Jagan vs Raghurama: ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ దాదాపు మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పవరకైతే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత తెచ్చుకోని జగన్ పార్టీ వ్యవహారాల్లో కొందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణం రాజు లాంటి వాళ్లు పార్టీలో ఉండి మరీ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. మిగతా అందరినీ జగన్ తన కంట్రోల్ లో పెట్టుకుంటున్నా.. ఈ ఎంపీని మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. అంతేకాకుండా రఘురామను కవ్వించినప్పుడల్లా ఆయన మరింత రెచ్చిపోయి.. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయనను కంట్రోల్ చేయడంలో జగన్ విఫలమయ్యాడనే చర్చ సాగుతోంది.
2019లో ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. ఓటర్లను తనవైపు తిప్పుకోగలిగారు. ఇప్పటి వరకు ఏ ఎన్నికలు జరిగినా వైసీపీదే విజయం అన్నట్లుగా సాగింది. అంతేకాకుండా ఉప ఎన్నికల్లో ఊహించని భారీ మెజారిటీ తీసుకొస్తూ ప్రతిపక్షాలకు కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో బద్వేల్ లాంటి ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పోటీ నుంచి కూడా తప్పుకున్నాయి.
అయితే పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణం రాజు జగన్ కు కంట్లో నలుసుగా మారారు. గతంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారని ఆయనను సీఐడీ ద్వారా విచారణ చేయించారు.అయితే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, తన కాళ్లు చూపిస్తూ మీడియాలో హైలెట్ అయ్యారు. ఆయనకు టీడీపీ పరోక్షంగా మద్దతు ప్రకటించిందని వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత కొన్ని పరిణామాల మధ్య రఘురామ ఢిల్లీ వెళ్లారు. అక్కడినుంచే కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు, డిబేట్లలో పాల్గొంటున్నారు. ఆయన మీడియాలో కనిపించిన ప్రతీసారి వైసీపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. ముందు ముందు కూడా ఆ అవకాశం రాకపోవచ్చు అని అంటున్నారు. అయితే రఘురామను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పోలా..? అని కొందరు సూచనలను ఇస్తున్నట్లు సమాచారం. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇతర పార్టీలోకి వెళ్లి విమర్శలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే ఈ పని ఎప్పుడో చేయాల్సి ఉండగా.. ఇంతకాలం జగన్ ఎందుకు ఊరుకున్నారో అర్థం కావడం లేదని కొందరు చర్చించుకుంటున్నారు.
కానీ ఎంపీ రఘురామను మాత్రం ఎంత కవ్విస్తే అంత రెచ్చిపోతున్నారు. సొంత పార్టీపైనే తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. అయితే రఘురామపై ఎవరూ కామెంట్స్ చేయలేకపోతున్నారు. అయితే జగన్ రంగంలోకి దిగి ఆయన విషయంలో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోకుంటే పార్టీకి ముందు ముందు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని మిగతా నాయకులు అంటున్నారు. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. లేదంటే ఆయనను సస్పెండ్ చేయడానికి ఓ కారణం వెతికి దానిని సాకుగా చూపాలనుకుంటున్నారని తెలుస్తోంది.
Also Read: ఏపీలో గుట్కా, జర్ధా రాయుళ్లకు షాకిచ్చిన జగన్ సర్కార్
మరోవైపు రఘురామ మాత్రం తనను సస్పెండ్ చేసిన పర్వాలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. పరోక్షంగా ఆయనకు బీజేపీ సపోర్టు ఉందనే వార్తలు ఉండడంతో ఆయన వ్యవహార శైలిపై స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండకపోవచ్చంటున్నారు. మొత్తంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. అయితే రఘురామకు బయటి నుంచి కొందరి ప్రముఖుల మద్దతు ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు ఆయన విషయంలో జగన్ నడుచుకున్న తీరు కరెక్టు కాదని అన్నారు. ఆయనన పట్టించుకోక వదిలేస్తే బెటరన్నట్లు మాట్లాడారు.మరి సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..