https://oktelugu.com/

Chandrababu Crying: ఈసారి చంద్రబాబు ‘సింపతి’ వర్కౌట్ అవుతుందా..?

Chandrababu Crying:  ఏపీ అసెంబ్లీ పరిణామాలు.. చంద్రబాబు ఏడుపుపై మీడియాలో రోజుకో కథనం వెలువడుతోంది. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టుకోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఆయన అనుయాయులు బాబు కన్నీళ్ల పెట్టుకోవడానికి కారణమైన వారిపై ఆక్రోశం వెల్లగక్కుతుండగా.. వ్యతిరేకులు మాత్రం ఇదంతా రాజకీయ కోణంలో భాగమేనని విమర్శిస్తున్నారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన వ్యవహరంపై అదేరోజు సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకమైన పోస్టులు చాలానే పెట్టి సందడి చేశారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం ‘ఇదంతా మొసలి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2021 / 11:14 AM IST
    Follow us on

    Chandrababu Crying:  ఏపీ అసెంబ్లీ పరిణామాలు.. చంద్రబాబు ఏడుపుపై మీడియాలో రోజుకో కథనం వెలువడుతోంది. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టుకోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఆయన అనుయాయులు బాబు కన్నీళ్ల పెట్టుకోవడానికి కారణమైన వారిపై ఆక్రోశం వెల్లగక్కుతుండగా.. వ్యతిరేకులు మాత్రం ఇదంతా రాజకీయ కోణంలో భాగమేనని విమర్శిస్తున్నారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన వ్యవహరంపై అదేరోజు సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకమైన పోస్టులు చాలానే పెట్టి సందడి చేశారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం ‘ఇదంతా మొసలి కన్నీరు’ అని ఎద్దేవా చేస్తున్నారు. అయితే బాబు ఇంతలా ఏడవడానికి కారణంపై తీవ్ర చర్చ సాగుతోంది.

    Also Read: చంద్రబాబు కన్నీళ్లకు తెలుగు తమ్ముళ్ల ప్రతీకారమా?

    chandrababu crying

    అసెంబ్లీలో తన భార్యను అవమానించడంపై చంద్రబాబు ఈనెల 19న టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ఎదుట కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయనకు ఎప్పుడు బాధ కలిగినా కళ్లను తుడుచుకునేవారు.. కానీ ఈసారి మరీ చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే బాబు ఇంతలా ఏడ్వడం చూసి కొందరు టీడీపీ నాయకులు కూడా బాధను ఆపుకోలేక ఏడ్చేశారు. ప్రతీ నాయకుడు ఇలాంటి బాధలెన్నో పడ్డారు. కానీ చంద్రబాబులా అంతలా ఏడ్వలేదు. దానికి అయనకు జరిగిన అవమానం పెద్దదైనందువల్లే బాధతను తట్టుకోలేక ఏడ్చారని కొందరు అంటున్నారు.

    అయితే రాజకీయ నాయకులు ఏడ్వడంపై సహజకంగానే కొన్ని విమర్శలు వస్తుంటాయి. సందర్భం మరీ బాధ కలిగించినదే అయితే వారితో పాటు వారి అనుచరులు కూడా ఆపుకోలేరు. కానీ ఇదంతా ఎన్నికల కోణం అని కొందరు విమర్శిస్తున్నారు. ఎందుకంటే రాజకీయ రంగంలో ఎన్నో ఎదురుదెబ్బలు, ఎన్నో సంఘటనలు ప్రత్యక్షంగా చూసిన బాబుకు ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. ఈ పరిణామంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా వెంటనే మీడియా ముందకు వచ్చి తనను అవమానించినప్పుడు ఏమైంది బాబు..? అంటూ విమర్శలు మొదలు పెట్టారు. అంటే కొత్త పాచిక వేయడానికే బాబు ఇలాంటి ఎత్తుగడ వేశారా..? అని చర్చించుకుంటున్నారు.

    చంద్రబాబు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఎన్నికలు దగ్గరపడే సమయం వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తుంటారని కొందరు అంటున్నారు. 2003లో తిరుపతిలోని అలిపిరి బాంబు బ్లాస్ట్ జరిగిన సందర్భంగా 2004లో బాబు ఎన్నికల్లోకి వెళ్లారు. అయితే ఈ బాంబు దాడి నుంచి చంద్రబాబు తప్పించుకోగలిగారు. అప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్న బాబుపై వ్యతిరేకత వస్తోంది. ఈ విషయాలను తెలుసుకున్న బాబు అలిపిరి సంఘటనను రాజకీయంగా మార్చుకున్నట్లు టాక్.

    2004లో ఎన్నికల ప్రచారంబో బాబు బాంబు బ్లాస్ట్ పోస్టర్లతో ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా అలిపిరి సంఘటన పోస్టర్లే కనిపించాయి. అయితే 2003లో ఈ సంఘటన జరగగా 2004లో ఎన్నికల్లోకి వెళ్లారు. దీంతో చాలా రోజులుగా ఆ సంఘటనను ఎవరూ గుర్తుపెట్టుకోలేకపోయారు. పైగా ప్రతీ ఒక్కిరికి కంటపడేసేలా చేయడానికి ఇప్పట్లా అప్పుడు మీడియా డెవలప్ కాలేదు. దీంతో ఆ ఎన్నికల్లో బాబు ఘోర పరాజయం పొందారు. అంటే ఆ సమయంలో తెలుగు తమ్ముళ్లు చేసిన ‘సింపతి ప్రయోగం’ విఫలమైంది.

    గత రెండున్నరేళ్లుగా వైసీపీపై పోరాడుతున్న తెలుగుదేశానికి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీంతో బాబు కొత్త ప్రయోగం చేశారని అంటున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీలో జరిగిన వ్యవహారంపై బాగా ఏడ్చారని అంటున్నారు. ఈ విషయంపై సొంత పార్టీలోనే చర్చించుకుంటున్నట్లు సమాచారం. అయితే ఎన్నకలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ఈ సింపతి అప్పటి వరకు ఉంటుందా..? అని అనుకుంటున్నారు. ఈ ప్రయోగం ఎన్నికల ముందు చేస్తే బాగుండు కదా..? అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి ఈసారి బాబు ప్రయోగం ఫలిస్తుందా..? లేదా.. చూడాలి..

    Also Read: నక్సలైట్ల బాంబు పేలుళ్లకు చలించని చంద్రబాబు.. ఇప్పుడిలా ఎందుకయ్యారు?