ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక చంద్రబాబు తొలి సీఎం అయ్యారు.. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించారు. అయితే.. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏకంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అసలు ఈ మూడు రాజధానుల ఆలోచన బీజేపీదా..? అలాంటి ఆధారాలు ఏమీ దొరకకున్నా అదే నిజమని అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా హైకోర్టు నోటీసులకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సమర్పించిన అఫిడవిట్లు చూస్తే అదే నిజమని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ ఆలోచననే జగన్ ఆచరణలో పెడుతున్నారని అంటున్నారు.
Also Read : బ్రేకింగ్: అంతర్వేది రథం దగ్ధంపై జగన్ షాకింగ్ నిర్ణయం
ఇటీవల కేంద్రం హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క రాజధాని మాత్రమే కాదు.. అంతకుమించైనా ఉండొచ్చని’ స్పష్టతనిచ్చింది. రాజ్యాంగంలో రాష్ట్రాల గురించి మాత్రమే ఉంటుందని.. రాజధానుల గురించి ఎక్కడా లేదని.. అది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని చెప్పుకొచ్చింది. దీంతో ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చినట్లైంది.
రాజ్యాంగంలోని అధికరణ 214, ఏపీ విభజన చట్టంలోని 30, 31 సెక్షన్లలోని నిబంధనలకు అనుగుణంగా 2019 జనవరి 1 నుంచి హైకోర్టు ప్రిన్సిపల్ సీటుగా అమరావతిని ఖరారు చేస్తూ రాష్ట్రపతి 2018 డిసెంబరు 26న ఆదేశాలిచ్చారని.. దానిని తాము నోటిఫై చేశామని కేంద్రం చెప్పింది. ‘అంత మాత్రాన, కేంద్రప్రభుత్వం అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించినట్లుగా భావించడానికి వీల్లేదు’ అని తాజాగా అఫిడవిట్‌లో పేర్కొంది. హైకోర్టు ప్రిన్సిపల్ సీటు తప్పనిసరిగా రాష్ట్ర రాజధానిలోనే ఉండాల్సిన అవసరం లేదు.
Also Read : ఆంధ్ర రాజకీయాలు కొత్త మలుపు
పిటిషనర్లు వేసిన కౌంటర్‌లో కేంద్రం పాత్ర గురించి ప్రస్తావించిన అంశాలు సరికాదు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలి’ అని హైకోర్టును కేంద్రం కోరింది. వీటన్నింటిని చూస్తే జగన్ తీసుకున్న మూడు రాజధానుల కాన్సెప్ట్‌కి కేంద్రం వంద శాతం మద్దతు తెలుపుతున్నట్లే. రాష్ట్ర హైకోర్టును రాజధానిలో కాకుండా కర్నూల్‌లో ఏర్పాటు చేయాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి బీజేపీ కోరుతోంది. ఇప్పుడు ఈ తరలింపుకు మార్గం పడినట్లేనని తెలుస్తోంది.