Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రాంతీయతను నమ్ముకుంటున్నారు. ఇందులో భాగంగానే కోస్తా, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో ఉద్యమాలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు ప్రాంతాల విభజన సమయంలో జరిగిన నష్టాన్ని ప్రజలు ఇంకా మరిచిపోవడం లేదు. దీంతో ప్రాంతాల అభివృద్ధి చేయలేదనే ఉద్దేశంతోనే బాబును పక్కన పెట్టారని ప్రతీతి. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలపై దృష్టి సారించి అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకునేందుకు వైసీపీపై ఒత్తిడి పెంచుతున్నారు.

ఈ నేఫథ్యంలోనే జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చి అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టీడీపీపై సహజంగానే ఆగ్రహం వస్తోంది. దీన్ని దూరం చేసుకోవాలనే తపనలో బాబు సైతం మూడు ప్రాంతాలపై సమ దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడ ఆందోళనలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కార్యకర్తల చేత ధర్నాలు, రాస్తారోకోలు చేయిస్తూ తెర వెనుక ఉంటున్నారు.
టీడీపీ మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. దీంతో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరుగుతుందని ప్రాంతాల వారీగా ఆందోళన చేస్తున్నారు. దీంతో ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఇరు పార్టీలు తమ శక్తియుక్తుల్ని పెడుతున్నాయి.
ఈ క్రమంలో ప్రాంతీయ ఉద్యమాలను వేదికగా చేసుకుని టీడీపీ ముందుకు వెళుతోంది. వైసీపీ కూడా మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఉన్నట్లు చెబుతోంది. ప్రాంతీయంగా బలపడే క్రమంలో ప్రయత్నాలు ముమ్మర చేస్తున్నాయి. రాష్ర్టంలో జరుగుతున్న మార్పులకు పార్టీలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.