https://oktelugu.com/

Ap Employees vs Jagan: ఉద్యోగులతో వైరం.. జగన్ కు మంచికా? చెడుకా?

Ap Employees vs Jagan: ఏపీ సీఎం జగన్ ను బాగా దగ్గరి నుంచి చూసిన వారు ‘మొండివాడు’ అని అంటారు. తండ్రి వైఎస్ఆర్ చనిపోతే ఓదార్పు కోసం ఏకంగా అప్పటి దేశంలోనే బలమైన నాయకురాలు సోనియాగాంధీని ఎదురించి మరీ జైలుకు వెళ్లాడు జగన్. 16 నెలలు జైలు జీవితం గడిపినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఏకంగా రాష్ట్ర సీఎం అయ్యారు. ఇంకొకరు అయితే ఈ కష్టాలెందుకని రాజకీయాలను వదిలేసేవారే. కానీ అక్కడున్నది జగన్. అయితే జగన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 3, 2022 / 10:10 PM IST
    Follow us on

    Ap Employees vs Jagan: ఏపీ సీఎం జగన్ ను బాగా దగ్గరి నుంచి చూసిన వారు ‘మొండివాడు’ అని అంటారు. తండ్రి వైఎస్ఆర్ చనిపోతే ఓదార్పు కోసం ఏకంగా అప్పటి దేశంలోనే బలమైన నాయకురాలు సోనియాగాంధీని ఎదురించి మరీ జైలుకు వెళ్లాడు జగన్. 16 నెలలు జైలు జీవితం గడిపినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఏకంగా రాష్ట్ర సీఎం అయ్యారు. ఇంకొకరు అయితే ఈ కష్టాలెందుకని రాజకీయాలను వదిలేసేవారే. కానీ అక్కడున్నది జగన్. అయితే జగన్ పట్టుదలతో సీఎం అయ్యారు. ప్రస్తుతం మొండిxe పరిపాలిస్తున్నారు. ఈ పాలన రెండున్నరేళ్లలో ఎన్నో సమస్యలు. అన్నింటిని అంతే దూకుడుగా.. ధైర్యంగా మొండిగా ఢీ అంటే ఢీ అనేలా జగన్ ఎదుర్కొంటున్నాడు.

    Ap Employees vs Jagan

    తాజాగా ఏపీ ఉద్యోగుల సమ్మె విషయంలోనూ ‘తగ్గేదేలే’ అన్నట్టుగా జగన్ నిలబడ్డాడు. వేతన సవరణపై జిఓలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పిఆర్‌సి సాధన సమితి పిలుపునిచ్చిన ‘చలో విజయవాడ’ ర్యాలీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్దఎత్తున హాజరు కావడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తీవ్ర ఇబ్బందిని కలిగించే అంశం. పోలీసుల కఠిన ఆంక్షలు, ఉన్నతాధికారుల బెదిరింపులు ఉన్నప్పటికీ వేలాది మంది ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి విజయవాడలో గంటల తరబడి జనజీవనాన్ని స్తంభింపజేయడం ముఖ్యమంత్రి వ్యూహంలో తప్పేంటో చూపిస్తోంది.

    Also Read:  ఉద్యోగుల సమ్మెను లెక్కచేయని జగన్.. ఇంకా బెదిరింపు ధోరణే..

    జగన్ మోహన్ రెడ్డిలో పారదర్శకత లేకపోవడమే ఇలాంటి పరిస్థితికి ప్రధాన కారణం. నిస్సందేహంగా అతను ప్రజల నుండి భారీ మద్దతును పొందాడు, కానీ పరిపాలనను నడపడంలో జగన్ అన్నింటినీ తేలికగా తీసుకోవడం ముప్పుగా పరిగణించకమానదు.

    రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని, ఉద్యోగుల వేతనాల పెంపు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే స్థితిలో లేదన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. అయితే ఇదే విషయాన్ని ఉద్యోగులకు, ప్రజలకు వివరించడంలో ముఖ్యమంత్రి బాధ్యత వహించలేకపోయారు. ఏపీ గడ్డు ఆర్థిక స్థితిని ఉద్యోగులకు, ప్రజలకు ఒప్పించి మెప్పిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదన్నది విశ్లేషకుల భావన.. అలా చేయకుండా మొండిగా ముందుకువెళ్లడం జగన్ కే ఎసరు తెస్తుందని అంటున్నారు.

    ఏపీ పరిపాలనలో కీలకమైన ఉద్యోగుల విషయంలో జగన్ లైట్ తీసుకోవడం ఆయనే నష్టం అంటున్నారు. జగన్ ఈ కీలక బాధ్యతలను తన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ,ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మతో పాటు ఇద్దరు మంత్రులకు వదిలిపెట్టాడు. అదే సమయంలో వైసీపీ పార్టీ సోషల్ మీడియా విభాగం ఉద్యోగుల ఆందోళనను పేలవంగా చూపించడానికి ప్రయత్నించింది. వారిని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు చేసింది.

    ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి నేరుగా ఉద్యోగులు, ప్రజలకు వివరణ ఇచ్చి ఉంటే దాని ప్రభావం మరోలా ఉండేది. అయితే జగన్ తన తాడేపల్లి నివాసంలోనే ఉంటూ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోవడమే వైసీపీకి, జగన్ కు మైనస్ గా మారిందంటున్నారు.

    సినిమా టికెట్‌ రేట్ల విషయంలోనూ జగన్‌ అదే స్టాండ్‌ని కొనసాగించారు. నెలల తరబడి సమస్యను లాగడానికి సిద్ధమయ్యారు. ఇది ప్రభుత్వానికి -తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య ఒక రకమైన గందరగోళ వాతావరణానికి దారితీసింది.

    మూడు రాజధానుల విషయంలోనూ జగన్ నిర్ణయం తీసుకునే ముందు సరైన హోంవర్క్ చేయడంలో విఫలమయ్యారు. మూడు రాజధానుల అంశంపై ఆయన తన మంత్రివర్గ సహచరులెవరితోనూ సీరియస్‌గా చర్చించలేదని, హఠాత్తుగా ప్రకటించారనే అపవాదు ఉంది.

    మూడు రాజధానుల అంశాన్ని బహిరంగ చర్చకు విసిరి, సాధకబాధకాలను బేరీజు వేసుకుని, న్యాయపరమైన చిక్కులను విశ్లేషించి, నిర్ణయానికి రాకముందే ప్రజల నుంచి సమ్మతిని తీసుకుని ఉండాల్సిందని విశ్లేషకులు అంటున్నారు. ఎలాంటి పారదర్శకత లేకుండా ఆయన ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం సమస్యలకు దారితీసింది. ఇది రాష్ట్ర హైకోర్టులో కొట్టి వేయబడి వీగిపోవాల్సి వచ్చింది.

    “జగన్ ఏదైనా ముఖ్యమైన అంశంపై చర్చలను ఓపెన్‌గా.. మరింత పాజిటివ్ గా ప్రజల ముందుకు తీసుకురావడం నేర్చుకోవాలి. అతను వీలైనంత తరచుగా మీడియాకు అందుబాటులో ఉండాలి, తద్వారా అతని విశ్వసనీయత ఏంతో ప్రజలకు తెలుస్తుంది. ఇలా రాకుండా మౌనంగా ఉండడం.. మంత్రులను ఇతరులను ఎగదోయడం ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. ఇది ఏకపక్ష ఆలోచనగా ఉన్నట్టు కనిపిస్తోంది. అదే జగన్ కు, వైసీపీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

    Also Read:  సిరిసిల్ల‌లో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ భాగోతం