https://oktelugu.com/

Tollywood Jagan: సినీ రంగ సమస్యలు తొలిగినట్లేనా..?ఈ భేటీతో ఎవరికి ప్రయోజనం..?

Tollywood Jagan: గత కొన్నినెలలుగా నెలకొన్న సినీ టిక్కెట్ల వివాదం సమసినట్లేనా..? ఎట్టకేలకు జగన్ ను ఒప్పించి.. సినీ ప్రముఖులు తాము అనుకున్నది సాధించారా..? లేక ప్రభుత్వమే సినీ పరిశ్రమపై దయ చూపిందా..? ఇన్నాళ్లు జగన్ ఎందుకు వెయిట్ చేశారు..? ఇప్పుడే పరిష్కారానికి ఎందుకు ముందుకు వచ్చారు..? అసలు సినీ పరిశ్రమలో ఈ వివాదం ఎవరితో మొదలైంది..? వారు ఇప్పుడేమంటున్నారు..? ఇలాంటి చర్చలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ జోరుగా సాగుతోంది. గురువారం […]

Written By:
  • NARESH
  • , Updated On : February 11, 2022 / 09:17 AM IST
    Follow us on

    Tollywood Jagan: గత కొన్నినెలలుగా నెలకొన్న సినీ టిక్కెట్ల వివాదం సమసినట్లేనా..? ఎట్టకేలకు జగన్ ను ఒప్పించి.. సినీ ప్రముఖులు తాము అనుకున్నది సాధించారా..? లేక ప్రభుత్వమే సినీ పరిశ్రమపై దయ చూపిందా..? ఇన్నాళ్లు జగన్ ఎందుకు వెయిట్ చేశారు..? ఇప్పుడే పరిష్కారానికి ఎందుకు ముందుకు వచ్చారు..? అసలు సినీ పరిశ్రమలో ఈ వివాదం ఎవరితో మొదలైంది..? వారు ఇప్పుడేమంటున్నారు..? ఇలాంటి చర్చలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ జోరుగా సాగుతోంది. గురువారం సినీ ప్రముఖులతో ఏపీ సీఎం జగన్ సమావేశం మొదలైనప్పటినుంచి ఇండస్ట్రీలో తీవ్ర ఉత్కంఠ సాగింది. అయితే పరిశ్రమలో ప్రధాన సమస్యగా భావించిన ఐదో ఆటకు ఓకే చెప్పించుకున్న సినీ ప్రముఖులు మిగతా విషయాలపై ఎందుకు తగ్గినట్లు..? అనేది సస్పెన్స్ గా మారింది.

    వాస్తవానికి సినీరంగంలో అనేక సమస్యలున్నాయి. కానీ ప్రధానంగా టిక్కెట్లపై వివాదం కొనసాగుతోంది. కొందరు సినీ ప్రముఖులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నా.. మరికొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెట్టారు. ఇక ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ ఏకంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం ఇప్పటికే మంత్రి పేర్ని నాని, సీఎం జగన్ తో పలుమార్లు భేటీ అయ్యారు. అయితే చివరికి కొంతమంది ప్రముఖులంతా కలిసి భేటీ కావడంతో ఒక్క డిమాండ్ కు మాత్రం అంగీకరించారు.

    ఈ వివాదం ఎక్కడ మొదలైందో ప్రభుత్వానికి తెలుసు.. ఎలా పరిష్కరించాలో కూడా తెలుసు.. కానీ కొన్నాళ్లు ఇలా నాన్చడంపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ సినీరంగంతో పాటు రాజకీయాల్లో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అలాగే కొందరు టీడీపీకి సపోర్టుగా ఉన్నారు. వీరి కోసమే సినీరంగంలో వివాదాన్ని సృష్టించారని అంటున్నారు. మరోవైపు సినీ పరిశ్రమను ఏపీకి తరలించాలని చూస్తున్నట్లు కొందరు వాదించారు. అయితే నిన్నటి భేటీలో సీఎం జగన్ విశాఖలో సినిమా షూటింగ్ తీయాలని, ఇక్కడ జూబ్లిహిల్స్ తరహాలో టాలీవుడ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తానని.. అందరూ ఇక్కడికి తరలిరావాలని పేర్కొనడం ఆ వాదనలకు బలం చేకూరుతోంది.

    సినీ ప్రముఖులంతా నిన్నటి భేటీతో సమస్య ముగిసినట్లేనా..? అంటే ఇంకా లేదనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గింపుతోనే ఇండస్ట్రీలో వివాదం మొదలైంది. కానీ ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అయితే ఐదో ఆట నడిపించుకోవచ్చని అవకాశం ఇచ్చింది. దీంతో భారీ బడ్జెట్ తో నిర్మించే చిత్రాలకు మాత్రమే ఈ ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక 5 షోలు నిర్వహించుకోలేని సినిమాల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. దీంతో ఈ భేటీ ఎవరి ప్రయోజన కోసం అని అంటున్నారు.

    ఇదిలా ఉండగా.. అసలు సినీ రంగంలోని వారంతా మేమంతా ఒక్కటే అని అనుకుంటున్నా.. చాలా మంది కలిసి రావడం లేదు. పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లు నిన్నటి భేటీలో కనిపించలేదు. మంచు ఫ్యామిలీ సహా ఇంకొందరు రాలేదు. దీంతో సినీరంగంలోని కొందరి ప్రయోజనాల కోసమేనా..? అని అంటున్నారు. అటు ప్రభుత్వం సైతం ఇన్నాళ్లు కొందరు మీదున్న కోపం కారణంగానే బెట్టు వీడనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సినీ రంగాన్ని ఆదుకోవాలని మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్ లు, డైరెక్టర్లు రాజమౌళి, కొరటాల శివలు కలిసి అంతా విన్నవించడంతో జగన్ ఐదు షో ల విషయంలో మెట్టు దిగినట్లు సమాచారం. జగన్ సర్కార్ పెంచే టికెట్ రేట్లు సైతం పెద్ద సినిమాలకు గిట్టుబాటు కావనే అభిప్రాయం సినీ ప్రముఖుల నుంచి వినిపిస్తోంది. అయితే మిగతా సమస్యలపై ప్రభుత్వం ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తుందోనని సినీ రంగానికి చెందిన వారు ఎదురుచూస్తున్నారు.