Homeఎంటర్టైన్మెంట్Megastar Chiru: గడికోట సంస్థానానికి మెగా ఫ్యామిలీ.. భారీ బందోబస్తు ఏర్పాటు

Megastar Chiru: గడికోట సంస్థానానికి మెగా ఫ్యామిలీ.. భారీ బందోబస్తు ఏర్పాటు

Megastar Chiru: గడికోట సంస్థానాధీశులు కామినేని అనిల్​ కుమార్​, శోభన్ రెండో కుమార్తె అనుష్పాల వివాహం జరగనుంది. ఈ సందర్భంగా దోమకొండలో పోచమ్మ పండగ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్​ చిరంజీవి ఫ్యామిలీ హాజరుకానుంది. ఈ క్రమంలోనే చిరుతో సహా రామ్​చరణ్​, ఉపాసన ఇతర కుటుంబ సభ్యులు గడికోటకు ఈరోజు బయలుదేరనున్నారు. రామ్​చరణ్​ భార్య ఉపాసన చెల్లెలు అనుష్పాల. ఆమె వివాహం సదర్భంగా పోచమ్మ పండుగకు.. చిరు ఫ్యామిలితో పాటు కామినేని కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. దీంతో గడికోట వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

megastar-chiranjeevi-family-and-kamineni-anil-family-visit-gadikota-kamareddy

మరోవైపు అనుష్పాల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రెండ్రోజుల క్రితం ఈ కొత్త జంటను ఆశీర్వదించేందుకు హిజ్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. తను ప్రేమించిన వ్యక్తితోనే అనుష్పాల ఈ వివాహం చేసుకుంటోంది.  చెన్నైకి చెందిన కార్​ రేసర్​ అర్మాన్ ఇబ్రహిమ్​ను పెళ్లాడనుంది.

రేసర్ అర్మన్, అనుష్పాల గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. మాజీ ఇండియన్ ఎఫ్​3 ఛాంపియన్ అక్బర్​ ఇబ్రహిమ్​ తనయుడే అర్మన్ ఇబ్రహిమ్​. ఈ క్రమంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా కార్ రేస్​లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరోవైపు ఆచార్య సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్న మెగాస్టార్​.. ఈ సినిమా తర్వాత వరుసగా మరో రెండు, మూడు ప్రాజెక్టులను సిద్ధం చేసుకున్నారు. రామ్ చరణ్​ కూడా ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్ ముగించుకుని.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెకక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్​ పర్తి చేసుకుని.. రెండో షెడ్యూల్​లోకి అడుగుపెట్టింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular