Best Retirement Investment : మీరు ప్రతి నెల పొదుపు చేయడం బదులు మీకు వీలైన సమయంలో ఒకేసారి కేవలం ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి మీరు కొన్నేళ్లపాటు వదిలేసినట్లయితే అవి కోటి రూపాయలుగా మీకు తిరిగి వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బాగా బలపడాలని కోటీశ్వరులు కావాలని ఆశిస్తారు. దీనికోసం చాలామంది ప్రతినెల కొంత మొత్తంలో పొదుపు చేస్తారు. మరి కొంతమంది తమకు వీలైన సమయంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. పెట్టుబడి పెట్టాలని భావిస్తున్న వారికి మ్యూచువల్ ఫండ్స్ అందిస్తున్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చాలా బెటర్ అని చెప్పవచ్చు. దీంట్లో మీరు కేవలం ఒక్కసారి ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పద్ధతిలో 33 ఏళ్లలో మీకు భారీ మొత్తంలో తిరిగి వస్తుంది.
ఒక లక్ష రూపాయలు మీరు ఇందులో వార్షిక రాబడి 15% చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే మీరు కోటి రూపాయలు అందుకోవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పవర్ దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. రిటైర్ అయిన తర్వాత ఆర్థిక భద్రత ఉండాలని భావిస్తున్న చాలామందికి ఇది చాలా మంచి ఎంపికగా మారుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న చాలా రకాలలో ఏడాదికి మీకు సగటున 12 శాతం నుంచి 21 శాతం వరకు రాబడి అందిస్తున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో 15% రాబడి అనేది సగటున సాధ్యమే అని చెప్పవచ్చు. అయితే ఇందులో మార్కెట్ రిస్కు కూడా కొంచెం ఉంటుంది. మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నా కూడా మీకు ఇందులో దీర్ఘకాలంలో భారీ రాబడి లభిస్తుంది.
మీరు పెట్టిన లక్ష రూపాయల పెట్టుబడి పది ఏళ్ల తర్వాత నాలుగు లక్షలు గా మారుతుంది. ఇదే పెట్టుబడి 20 ఏళ్ల తర్వాత రూ.16 లక్షలకు చేరుకుంటుంది. ఇదే లక్ష రూపాయల పెట్టుబడి 30 ఏళ్ల తర్వాత రూ.66 లక్షలు గా మారుతుంది. ఇక లక్ష రూపాయల పెట్టుబడి 33 ఏళ్ల తర్వాత మీకు కోటి రూపాయలుగా మారుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే 27 ఏళ్ల వయసులో మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు 60 ఏళ్లు పూర్తయ్య సమయానికి అంటే 33 ఏళ్ల తర్వాత మీరు కోటి రూపాయలకు పైగా అందుకోవచ్చు.
Also Read : అద్భుతమైన పథకం.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కేవలం 5 ఏళ్లలో రూ.22 లక్షలు మీ సొంతం..