Ali Posani: సినీ పరిశ్రమ నుంచి తమకు మద్దతు తెలిపిన కొందరికి ఏపీ సీఎం జగన్ పదవులు కేటాయించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా సినీ పరిశ్రమకు చెందిన వారికి ప్రాధాన్యం దక్కడం లేదనే అపవాదు జగన్ పై ఉంది. ఆ విమర్శలకు చెక్ పెట్టే దిశగా జగన్ మరి కొద్ది రోజుల్లో ప్రకటన చేయబోతున్నట్టు తెలిసింది. తనను నమ్ముకొని మెగా క్యాంప్ నుంచి బయటకు వచ్చిన పోసాని, అలీకి జగన్ న్యాయం చేస్తాడా, అన్యాయం చేస్తాడో మరి కొద్ది రోజుల్లో తేలనుంది.
ఏపీ అధికార పార్టీ వైసీపీకి ముందు నుంచీ తెలుగు సినీ పరిశ్రమ అంటీముట్టనట్లుగానే ఉంటోంది. గత ఎన్నికలకు ముందు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో తన కంటూ స్థానం సంపాదించుకున్న క్యారెక్టర్ అర్టిస్ట్, కమెడియన్ పృథ్వీరాజ్ వైసీపీలో చేరాడు. మిగతా చిన్న చిన్న ఆర్టిస్టులు చేరినా వైసీపీ కి ఉపయోగపడింది ఏమీలేదు. కానీ అదే ఎన్నికల ముందు పోసాని కృష్ణమురళి వైసీపీలో చేరాడు. అలాగే టాలీవుడ్ టాప్ స్టార్, జనసేన అధినేతకు అత్యంత సన్నిహితుడైన కమెడియన్ అలీ కూడా వైసీపీలో చేరాడు. వారిద్దరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తమ వంతుగా ప్రచారం చేశారు. తమకు పదవుల మీద ఆశలు లేవని చెప్పుకొచ్చారు. తదనంతర వైసీపీ అధికారంలోకి రావడంతో ముందుగా నటుడు పృథ్వీరాజ్ కు ఎస్వీబీసీ చానెల్ లో పదవి ఇచ్చారు. అనంతరం సినీ పరిశ్రమ నుంచి మరెవ్వరికీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు.
Also Read: ట్రోలర్స్ కి మళ్ళీ దొరికిపోయిన మంచువారబ్బాయి… సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్స్
కొద్ది రోజుల తర్వాత పృథ్వీరాజ్ చానెల్ లో పనిచేసే ఓ మహిళ తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు రావడంతో ఆయన ఆ పదవి నుంచి తప్పించారు. మళ్లీ ఇటీవల సినిమా ప్రముఖులు ఏపీ సీఎం జగన్ తో పలు అంశాలపై భేటి అనంతరం పదవుల వ్యవహారం చర్చకు వచ్చింది. పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన అలీతో పాటు పలు సందర్భాల్లో తన ప్రెస్ మీట్లతో వైసీపీకి మద్దతుగా విరుచుకుపడుతున్న పోసానికి కీలక పదవులు వస్తాయని అందరూ ఊహించారు. కానీ కేవలం నామినేటెడ్ పదవులతో సరిపెట్టే ఆలోచనలో ఏపీ సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తున్నది.
Also Read: రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలను చుట్టుముట్టిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
సినీ పరిశ్రమలో మెగా క్యాంప్ నుంచి బయటికి వచ్చి మద్దతిస్తే చివరికీ వారికి నిరాశే ఎదురవుతోందని టాలీవుడ్ లో చర్చ సాగుతున్నది. పవన్ కల్యాన్ కెరీర్ ప్రారంభంలో రెండు మూడు సినిమాలు మినహా 2019 వరకు ప్రతి సినిమాలో అలీ కి ప్రత్యేక పాత్ర ఉండేది. సినీ ఇవెంట్లలో పవన్ కల్యాణ్ పై పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు కూడా ఒక చిన్న జోక్ కూడా వేయడానికి కూడా సాహసించే వారు కాదు. అలాంటి పవన్ కల్యాణ్ పై వేదికలపై సెటైర్లు వేసేంత చనువు కేవలం అలీ కి మాత్రమే ఉంది.
అత్యంత సన్నిహితుడైన అలీకి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత టికెట్ ఇవ్వక పోవడంతో అలీ.. పవన్ కల్యాణ్ నుంచి దూరమయ్యాడు. పవన్ కల్యాన్ మళ్లీ సినిమాలు చేస్తున్నా ఏ ఒక్క చిత్రంలో కూడా కనిపించలేదు. అలాంటి అలీకి జగన్ కీలక పదవి ఇస్తారనే చర్చలు సాగాయి. కెరీర్ పరంగా సినిమాలు కూడా తగ్గించుకుంటున్న అలీ ఓ తెలుగు చానెల్ లో ఒక షో మాత్రమే చేస్తున్నాడు. మునుపటిలా సినిమాలు చేయడం లేదు. రాజకీయంగా తనకంటూ ఓ పదవి ఉంటే పొలిటికల్ గా కెరీర్ ను మలుచుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ లోని పలువురు భావించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా అలీకి ప్రాధాన్యం దక్కడం లేదు. ప్రముఖ నటి శ్రీ రెడ్డి ఎపిసోడ్ నుంచి ఆమెకు మద్దతుగా నిలుస్తున్న పోసాని పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కల్యాణ్ పై నేరుగా బూతు పురాణం అందుకున్నాడు. మెగా క్యాంప్ నుంచి బయటికి వచ్చినా ఈ ఇద్దరికీ వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చర్చ మొదలైంది. మెగా ఫ్యామిలీతో దాదాపు 30 ఏళ్ల అనుబంధం ఉన్న ఈ ఇద్దరూ జగన్ పంచన చేరినా అన్యాయమే జరుగుతున్నదనే చర్చలు నడుస్తున్నాయి.
Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?
సినిమాలు, షోల పరంగా అలీ వెనుకబడిపోగా, నటుడిగా, రచయితగా పోసానీ అంతే వెనకుండిపోయాడు. 2019 ఎన్నికల ముందు వరకు పోసానికి రచయితగా, నటుడిగా బిజీ బిజీగా ఉన్నారు. నటుడిగా ఒప్పుకున్న ప్రాజెక్టుల కారణంగా సినిమాలు రాయలేకపోతున్నానని పలు సందర్భాల్లో పోసాని చెప్పారు. జగన్ కు దగ్గరవడంతో తాము సినిమాల పరంగా, పొలిటికల్ గా ఏ దిక్కూ లేకుండా పోతున్నామనే భావన వారిలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. అటు సినిమాల్లో.. ఇటు రాజకీయంగా ప్రాధాన్యత లేక వీరిద్దరూ రెంటికి చెడ్డ రేవడిలా మారిపోతున్నారనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోందట..
-శెనార్తి