Dalit Bandhu Scheme: టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఏమైంది? దాని ఊసే కనిపించడం లేదు. దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకం తెస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రగల్బాలు పలికినా చివరికి అది ఆచరణలో మాత్రం విఫలమైంది. ఎన్నికల తరువాత కూడా దళితబంధు పథకం అమలు చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నా ప్రస్తుతం దాని ఉనికి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దళితబంధు ప్రస్థానం ఆగిపోయిందని తెలుస్తోంది.

దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. దళితుల కోసం ఉధ్దేశించి పథకం అందరికి వర్తింపచేస్తామని చెప్పినా కనీసం వారికి కూడా అందడం లేదు. దీంతో టీఆర్ఎస్ పై వ్యతిరేకత వస్తోంది. ఇన్నాళ్లు కేసీఆర్ అన్నింట్లో కూడా ఇలాగే మోసం చేసి ఓట్లు వేయించుకున్నా తరువాత వాటి గురించి మరిచిపోయారు. ఇప్పుడు కూడా అదే తీరుగా దళిత బంధు విషయంలో నమ్మకద్రోహం చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: వచ్చేసారి గెలుపు కోసం కేసీఆర్ కఠిన నిర్ణయం.. ?
దళితబంధు పథకం రాష్ర్టమంతా ప్రవేశపెడతామని చెప్పినా కనీసం హుజురాబాద్ లో కూడా విస్తరించలేదు. నియోజవర్గంలో అందరికి వర్తింప చేయలేదు. దీంతో టీఆర్ఎస్ పై ద్వేషం పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవేమోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఇంకా ఎన్నేళ్లు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటారో అని అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం తరువాత పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో రెండు వేల కోట్ల నిధులు కేటాయించినా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పథకం నిలిచిపోయింది. ఇప్పుడైతే దాని ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల తరువాత కూడా దళితబంధు కొనసాగిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.
Also Read: విజయగర్జన సభ విరమించుకోవడంలో కారణాలేంటి?