Swiggy And Zomato Services: దేశంలో ఆహార పదార్థాలను వినియోగదారులకు చేరవేసే యాప్ ల సేవలు కాసేపు నిలిచిపోయాయి. ఈ మేరకు స్విగ్గీ, జొమాటో సేవల్లో అంతరాయం రావడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్యలతో రెండు యాప్ లు అందుబాటులోకి రాకపోవంతో కష్టాలు తప్పలేదు. ఈ సమస్య తాత్కాలికమేనని కంపెనీ ప్రతినిధులు సూచించారు. జొమాటో, స్విగ్గీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి ఫామ్ లో ఉన్న సంస్థలు కావడంతో వాటిపై ఆదారపడిన వారి సంఖ్య పెరగడంతో కాసేపు విరామంతో వినియోగదారులు ఆశ్చర్యపోయారు.
వినియోగదారుల ఫిర్యాదులతో సంస్థలు నివ్వెరపోయాయి. రెండు యాప్ లు అరగంట నిలిచిపోవడంతో ఆర్డర్లు, లిస్టులు పెరిగిపోయాయి. తరువాత పని చేసినా కొంత మేర యాప్ లు పనిచేయలేదు. దీంతో వినియోగదారుల కంగారుకు చింతిస్తున్నామని కంపెనీలు ప్రకటించడం తెలిసిందే. సాంకేతికంగా వచ్చే సమస్యలను అధిగమించి తరువాత మళ్లీ ఫామ్ లోకి వచ్చాయి.
Also Read: Pawan Kalyan: ఏపీలో అధికారమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ప్రయత్నాలు
సాంకేతిక లోపంతో జరిగిన పొరపాటుతో సేవలు నిలిచిపోవడం గమనార్హం. ఆర్డర్లు బుక్ చేసుకున్న వారు గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో సమస్యలు ఎదురయ్యాయి. యాప్ లపై ఆధారపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా ప్రాంతాల్లో యాప్ ల సేవలు అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో యాప్ లోపం కారణంగా సేవలు దూరం కావడంతో వినియోగదారులు ఆందోళన చెందారు. సమయానికి తిండి పదార్థాలు రాకపోవడంతో కంగారు పడ్డారు. యాప్ లలో జరుగుతున్న పొరపాటుకు కంపెనీలు కూడా చింతించాయి. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి ఇబ్బందులు పడిన వారికి తిరిగి సేవలు పునరుద్ధరించడానిక సమయం పట్టింది. మొత్తానికి రెండు యాప్ ల తీరుతో వినియోగదారులు ఆందోళన చెందిన విషయం తెలిసిందే.
Also Read: CM KCR- Governor Tamilisai: ఢిల్లీకి చేరిన సీఎం, గవర్నర్ పంచాయితీ?