కాంగ్రెస్ తరహా రాజకీయాలతో బీజేపీలో కన్నా `ఏకాకి’!

అధికార పక్షం వైసిపి పాలనపై చేస్తున్న విమర్శలకు గాని, అధికార పక్షానికి చెందిన విజయసాయిరెడ్డి వంటి నాయకులు చేస్తున్న తీవ్రమైన ఆరోపణల విషయంలో గాని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సొంత పార్టీలో దాదాపు ఏకాకిగా మిగిలి పోవడానికి ఆయన పార్టీలో చేరినప్పటి నుండి అనుసరిస్తున్న కాంగ్రెస్ తరహా రాజకీయాలే కారణంగా కనిపిస్తున్నది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో విమర్శల దాడులు జరుగుతున్నా కేంద్ర నాయకత్వం పట్టించుకొనక పోవడం, పైగా ప్రస్తుతం నెలకొన్న ఆరోగ్య అత్యవసర […]

Written By: Neelambaram, Updated On : April 23, 2020 12:10 pm
Follow us on


అధికార పక్షం వైసిపి పాలనపై చేస్తున్న విమర్శలకు గాని, అధికార పక్షానికి చెందిన విజయసాయిరెడ్డి వంటి నాయకులు చేస్తున్న తీవ్రమైన ఆరోపణల విషయంలో గాని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సొంత పార్టీలో దాదాపు ఏకాకిగా మిగిలి పోవడానికి ఆయన పార్టీలో చేరినప్పటి నుండి అనుసరిస్తున్న కాంగ్రెస్ తరహా రాజకీయాలే కారణంగా కనిపిస్తున్నది.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో విమర్శల దాడులు జరుగుతున్నా కేంద్ర నాయకత్వం పట్టించుకొనక పోవడం, పైగా ప్రస్తుతం నెలకొన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితులలో రాజకీయ వివాదాలపై దృష్టి సారింపవద్దని హితవు చెప్పడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

బీజేపీలో తనకు రాజకీయ భవిష్యత్ లేదని గ్రహించి, బేరమాడి వైసిపిలో చేరడానికి సిద్దమైన సమయంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నుండి ఫోన్ రాగానే ఆగిపోవడం, ఆ తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావడంతో ఆయన పట్ల పార్టీ వర్గాలలో ఒక విధమైన ఏహ్యభావంకు దారితీసింది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా సహితం పార్టీలో దీర్ఘకాలంగా నెలకొన్న పద్ధతులకు తొలిదకాలిచ్చి, కాంగ్రెస్ తరహాలో తన చుట్టూ కొందరు భజనపరుల బృందంను ఏర్పరచుకొని, వారి చెప్పుచేతలలో వ్యవహరిస్తూ వచ్చారు. బీజేపీలో ఎవ్వరు అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ, పార్టీ పెద్దలతో ఉండే కోర్ కమిటీలో చర్చించి, ఏ విషయంపై అయినా ఒక నిర్ణయానికి వచ్చే వరవడి నెలకొంది.

అయితే పలువురు కోరే కమిటీ సభ్యులను అసలు ఏ విషయంలో కూడా సంప్రదించకుండా పట్టించుకొనేవారు కాదు. ఈ విషయమై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు కూడా వ్రాసారు. నిర్ణయాలు తీసుకొకునే సమయంలో తమను ఎందుకు సంప్రదింపలేదని కూడా నిలదీశారు.

అవినీతి అంశాలలో ప్రశ్నించిన నేతలను పక్కన పెట్టి, భజనపరులకే పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పేవారు.

కాంగ్రెస్ నుండి వచ్చిన కొందరు, బీజేపీలో ఉన్న ఒకరిద్దరు అవకాశవాదులు ఆయన చుట్టూ ఒక బృందంగా చేరింది. వారంతా ఆయనకు `దళారుల’వలే వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

పార్టీలో పదవులకు, గత ఏడాది ఎన్నికల సమయంలో పార్ట్ సీట్లకు వీరే బేరాలు ఆడి నిర్ణయించేవారనే ప్రతీతి నెలకొంది. ఆ పేరుతో వీరు భారీగా డబ్బు వసూలు చేసిన్నట్లు పార్టీ అధిష్టానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి.

గుంటూరులో పోటీ చేసిన ఒక నటి తన వద్ద నుండి పార్టీ సీట్ కోసం రూ 15 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. అభ్యర్థులకు పార్టీ నుండి అందజేసిన నిధులలో వీరు కొంత మొత్తం కమీషన్ గా వసూలు చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా పార్టీ అధిష్టానం ఇటువంటి ఆరోపణలపై మౌనం వహిస్తూ వచ్చింది.

కీలకమైన అంశాలపై క్షేత్రస్థాయిలో ఏమాత్రం పట్టు లేని పురందేశ్వరి, సోము వీరాజు, జివిఎల్ నరసింహారావు వంటి వారినే సంప్రదిస్తూ ఉండేవారు. పార్టీ వ్యవహారాల విషయంలో తమను ఎప్పుడు సంప్రదించని కారణంగా ఇప్పుడు ఆయ్నపై ఆరోపణలు వస్తుంటే తాము మౌనంగా ఉంటూ ఉండవలసి వస్తున్నదని చలామంది బిజెపి సీనియర్ నేతలు అంగీకరిస్తున్నారు.

ప్రతి జిల్లాలో ఆ విధంగా ఒకరిద్దరు `దళారులు’ను ఏర్పాటు చేసుకొని, వారు చెప్పిన్నట్లే నడుచుకొనేవారని, పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని పట్టించుకొనేవారు కాదని విమర్శలు నెలకొన్నాయి.

కన్నాను బిజెపిలోకి తీసుకు రావడంలో, ఆయనను రాష్ట్ర అద్యక్షుడైనా చేయడంలో అండగా ఉంటూ వచ్చిన ఆర్ ఎస్ ఎస్ నాయకత్వం సహితం ఆయన వ్యవహరించిన తీరు చూసి అసంతృప్తితో ప్రస్తుతం దూరంగా ఉన్నట్లు తెలుస్తున్నది.