https://oktelugu.com/

 NTR Vennupotu Balakrishna: ఎన్టీఆర్ కు వెన్నుపోటు: బాలయ్య కన్నీళ్లకు అర్థం ఉందా?

NTR Vennupotu Balakrishna: తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎవరు అంటూ ‘నందమూరి తారకరామరావు’ అని తెలుగునేల ఏమూలకు వెళ్లినా చెబుతారు. అలాంటి టీడీపీ నేడు నందమూరి ఫ్యామిలీ చేతుల్లో లేదు. ‘నారా’ వారి కబంధ హస్తాల్లో చిక్కింది. నందమూరి వారసులు నవ తొమ్ముదులు ఉన్నా కూడా పార్టీని చంద్రబాబు నుంచి చేజిక్కించుకోలేపోయారు. తెలుగు రాజకీయాల్లో సొంత పిల్లనిచ్చిన మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచేశారని ఆయన ప్రత్యర్థులు ఇప్పటికీ సూటిపోటి మాటలతో విమర్శిస్తుంటారు. అయితే అందరికీ అది ‘వెన్నుపోటు’లానే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2021 / 07:40 PM IST
    Follow us on

    NTR Vennupotu Balakrishna: తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎవరు అంటూ ‘నందమూరి తారకరామరావు’ అని తెలుగునేల ఏమూలకు వెళ్లినా చెబుతారు. అలాంటి టీడీపీ నేడు నందమూరి ఫ్యామిలీ చేతుల్లో లేదు. ‘నారా’ వారి కబంధ హస్తాల్లో చిక్కింది. నందమూరి వారసులు నవ తొమ్ముదులు ఉన్నా కూడా పార్టీని చంద్రబాబు నుంచి చేజిక్కించుకోలేపోయారు. తెలుగు రాజకీయాల్లో సొంత పిల్లనిచ్చిన మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచేశారని ఆయన ప్రత్యర్థులు ఇప్పటికీ సూటిపోటి మాటలతో విమర్శిస్తుంటారు. అయితే అందరికీ అది ‘వెన్నుపోటు’లానే కనిపించింది. కానీ నాన్న ఎన్టీఆర్ ను గద్దెదించి చంద్రబాబు చేతుల్లో పెట్టడంలో నాడు పాలుపంచుకున్న ఆయన కుమారుడు, నేటి అగ్రహీరో నందమూరి బాలయ్యకు మాత్రం ఇందులో కొత్త కోణం కనిపించింది. కన్నీళ్లు పర్యంతం అవుతూ దాన్ని తాజాగా బయటపెట్టి సంచలనం సృష్టించారు.

    Balakrishna-shocking-comments-sr-ntr-chandrababu-intresting-facts

    ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న హీరో కం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ అనే షో రక్తికడుతోంది. ఇప్పటివరకూ బాలయ్య ముగ్గురు సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేశాడు. నాలుగోది వచ్చే ఆదివారం డిసెంబర్ 12న ప్రసారం చేయడానికి షెడ్యూల్ చేయబడింది. తన తాజా చిత్రం ‘అఖండ’ దర్శకుడు బోయపాటి శీను, మరో హీరో శ్రీకాంత్ తో కలిసి బాలయ్య చిట్ చాట్ చేశాడు.

    తాజాగా ఈ షోకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య ఎప్పుడూ బయటపెట్టని రహస్యాలను పంచుకోవడంతో వైరల్ అయ్యింది. తన కుటుంబం, అత్తమామ, బావ చంద్రబాబునాయుడుపై, తన తండ్రి ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన ‘వెన్నుపోటు’ ఆరోపణలను ప్రస్తావిస్తూ బాలయ్య భావోద్వేగానికి గురికావడం సంచలనమైంది. 26 ఏళ్ల తర్వాత తమపై వెన్నుపోటు పొడిచారని బాలయ్య ఎమోషనల్ అయ్యారు.

    ‘ఎన్టీఆర్ పిల్లల్లో నేనూ ఒకరిని. అంతకంటే మించి ఎన్టీఆర్ అభిమానుల్లో అంత్యంత ముఖ్యుడిని.. అంటూ’ బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా తొలుస్తున్న ‘ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు’ ఎపిసోడ్ పై బాలయ్య సంచలన విషయాలను పంచుకున్నట్టు ఈ ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఆ ప్రోమో అక్కడికే కట్ చేయడంతో బాలయ్య ఏం చెప్పాడు.? 26 ఏళ్ల తర్వాత ఈ రహస్యం బయటపడుతుందా? అన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది. బాలయ్య కన్నీళ్లు చూస్తుంటే ఏదో బాంబు పేల్చినట్టే తెలుస్తోంది.

    1995 ఆగస్టులో చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబం అంతా కలిసి టీడీపీలో తిరుగుబాటు చేసి హైదరాబాద్ లోని వైస్రాయ్ హోటల్ లో నాటి టీడీపీ ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహించడం తెలుగు రాజకీయాల్లోనే ఒక చీకటి ఘట్టం. ఇది రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఆ విధంగా నాడు సీఎం అయిన ఎన్టీఆర్ ను అధికారంలోంచి కూలదోసి పార్టీని, ప్రభుత్వాన్ని తన హస్తగతం చేసుకున్నాడు చంద్రబాబు. పార్టీ నిధులు, కార్యాలయాన్ని కూడా ఎన్టీఆర్ నుంచి లాగేసుకున్నాడు. ఎన్నికల గుర్తు ‘సైకిల్’ను కూడా చంద్రబాబే తీసుకోవడం సంచలనమైంది.

    తనను తన అల్లుడు చంద్రబాబే నమ్మించి వెన్నుపోటు పొడిచాడని నాడు ఎన్టీఆర్ విపరీతంగా స్పందించి మీడియా ముందు ఏడ్చాడు కూడా.. తన పిల్లలు, అల్లుడు తనకు ద్రోహం చేశారంటూ ఆ రోజుల్లో పలు వీడియో క్లిప్ లను విడుదల చేశాడు. చంద్రబాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి ‘తనను అల్లుడు ‘వెన్నుపోటు’ పొడిచాడని.. తన పిల్లలు ‘ద్రోహం’ చేశారని ఎన్టీఆర్ ఆవేదన పడ్డ వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి.

    అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ ఈ ‘వెన్నుపోటు’ను గుర్తుంచుకున్నారు.రాజకీయ ప్రత్యర్థులంతా చంద్రబాబును ‘వెన్నుపోటుదారుడు’ అని ఇప్పటికీ ఆడిపోసుకుంటారు.

    ఈ ‘వెన్నుపోటు’ జరిగి రెండు దశాబ్ధాలు గడుస్తున్నా దానికి కొత్త అర్థం చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇది చారిత్రక అవసరం కోసం చేశామని చంద్రబాబు నాయుడు కవర్ చేస్తున్నారు. 1995 ఆగస్టు నాటి తిరుగుబాటును చైనా కమ్యూనిస్టు పార్టీలో తిరుగుబాటుతో సమానం చేసే స్థాయికి వెళ్లిందని.. అది వెన్నుపోటు కాదని బాలయ్య చెబుతున్నారు.

    అయితే స్వయంగా తనకు జరిగిన తిరుగుబాటును దివంగత ఎన్టీఆరే ‘వెన్నుపోటు’ అని స్పష్టంగా పేర్కొన్నాడు. వీడియోల్లో ఆవేదన చెందాడు. మిగిలిన వారు ఆధారాలతోనే వెన్నుపోటు అంటున్నారు. ఇప్పుడు బాలయ్య మాత్రం అది ‘వెన్నుపోటు’ కాదని అనడం కరెక్ట్ కాదనడంలో సందేహం లేదు. వెన్నుపోటుకు వక్రభాష్యాలు చెప్పడం బాలయ్య మానుకోవాలంటున్నారు.

    బాలయ్య తన అబద్దాలను ప్రజలు నమ్మాలనుకుంటే ముందుగా ఆ వెన్నుపోటుపై తన తండ్రి మాట్లాడిన వీడియో క్లిప్పింగులను ముందుగా చూసి మాట్లాడాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుతున్నారు. బావ చంద్రబాబును వెనకేసుకురావడం కరెక్టో కాదో ముందు ఆత్మవిశ్లేషణ చేసుకోవాంటున్నారు.

    వెన్నుపోటుపై బాలయ్య మాట్లాడిన వీడియో