాశీ నుంచి.. చీరకట్టుకొని పారిపోయిన బ్రిటీష్ గవర్నర్!!