https://oktelugu.com/

టీఆర్ఎస్ లో అసంతృప్తుల దారెటో?

టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. పదవులు వస్తాయనే ఆశతో పార్టీ మారినా తగిన గుర్తింపు రాకపోవడంతో ఇక తమ దారి తామే చూసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లినా కొందరు ఏదో ఆశతో ఉండిపోతున్నారు. అలాంటి వారిలో కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. వీరు ప్రస్తుతం వార్తల్లో కనిపించడం లేదు. అసలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో వీరిలో అసంతృప్తి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : July 7, 2021 / 06:19 PM IST
    Follow us on

    టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. పదవులు వస్తాయనే ఆశతో పార్టీ మారినా తగిన గుర్తింపు రాకపోవడంతో ఇక తమ దారి తామే చూసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లినా కొందరు ఏదో ఆశతో ఉండిపోతున్నారు. అలాంటి వారిలో కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. వీరు ప్రస్తుతం వార్తల్లో కనిపించడం లేదు. అసలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో వీరిలో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.

    టీఆర్ఎస్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు నిశ్శబ్దం అయిపోయారు. అసలు పార్టీలో భవిష్యత్ ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడ్డారు. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్పొరేషన్ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరతారనే వార్తలు రావడంతో వారిని బుజ్జగించి పార్టీలో ఉండాలని సూచించారు. కానీ వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా చూడడంతో వారిలో నైరాశ్యం పెరిగిపోయింది.

    పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రావడంతో రెడ్డి సామాజికవర్గం నేతలంతా అటు వైపు చూస్తున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పుంజుకోదని భావించినా రేవంత్ రాకతో నూతన జవసత్వాలు రావడంతో నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి. దీంతో బీజేపీ సైతం ఇప్పుడు ఆలోచనలో పడింది. రేవంత్ రెడ్డి ఇంకా పుంజుకుంటే పార్టీకి నష్టమే అనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది.

    టీఆర్ఎస్ అంతృప్తులు కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకుంటున్నారు. త్వరలో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయడంతో ఆశావహులకు పదవులు దక్కకపోతే వారి దారి వారు చూసుకుంటారనే ప్రచారం సాగుతోంది. రెడ్డి సామాజిక వర్గంలో చాలామంది నేతలు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడు కేసీఆర్ తీసుకునే నిర్ణయాలపై పార్టీ భవితవ్యం ఆధారపడి ఉందని సమాచారం.

    ఇన్నాళ్లు కేసీఆర్ మాటలు నమ్మి పార్టీ కోసం సర్వస్వం ధారపోసినా తగిన గుర్తింపు రావడం లేదనే అక్కసు అందరిలో ఉంది. దీంతో వారు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎష్ పార్టీలో ముసలం మొదలవుతుందని సమాచారం. కేసీఆర్ ఒంటెత్తు పోకడతోనే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంలో పడిపోనుందని సమాచారం. దీనిపై ఏ మేరకు నిర్ణయం తీసుకుని పార్టీని గాడిలో పెడతారో వేచి చూడాల్సిందే.