IRCTC : ఇతరులకు రైల్వే టికెట్‌ బుక్‌చేస్తే జైలుకే.. అసలు నిజం ఇదీ

IRCTC అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే.. రైల్వే చట్టం -1989లోని సెక్షన్ 143 ప్రకారం నేరంగా పరిగణిస్తారని రైల్వే మంత్రిత్వశాఖ 'ఎక్స్' వేదికగా స్పష్టం చేసింది.

Written By: NARESH, Updated On : June 25, 2024 9:52 pm

railway ticket

Follow us on

IRCTC : ఆన్‌లైన్ ద్వారా ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసేందుకు రైల్వే టికెట్ బుకింగ్, క్యాటరింగ్ సంస్థ ఐఆర్‌సీటీసీలో అకౌంట్ ఉండాలి. ఖాతా ఉన్నవారు కొన్నిసార్లు ఎవరైనా తెలిసినవారు టికెట్లు బుక్ చేయమంటే తమ ఐడీ నుంచి ట్రైన్ టికెట్లు బుక్ చేస్తున్నారు. అయితే, ఇకపై అలా కుదరదు. వ్యక్తిగత ఐడీ నుంచి ఇతరులకు ట్రైన్ టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్ష లేదా భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. రెండూ కూడా విధించొచు‍్చ. ఈమేరకు రైల్వే రిజర్వేషన్లపై ఇండియన్‌ రైల్వే కొత్త రూల్స్ అమలుల్లోకి తెచ్చింది. భారత రైలే‍్వ చట్టంలోని సెక్షన్‌ 143 ప్రకారం రిజిస్టర్‌ ఏజెంట్లు మాత్రమే ఇతరుల పేరిట టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఖాతా నుంచి ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే ఇకపై చిక్కుల్లో పడతారని రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో ప్రచారం జరుగుతోంది. కానీ, రైల్వే శాఖ ఈ వార్తలపై స్పందించింది. ఈ వార్తలను కొట్టి పారేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇవి ప్రజలను తప్పదోవపట్టించేవిగా ఉన్నాయని పేర్కొంది.

సాయం చేద్దామనుకుంటే చిక్కులే..
ఐఆర్‌సీటీసీ ద్వారా తత్కాల్ బుకింగ్, ఏసీ టికెట్ల టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి మొదలవుతుంది. ఇక నాన్‌ ఏసీ టికెట‍్ల బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆధార్ కార్డుతో ఐఆర్‌సీటీసీ ఐడీ లింక్ అయిన యూజర్లు నెలకు గరిష్టంగా 24 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ అనుసంధానం కాని ఖాతా అయితే 12 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే త్త రూల్స్ తెలియకుండా ఇతరులకు టికెట్లు బుక్ చేసిన వారికి గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష, రూ.10 వేల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. టికెట్ రిజర్వేషన్‌లో జవాబుదారీతనం తీసుకొచ్చి, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఐఆర్‌సీటీసీ కొత్త రూల్స్ తీసుకొచ్చిందని సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతునా‍్నయి. ఐఆర్‌సీటీసీలో పర్సనల్‌ అకౌంట్‌ ఉన్నవారు ఇకపై తమ రక్తసంబంధీకులు, ఒకే ఇంటి పేరు ఉన్నవారికి మాత్రమే టికెట్లు బుక్ చేసే అవకాశం ఉంది. స్నేహితులు, ఇతరులకు టికెట్‌ బుక్ చేస్తే రూ.10 వేల ఫైన్, మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంటుందని పేర్కొటున్నారు.

తప్పుడు ప్రచారం…
ఇదిలా ఉండగా, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రక్త సంబంధీకులు, ఒకే ఇంటిపేరు ఉన్నవారికి మాత్రమే రైల్వే ఈ-టికెట్లు బుక్ చేసేందుకు అవకాశం ఉందని, వేరే ఇంటిపేర్లు ఉన్నవారికి బుక్ చేయడంపై రైల్వేశాఖ ఆంక్షలు విధించినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని నమ్మవద్దు. ఇంటి పేరుతో సంబంధం లేకుండా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల పేరిట మీకు ఉన్న అవకాశం మేరకు ఈ-టికెట్లు బుక్ చేసుకోవచ‍్చన తెలిపింది.

ఇదీ నేరం…
కుటుంబ సభ్యులు, సే‍్నహితులకు కాకుండా మీ ఖాతా నుంచి టికెట్లు బుక్ చేసి వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం నేరం. కేవలం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లకు మాత్రమే థర్పార్టీ బుకింగ్ ద్వారా ఈ వెసులుబాటు ఉంటుంది. వారు మాత్రమే టికెట్లు బుక్ చేసి ఇతరులకు వికక్రయించే అధికారాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిగత ఐడీలతో బుక్ చేసిన ఈ-టికెట్లు వాణిజ్యపరమైన విక్రయం కోసం ఉద్దేశించినవి కాదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే.. రైల్వే చట్టం -1989లోని సెక్షన్ 143 ప్రకారం నేరంగా పరిగణిస్తారని రైల్వే మంత్రిత్వశాఖ ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేసింది.