
I-PAC Team Survey Report: మనం 175 నియోజకవర్గాలకు 175 కొట్టేస్తున్నాం. కష్టపడితే ఏమంతా సాధ్యమయ్యే పనికాదు. మీరంతా నాతో పాటే అసెంబ్లీకి మరోసారి రావాలని ఉంది. నాకు మీపై కోపం లేదు. అందరం కష్టపడి మరో 25 ఏళ్ల పాటు పార్టీని అధికారంలో నిలబెట్టాలన్నదే నా తపన. సీఎం జగన్ గత కొద్దిరోజులుగా చేస్తున్న కామెంట్స్ ఇవి. కానీ ఇలా ఎమ్మెల్యేల ముందు సెంటిమెంట్ పండిస్తునే.. జగన్ తెర వెనుక మంత్రాన్ని నడిపిస్తున్నారు. సర్వేలు, నిఘా సంస్థల నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రతీ నియోజకవర్గాన్నీ క్లీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఎక్కడ ప్రతికూలత ఉంది? ఎక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేయడం లేదు? ఏ నియోజకవర్గంలో పార్టీలో విభేదాలున్నాయి? అని క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. ఒకరిద్దరితో కాదు. అటు సర్వే సంస్థలు, ఇటు ఐ ప్యాక్ బృందాలు, ప్రభుత్వ నిఘా సంస్థలు జల్లెడ పట్టి నియోజకవర్గాల్లో పరిస్థితులను ఆరాతీశారు. నివేదికలతో సహా జగన్ టేబుల్ పై పెట్టారు.
Also Read: YCP: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ పరిస్థితేంటంటే?
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో జగన్ ఈ రోజు వర్క్ షాప్ నిర్వహించనున్నారు. గత వర్క్ షాపులో 32 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటూ బహిరంగంగానే వారికి హెచ్చరించారు. అందులో తాజా మాజీ మంత్రులు, సీనియర్లు ఉండడం విశేషం. అయితే ఈసారి అలానే హెచ్చరిస్తారా? లేకుంటే సూచనలతో సరిపెడతారా? అన్నది చూడాలి. ఇప్పటికే కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు వైసీపీలో ఒక రకమైన భిన్న వాతావరణాన్ని, అగాధాన్ని సృష్టించారు. హైకమాండ్ కూడా వారికి ప్రత్యామ్నాయంగా నాయకత్వాన్ని తయారు చేసుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తమలాగే ధిక్కార స్వరాలున్నాయంటూ వారు లీకులివ్వడంతో ఎలా ముందుకెళ్లాలో తెలియక హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది.
అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో అధికార వైసీపీలో ఒక రకమైన నిర్లిప్తత చోటుచేసుకుంది. క్రమశిక్షణ కూడా కట్టుదాటుతోంది. దాదాపు 75 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. విపక్షాలు చూస్తే బలం పెంచుకుంటున్నాయి. ప్రధానంగా ఐ ప్యాక్ కు హైకమాండ్ ప్రాధాన్యమిస్తుండడం ఎమ్మెల్యేలు, మంత్రులకు మింగుడుపడడం లేదు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ప్రతీ నియోజకవర్గంలో ఐ ప్యాక్ బృందం సభ్యుడిని నియమించారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే ఏ గ్రామానికి వెళుతున్నారు? ఎవరెవర్ని కలిశారు? అన్నది వివరాలతో కూడిన నివేదికను కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారు. అటు ఐ ప్యాక్ బృందానికి నచ్చకపోయినా ప్రతికూల నివేదిక ఇస్తున్నారు. దానిని అనుసరించి జగన్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతున్నారు.

ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని జగన్ చెబుతున్నారు. అంటే ఇంకా దానికి ఆరు నెలల వ్యవధే ఉంది. దీంతో చాలామంది ఎమ్మెల్యేల్లో అభద్రతాభావం నెలకొంది. కొన్నిచోట్ల ద్వితీయ శ్రేణి నాయకత్వంతో గ్యాప్ ఉంది. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి నామినేట్ పదవులు ఉన్నవారు ఉన్నారు. వీరందర్నీ పార్టీ హైకమాండ్ ప్రత్యామ్నాయ నాయకులుగా చూస్తున్నారు. ఎమ్మెల్యేలు ఏ మాత్రం కట్టదాటినా వారిని తెరపైకి తేవాలని చూస్తున్నారు. ఐ ప్యాక్ టీమ్ కూడా ఇటువంటి ప్రత్యామ్నాయ నాయకత్వంపై నిఘా పెట్టింది. వారి కదలికలను కూడా హైకమాండ్ కు ఎప్పటికప్పుడు చేరవేస్తోంది. ఇప్పుడు పార్టీ శ్రేణుల కంటే ఐ ప్యాక్ టీమే హైకమాండ్ కు ముఖ్యంగా మారింది. నేతల జాతకాలు ఐ ప్యాక్ టీమ్ వద్ద ఉన్నాయి.
Also Read:
Actor Hema: ఆ వ్యాపారంతో డబ్బులు సుఖం, అందుకే సినిమాలు చేయడంలా… హేమ షాకింగ్ కామెంట్స్!