Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అన్ని పార్టీలు ప్రస్తుతం ప్రచారంలో తలమునకలయ్యాయి. గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది. గెలుపు ఓటములను లెక్కలు వేసుకుని మరీ నాయకులు ప్రచారం జోరు పెంచుతున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు విజయం పై ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో అనేక సర్వే సంస్థలు ఇప్పటికే తమ ఫలితాలను వెల్లడించాయి. తాజాగా ఓ ఆంధ్రా సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
బీఆర్‌ఎస్‌కే మొగ్గు..
ఈ సర్వే చాలా సంస్థల తరహాలోనే తన సర్వే లెక్కల్లో కూడా కారు పార్టీకే మొగ్గు ఉన్నట్లు తెలిపింది. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 60 నుంచి 65 స్థానాలు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 25 నుంచి 30 సీట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీకి 5 నుంచి 8 సీట్లు వస్తాయని తెలిపింది.
చాలాచోట్ల నెక్ టు నెక్ ఫైట్..
ఇక ఈ సర్వేలో చాలా వరకు నెక్ టు నెట్ ఫైట్ ఉంటుందని తెలిపింది. సుమారు 10 నుంచి 19 సీట్లలో ఫలితాలను ఇప్పుడే అంచనా వేయలేమని తెలిపింది. ఎందుకంటే చివరి వరకు ఫలితం మారే అవకాశం ఉందని పేర్కొంది. చివరి నాటికి అభ్యర్థుల బలాబలాల ఆధారంగా ఫలితాలు ఉంటాయని పేర్కొంది. కొన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్ కాంగ్రెస్, మధ్య, మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్ బీజేపీ, ఇంకా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని తెలిపింది.
మరి ఈ సర్వే ఫలితం ఏమేరకు నిజమవుతుందో తెలియాలంటే.. ఎన్నికల ఫలితాలు వచ్చే డిసెంబర్ 3వ తేదీ వరకు ఆగాలి.
‘