https://oktelugu.com/

Huzurabad bypoll: హుజురాబాద్ అంటేనే కేసీఆర్ భయపడుతున్నారా?

Huzurabad bypoll: అందరిలో హుజురాబాద్ (Huzurabad) భయం పట్టుకుంది. ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో అన్ని పార్టీలు తమ శక్తియుక్తులను పణంగా పెడుతున్నాయి. హుజురాబాద్ దెబ్బకు సీఎం కేసీఆర్ (CM KCR) సైతం తన పంథా మార్చుకుని సహజసిద్దానికి వ్యతిరేకంగా జనాల్లో కలిసిపోతున్నారు. ఇన్నాళ్లు ప్రజల్లోకి రాని కేసీఆర్ తన పద్దతి మార్చుకుని జనం వెంట పడుతున్నారు. దళిత బంధు (Dalita Bandhu) పథకం ప్రారంభించి వారిలో ఆత్మస్థైర్యం నింపడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నామని చెబుతున్నారు. దీంతో […]

Written By: , Updated On : August 27, 2021 / 05:41 PM IST
Follow us on

CM KCRHuzurabad bypoll: అందరిలో హుజురాబాద్ (Huzurabad) భయం పట్టుకుంది. ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో అన్ని పార్టీలు తమ శక్తియుక్తులను పణంగా పెడుతున్నాయి. హుజురాబాద్ దెబ్బకు సీఎం కేసీఆర్ (CM KCR) సైతం తన పంథా మార్చుకుని సహజసిద్దానికి వ్యతిరేకంగా జనాల్లో కలిసిపోతున్నారు. ఇన్నాళ్లు ప్రజల్లోకి రాని కేసీఆర్ తన పద్దతి మార్చుకుని జనం వెంట పడుతున్నారు. దళిత బంధు (Dalita Bandhu) పథకం ప్రారంభించి వారిలో ఆత్మస్థైర్యం నింపడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నామని చెబుతున్నారు. దీంతో ఉన్నతాధికారులకు సైతం అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ ప్రస్తుతం ప్రజలకు చేరువ కావాలని ప్రయత్నిస్తుండడం చూస్తుంటే అందరిలో వణుకు పుడుతున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడు ఫామ్ హౌస్ దాటి బయటకు రాని కేసీఆర్ హుజురాబాద్ లో ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో జనజీవన స్రవంతికి దగ్గరవుతున్నారనే ప్రచారం సాగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమి పాలయితే పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుందనే బెంగతోనే కేసీఆర్ విజయమంత్రం జపిస్తున్నారని తెలుస్తోంది. నెలల తరబడి ఫామ్ హౌస్ దాటి బయటకు రాని నేత ప్రస్తుతం ఇలా చేయడంతో అందరు ఆశ్చర్యపడుతున్నారు. వాసాలమర్రి, హుజురాబాద్ లో సభలు నిర్వహిస్తూ వారిలో మార్పు తేవాలని సూచిస్తున్నారు. అధికార పార్టీకి ఓటు వేసి విజయం దక్కించాలని వేడుకుంటున్నారు.

హుజురాబాద్ లో దళిత బంధు పథకం ప్రారంభోత్సం చేశారు. గురువారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. స్కీంలో భాగంగా వారికి ఇస్టమైన వాహనాలు వారు కొనుగోలు చేసుకోవడంతో మంత్రులు వారికి తాళాలు అందజేసి మాట్లాడారు. దళితబంధు పథకం రాష్ర్టవ్యాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పథకం కోసం రూ.2 వేల కోట్లు కేటాయించారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. తన సహజ శైలికి విరుద్దంగా బహిరంగ సభల్లో పాల్గొంటూ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. హుజురాబాద్ దెబ్బకు నేతల మైండ్ బ్లాక్ అవుతున్నట్లు సమాచారం. అందుకే దళితబంధు పథకంతో ప్రజలను తమ వైపు తప్పుకోవాలని ప్రయత్నిస్తోన్నారు. ఇప్పటికే నిధులు కేటాయించి రాష్ర్ట వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పడంతో అందరిలో ఉత్కంఠ కనిపిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉప ఎన్నికపై ఇంకా తేదీ ప్రకటించలేదు. దీంతో ఎన్నికల సంఘం ఎప్పుడు తేదీ ప్రకటిస్తుందోనని నేతల్లో ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. ఎలాగైనా విజయం దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే పలు పార్టీల నేతలను టీఆర్ఎస్ లోకి లాక్కునేందుకు పావులు కదుపుతున్నారు. వ్యూహాలు మార్చుకుంటున్నారు.