https://oktelugu.com/

Facebook Encription: ఫేస్ బుక్ లో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ప్రమాదకరమా..? ఎందుకు వద్దంటున్నారు.?

Facebook Encription: ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్.. ఈ పదం గురించి వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య గోప్యత ఉంచడానికి ఆ కంపెనీ వినియోగదారుల భద్రత నిమిత్తం దీనిని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఇంటర్నెట్ హ్యాకర్లు, నేరగాళ్ల బారిన పడకుండా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. అంటే ఒకరి సమాచారం ఇంకొకరికి చేరవేసిన సమయంలో సంబంధిత వ్యక్తులు తప్ప ఇతరులు చదవలేరంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినా వాట్సాప్ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 23, 2022 / 08:56 AM IST
    Follow us on

    Facebook Encription: ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్.. ఈ పదం గురించి వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య గోప్యత ఉంచడానికి ఆ కంపెనీ వినియోగదారుల భద్రత నిమిత్తం దీనిని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఇంటర్నెట్ హ్యాకర్లు, నేరగాళ్ల బారిన పడకుండా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. అంటే ఒకరి సమాచారం ఇంకొకరికి చేరవేసిన సమయంలో సంబంధిత వ్యక్తులు తప్ప ఇతరులు చదవలేరంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినా వాట్సాప్ లో దీనిని ప్రవేశపెట్టారు.

    తాజాగా ఫేస్ బుక్ మెసేంజర్లో కూడా దీనిని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. కానీ బ్రిటన్ ప్రభుత్వం మాత్రం దీనిని వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు బ్రిటన్ కు చెందిన ఓ సేవా సంస్థ ఫేస్ బుక్ పై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇంతకీ ఎండ్ టు ఎండ్ ఎనక్రిప్షన్ అంటే ఏమిటి..? దానిని బ్రిటన్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది…?

    నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ వినియోగంతో సంబంధం పెట్టుకుంటున్నారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఆన్లైన్లో ఇచ్చే సమాచారం మూడో వ్యక్తికి తెలియొద్దని జాగ్రత్తపడుతాడు. అయితే ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఈ పనిచేస్తోందని ఇదివరకే వాట్సాప్ విషయంలో తేలింది. ఒక వెబ్ సైట్ కు లేదా యాప్ కు మన డివైజ్ కు మధ్య ఒక సీక్రెట్ కోడ్ ను ఇది తయారు చేస్తోంది. ఆ వెబ్ సర్వీస్ కు ఇంటర్నెట్ ద్వారా మనం పంపించే సమాచారం ఏదైనా మనం దానిని పంపించే ముందు ఎన్ క్రిప్ట్ అవుతుంది. ఆ సమాచారం మనం సంప్రదిస్తున్న కంపెనీకి చేరుకున్న తరువాత మనం ఖరారు చేసుకున్న రహస్య కోడ్ ను సరిచూసుకొని అప్పుడది ఎదుటివాళ్లకు కనిపిస్తుంది.

    ప్రతీ సమాచారం ఇలా గోప్యత ఉంటుంది కాబట్టి ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ను చాలా మంది ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ సమాచారం డేటా సంస్థలకు తెలుస్తుంది. దీంతో ఏదైనా కంపెనీ దగ్గర స్టోరై ఉండే సమాచారాన్ని పోలీసులు, భద్రతా సంస్థలు అప్పుడప్పుడు అడుగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోలీసులు తమ విచారణలో దీనిని ఆధారంగా చేసుకొని విచారణ జరుపుతున్నారు.

    బ్రిటన్ ప్రభుత్వం ఫేస్ బుక్ మెసేంజర్లో ఎండ్ టు ఎండ్ ఎనక్రిప్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ విధానం వల్ల చిన్నారులకు ప్రమాదం పొంచి ఉందని వాదిస్తోంది. ఆన్లైన్లో చిన్నారులపై వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో దీనిని అమలు చేస్తే వాటిని అగంతకులు ఇంకా రెచ్చిపోతారని అంటున్నారు. ఎండ్ టు ఎండ్ ఎనక్రిప్షన్ విధానంతో మెసేజ్ పంపించడంతో ఇతరులు దానిని చదవలేరు. సెండర్, రిసీవర్ మాత్రమే చదువగలుగుతారు. దీంతో చిన్నారులపై లైంగిగ దాడులు విషయాన్ని తెలుసోకోలేమని, దీనివల్ల చాలా నష్టపోతారని అంటున్నారు. అమెరికా నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్ ప్రకారం సోషల్ మీడియాలో చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించిన మార్పిడిపై 2020 సంవత్సరంలో 2.17 కోట్ల ఫిర్యాదులు అందాయి. ఇప్పుడు ఈ 2ఈ వ్యవస్థ ప్రవేశపెడితే ఈ ఫిర్యాదులు కూడా అందే అవకాశం లేదని అంటోంది.

    ఈ2ఈ వ్యతిరేక ఉద్యమంతో ఫేస్ బుక్ దిగి వచ్చింది. మెసెంజర్, ఇన్ స్ట్రాగ్రామ్లో ఈ వ్యవస్థను వాయిదా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను అనుసంధానించే సంస్థగా, ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయి టెక్నాలజీని రూపొందించడానికి, ప్రజల భద్రత కల్పించడానికి మేం కట్టుబడి ఉన్నామని మెటా సంస్థ ఆంటిగోన్ డేవిస్ గత నవంబర్లో తెలిపారు.