
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో దోషులెవరో ఇప్పటికీ తేలలేదు. సీబీఐ అధికారులు విచారణ జరిపినా సాక్ష్యాలు లభ్యం కాకపోవడంతో కేసు ముందుకు సాగడం లేదు. సీబీఐ ఇప్పటికే ఈ కేసులో భాగంగా ఎంతోమంది కీలక సాక్షులను విచారించింది. వివేకానందరెడ్డి చనిపోయిన రోజు మొదట గుండెపోటు అని ప్రచారం జరగగా ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : పవన్ కు అవమానం.. పోలీస్ గడపతొక్కిన జనసేన
అయితే సీబీఐ అధికారులకు మొదట కుటుంబ సభ్యులు గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారనే విషయం కూడా అర్థం కావడం లేదు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా టీడీపీ సర్కార్ అందుకు అంగీకరించలేదు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాతైనా వివేకా హత్య కేసు చిక్కుముడులు వీడతాయని ప్రజలు భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ విచారణ అవసరం లేదని కోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. అయితే వైఎస్ వివేకా కూతురు హైకోర్టును కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని కోరగా కోర్టు సీబీఐకు అప్పగించింది. అయితే ఇన్ని రోజుల తరువాత సీబీఐ వివేకా హత్య కేసు గురించి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసిందని తెలుస్తోంది.
అయితే సీబీఐ ఈ పిటిషన్ లో ఏం పొందుపరిచిందనే సమాచారం తెలియాల్సి ఉంది. వివేకా హత్య కేసులో టీడీపీ వైసీపీ ఆరోపణలు చేసుకోగా వివేకా హత్య కేసు ఎన్నికల ఫలితాలపై కొంత ప్రభావం చూపిందని నేటికీ టీడీపీ చెబుతూ ఉంటారు. అయితే సీబీఐ ఈ కేసులో అసలు దోషులను పట్టుకోలేకపోయిందని ఆ విషయాన్నే పిటిషన్ లో పొందుపరిచిందని ప్రచారం జరుగుతోంది.
Also Read : నేలవిడిచి సాము చేస్తున్న జగన్